Tuesday, May 14, 2024

భక్తులను సిరిసంపదలతో తులతూగేటట్లు చేసి తాను మాత్రం భిక్షపాత్రను వదలక కాల జ్ఞాని, త్రిలోక జ్ఞాని, త్రిలోకనాధుడు శిరిడీ సాయిబాబా.

 *" భక్తులను సిరిసంపదలతో తులతూగేటట్లు చేసి తాను మాత్రం భిక్షపాత్రను వదలక కాల జ్ఞాని, త్రిలోక జ్ఞాని, త్రిలోకనాధుడు శిరిడీ సాయిబాబా.*

         

*by స్వామీ కేశవయ్యజీ.*

----------------------------------------

*సాయిబాబా వంటి సత్పురుషుణ్ణి దర్శించాలంటే ఓర్పు అవసరం అని ఆంగ్లేయులైన కర్టిస్ దంపతుల వృత్తాంతం ద్వారా తెలుస్తుంది.*

*కర్ణాటకకు చెందిన సద్గురు భగవాన్ శ్రీధరస్వామి ఒకసారి భీమానుకొనే అను గ్రామములో సూర్యనారాయణ అను భక్తుని గృహంలో ఉన్నారు " అర్హతలేనివాళ్లకు నా దర్శనం కాదు.*

*నావల్ల ఉద్ధరింపబడాలనే వ్యక్తులనే, భగవంతుడు నా వద్దకు పంపిస్తాడు " అని అన్నారు శ్రీధరస్వామి.* *సూర్యనారాయణకు ఈ మాట అర్థం కాలేదు.*

*సూర్యనారాయణ తన గ్రామంలోని వ్యక్తులందరినీ తన ఇంటికి వచ్చి భగవాన్ శ్రీధరస్వామి దర్శనం చేసుకోమని అందరినీ ఆహ్వానించాడు.*

*మరునాడు ఉదయము రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకడు శ్రీధరస్వామి దర్శనం కొరకు వచ్చాడు.*

*సద్గురువు గది తలపులు వేసివున్నాయి. ప్రతీ ఐదునిమిషాలు కొకసారి ఆ అధికారి అసహనంగా తన గడియారం వైపు చూసేవాడు. అరగంట దాటింది.*

*చివాలున ఆ వ్యక్తి లేచి, సూర్యనారాయణతో "చూడు నేనొచ్చి ఎంతసేపు అయిందో తెలుసా ! మీ గురువుగారు ఇంకా నిద్రలేవనే లేదు. చూస్తే కుంభకర్ణుని వలె ఉన్నాడు " అని చెప్పి వడివడిగా వెళ్లిపోయాడు అడుగుపై అడుగువేసుకొంటూ.*

*ఆ వ్యక్తి వెళ్లిన వెంటనే సద్గురు శ్రీధరస్వామి గది తలుపులు తీసుకుని బయటకి వచ్చి సూర్యనారాయణ వంక చూసారు.*

*అర్హతలేని వాళ్లకు దర్శనం కాదన్న సూక్తి అప్పుడు అతనికి అర్ధమయ్యింది.*

No comments:

Post a Comment