Tuesday, May 14, 2024

అట్లే సాయిబాబా 16 యేండ్ల ప్రాయములో మొట్టమొదటగా షిర్డి గ్రామములో వేపచెట్టు క్రింద భక్తులకొరకు ప్రకటమయ్యారు " అని హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్రలో వ్రాశారు

 *"భాగ్యవశాత్తు భీమరది నదిలో గోణాయీకి నామదేవుడు లభించాడు.*


*అట్లే సాయిబాబా 16 యేండ్ల ప్రాయములో మొట్టమొదటగా షిర్డి గ్రామములో వేపచెట్టు క్రింద భక్తులకొరకు ప్రకటమయ్యారు " అని హేమాడ్ పంత్ సాయి సచ్చరిత్రలో వ్రాశారు.*


*ఈ ఇరువురి జన్మ చరిత్రలు ఎవ్వరికీ తెలియవు.*


*సాయిబాబా వలె నామదేవుడు భక్తి మార్గాన్ని ప్రోత్సహించాడు.*

*సాయిబాబా వలె నామదేవుఁడు కావాలనీ పేదరికాన్ని వరించాడు.*


*నామదేవుని ఇంటి సమీపములో పరిస్సాభాగవత్ అను వ్యక్తి వుండేవాడు.*


*భగవత్ రఖుబాయిని ప్రార్దించి ఇనుమును బంగారంగా మార్చే పరశువేదిని సంపాదించాడు.*

*భగవత్ భార్యా నామదేవుని దారిద్ర్యాన్నీ చూసి, ఆ పరశువేదిని నామదేవ్ భార్యకు ఇచ్చి, ఇనుమును బంగారముగా మార్చుకొమ్మని, తిరిగి పరశువేదిని తనకు ఇచ్చి వేయాలని చెప్పింది.*


*నామదేవునికి ఈ సంగతి తెలిసి దానిని చంద్రభాగా నదిలోకి విసరి వేసాడు.*


*కొన్నాళ్లకు భగవత్ భార్య నామదేవుని ఇంటికి వచ్చి, తాను ఇచ్చిన పరశువేదిని తిరిగి ఇచ్చి వేయమని కోరింది.*


*అక్కడే ఉన్న నామదేవ్ భగత్ ఇంటికి వెళ్ళి "అయ్యా భగత్ నీకు ఆ రాయి ముక్కపై అంత మక్కువ వుంటే నేను నదిలో మునిగి తెస్తాను "అని నదిలో మునిగి కొన్ని వందల రాళ్లు తెచ్చి " ఇందులో నీ విచ్చిన ఆ రాయి ఏదో గుర్తించు.*

*అందులో ప్రతి రాయిని లోహానికి తగిలించగా, ఆ లోహము బంగారంగా మారసాగింది. అది చూసి అందరూ అశ్చర్యపోయారు.*


*భౌతిక సుఖాలు కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానని భగత్ గుర్తించాడు.*


*సత్యాన్నీ గ్రహించి నామదేవుని కాళ్లపై బడ్డాడు.*

*ఇకమీద ఎటువంటి ఐశ్వర్యాలు కోరనని వాగ్దానము చేసాడు.*


*మహాత్ములు అందరినీ మహారాజులుగా చేయగలిగిన శక్తి ఉన్నా బీదరికంలో బ్రతకటం నామదేవునికి, సాయిబాబాకి ఇష్టం.*

No comments:

Post a Comment