Sunday, December 6, 2020

దత్తం దత్తం , పునర్దత్తం , యోవదేద్బక్తి సంయుతః తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి నసంశయః "

 క్రింది శ్లోకము నందు శ్రీ దత్తాత్రేయుల వారి నామ మహిమ వర్ణింపబడినది. 


🌹🍅🌷🌻🌸💐🍀🌷🌼🌺🍎🌿🌻🌹🌷


" దత్తం దత్తం , పునర్దత్తం , యోవదేద్బక్తి సంయుతః

 తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి నసంశయః  "



 🌹🌻🌷🌼🌸💐🍏🌺🍀🌷🌹🍁🌼🌹🍅


అనగా దత్తా , దత్తా , పునఃపునఃదత్తా అని ఎవరు భక్తిపూర్వకంగా ఉచ్చరించెదరో వారి సమస్త పాపములను క్షయమగును. యిందు ఏ విధమయిన సంశయము లేదు. 

    

   ' దత్తాత్రేయుడు స్మర్తృగామి ' అనగా స్మరణ చేసినంత మాత్రమునే దత్తాత్రేయుడు వచ్చి రక్షించును. పిల్లలు ఏ విధముగా మాటిమాటికి అమ్మా అమ్మా అని పలుకుదురో అదే విధంగా మనము మాటిమాటికి దత్తుని నామమును శ్రద్దభక్తులతో స్మరించిన యెడల దయామయిడైన ఆ అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు , సర్వజీవులను రక్షించు మరియు శిక్షించు వాడు. మన అందరియందు , అందరి అత్యంత సమీపమందు మనలోనే మన అత్మ అయి ఉన్న ఆ దత్తప్రభువు తన్ను భజించు వారిని కరుణతో , దయతో తల్లిదండ్రులు వలె సర్వకాల సర్వవస్థలయందును వదలక రక్షించును.  


   యీ నిశ్చయమును హృదయము నందుంచుకోని మనము సదా సర్వకాల సర్వావస్థలయందును , సుఖదుఃఖాది సమస్త పరిస్థితులయందును , దత్తుని దత్త నామమును స్మరించుచుండవలెను.


   హే ప్రభో ! దత్తాత్రేయ ! ఎల్లప్పుడును నీ నామస్మరణ చేయు భాగ్యము మాకు అనుగ్రహింపుము అని వారిని అత్యంత శ్రద్దాభక్తులతో ప్రార్థించుచుండవలెను.


No comments:

Post a Comment