*సాయిబాబా ముందు సన్నాయి వాయిద్యం.*
*బాలాజీ పిలాజీ గురవే అనే సాయిభక్తుడు తరచూ ద్వారకామాయిలో బాబా ముందు సన్నాయి వాయిద్యం వాయించేవాడు.*
*బాబా అది విని " వీడు నన్ను తిడుతున్నాడు " అని బాబా కోపముతో అతణ్ణి కొట్టడానికి వెళ్లేవారు.*
*బాలాజీ బాబా దెబ్బలనుండి తప్పించుకొని, మరీ సన్నాయి వాయించేవాడు.*
*సాయిబాబా బాలాజీని*
*" గురువాడా " అని పిలిచేవారు.*
*ఒకసారి బాలాజీ కొడుకు, బాలాజీతో పాటు ద్వారకామాయికి బాబా వద్ధకు వస్తానని మారం చేసాడు. బాలాజీ దానికీ అడ్డుచెప్పి కోపించి కొట్టాడు.*
*అతడు బాబా దర్శనానికి వెళ్ళగా ," ఆ చిన్ని వెధవను ఎందుకు ఆలా కొట్టావు ? నా వద్దకి వస్తానంటే తీసుకు రావచ్చును కదా ! నీ సొమ్మేమి పొయింది ? అని బాలాజీ పై కేకలేశారు.*
*బాలాజీ బాబా సర్వఙ్ఞతకు, బాబాకు పిల్లలపై ప్రేమకు చలించిపోయాడు.*
*కొన్నాళ్లకు బాబా బాలాజీ భార్య కు కలలో కనపడి ఒక అర్థరూపాయి ఇచ్చారు.*
*బాలాజీ భార్యా కలలోనే, బాబాను ఒక గుడ్డను అడిగింది.*
*అందుకు బాబా " తరువాత ఇస్తానులే ! అని స్వప్నంలోనే చెప్పారు.*
*స్వప్నం ముగిసింది.*
*నిజముగానే అక్కడ అర్థరూపాయి నాణెం కనపడింది. ఆమె దానిని పూజించ సాగింది.*
*ఇక బాలాజీ సంసారం సుఖంగానే సాగిపోతున్నది.*
*బాబా బాలాజీ భార్యకు వాగ్దానము చేసినవిధంగా, సాయిబాబా సమాధి చెందిన తరువాత, సమాధి చేయు సంధర్భంలో బాబా శరీరంపై కప్పబడ్డ వస్త్రం ఆమె కుమారుని కి లభించింది.*
*ఆ విధముగా బాబా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.*
No comments:
Post a Comment