Tuesday, May 14, 2024

హేమాడపంత్ మరాఠి భాషలో సాయిబాబా సచ్చరిత్రను మొదట ధారావాహికంగా సాయిలీల అనే పత్రికలో ప్రచురించటం జరిగింది

 *హేమాడపంత్ మరాఠి భాషలో సాయిబాబా సచ్చరిత్రను మొదట ధారావాహికంగా సాయిలీల అనే పత్రికలో ప్రచురించటం జరిగింది.*

*అయితే హేమాడ్ పంత్ 52 అధ్యాయాలు మాత్రమే రచించారు.*

*ఆయన సాయిలీల పత్రిక సంపాదకునికి పంపిన 53 వ అధ్యాయము దొరకలేదు.*

*53 వ అధ్యాయము లేకున్న సాయిసచ్చరిత్ర సంపూర్ణంగా ఉండదని " సాయి లీల " సంపాదకులు, సంపాదవర్గము 53 వ అధ్యాయము పునర్నిర్మితము గావించుటకు నిర్ణయించుకొనిరి.*

*ఈ 53 వ అధ్యాయ రచనా భారము శ్రీ బాలకృష్ణ విశ్వనాధ్ దేవ్ గారి భుజస్కంధములపై పడినది. ఆయన ఆ అధ్యాయమును చక్కగా కూర్చినాడు.*

*ఈ 53 వ అధ్యాయములో ఒక ప్రత్యేక విషయాన్ని శ్రీ బి.వి.దేవ్ గారు తెలుపుతారు.*

*మొదటి అధ్యాయములో హేమాడ్ పంత్ విఘ్ననాశకులైన వినాయకుని స్తుతిస్తారు.*

*జ్ఞానాంధకారాన్ని తొలిగించే జ్ఞానజ్యోతివని కీర్తిస్తారు. అంతటితో ఆగక "ఈ సాయి యే గజాననుడైన గణపతి.*

*ఈ సాయి యే పరశును చేతబట్టుకొని,విఘ్నములను తోలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయియే బాలచంద్ర గజాననుడు.* 

*ఏకదంత గజకర్ణుడు వీరే. విరిగి పోయిన దంతంతో విఘ్నకాలను విచ్చేదం చేసేవారు వీరే.*

*ఓ సర్వమంగళ మంగళా !లంబోదరా ! గణాధీశా ! సాయి దయామయా !మమ్ములను ఆత్మానందనిలయానికి తీసుకుని వెళ్ళండి " అని వినాయకుడు సాయినాథుని ఏకత్వాన్ని వర్ణిస్తాడు.*


*అలాగే ఆయన మొదటి అధ్యాయములో సరస్వతి సాయిబాబాల ఏకత్వాన్ని వర్ణిస్తాడు. సాయియే, భగవతి.*

*సాయి యే సరస్వతి.* *భక్తులకు ఉద్దరించడానికి ఓంకార వీణను ధరించి తమ చరితాన్ని తామే గానం చేస్తారు. అని ఆ ఇద్దరి ఏకత్వాన్ని తెలుపుతారు. ఇక సావిత్రీపతి, రమాపతి, ఉమాపతి కూడా సాయి యేనని వర్ణిస్తాడు.*


*ఇక 53 వ అధ్యాయ రచయిత కొత్త విషయాన్ని చెబుతాడు.*

*దత్తగురు స్వరూపులైన సాయినాథుని ప్రార్ధించి వారి అనుగ్రహాన్నీ, వేడుకొంటున్నాను ..వారు దోమచే మేరు పర్వతాన్ని లేవనెత్తించగలరు అని ఆయన వ్రాస్తారు.*

 *బి.వి. దేవ్ తన అభిమానాన్ని దత్తాత్రేయులే సాయినాధునిగా తెలుపుతాడు.*

*హేమాడ్ పంత్ రాయని ప్రత్యేక విషయాన్ని బి. వి. దేవ్ గారు వ్రాయటం జరిగింది.* 

*సాయి సచ్చరిత్ర గురు (దత్తాత్రేయ ) చరిత్రగా ప్రసిద్ధికెక్కింది.*


*సాయిబాబా సచ్చరిత్రను సంక్షిప్తంగా ఆంగ్ల భాషలో శ్రీ .N .V. గుణాజీ గారు తీసుకుని వచ్చారు.* *దానిని ఆధారంగా తెలుగులో శ్రీ ప్రత్తి నారాయణరావు గారు అనువాదము చేశారు.*


*శ్రీ ప్రత్తి వారు తమ విజ్ఞప్తిలో (1953 సం .ప్రచురణ ) ఇలా రాశారు "సాయిబాబా యే గణపతిగా స్వప్నములో నాకు దృష్టాంతమిచ్చిరి.*

 

*ముందుగా తెలియపరచి రెండవనాడే గురుస్థానములో జపము చేయుచుండగా శ్రీశేషశాయిగా సాక్షాత్కిరించారు గ్రంధములన్నీ శోధించీ సాయిబాబా ప్రస్తుత దత్తాత్రేయుని అవతారమని మరాఠి పండితుఁడగు L .R .పాంగాకర్ కనిపెట్టారు.*


*షిరిడీ సంస్థాన్ వారి పూజావిధానాన్ని బట్టి సాయబాబాయే దత్తాత్రేయులని నిర్ధారణ చేయవచ్చును.*


*అలా సాయినాథుని వలె శ్రీపాదశ్రీవల్లభులు, శ్రీ నరసింహాసరస్వతి స్వామీ మాణిక్యప్రభువు, అక్కల్కోట మహారాజులు దత్తావతారులుగా కీర్తింపబడ్డారు.*

*ఆ అయిదుగురే " దత్త పంచకం " గా స్తోత్రం గావింపబడినారు.*


*సాయి భక్తులకు 2022 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు💐💐*

No comments:

Post a Comment