*శివుణ్ణి సాలెపురుగు, ఏనుగుతో పాటుగా, సర్పము కూడా భక్తితో సేవించింది.*
*అందుకే శివుడు కాళహస్తీశ్వరుడైనాడు.*
*సరిగ్గా 81 సంవత్సరాలు క్రితం అంటే ..... అది 1943 సం. జనవరి 7 వ తేదీ గురువారం.*
*కోయంబత్తూర్ సాయిబాబా మందిరంలో సాయంత్రం*
*5 .30 .గంటల* *సమయములో, స్త్రీలు, పురుషులు, పిల్లలూ అందరూ కలసి దాదాపు నాలుగు వందలమంది భజన చేస్తున్నారు.*
*ఆ సమయములో ఒక సర్పము మందిర మండపము వద్దకు వచ్చి ఒక భక్తుని కాళ్ళ మీదుగా పాకి, మందిరము నందున్న బాబా ఫోటో వైపు వెళ్ళింది.*
*"పాము -పాము " అని ఒక భక్తుడు అరవగా కొందరు వెంటనే లేచారు.*
*సర్పము పడగ విప్పి అటు ఇటూ ఆడి, సాయిబాబా బాబా పటం ముందు పది నిముషాలు నృత్యం చేసి, జనానికి పది అడుగులు దూరంలో తల ఆడిస్తున్నది .భక్తుల భజనను ఆలకిస్తున్నది.*
*భక్తుల చేసే భజన, రాత్రి తొమ్మిది గంటలకు పూజ అయిన తరువాత అందరూ ప్రసాదాలు తీసుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.*
*ఆశ్రమములో ఉండేవారు, మరికొందరు రాత్రి అంతా భజన చేస్తూనే ఉన్నారు. సర్పముకూడా అక్కడే ఉండిపోయింది.*
*ఉదయం భక్తులు వచ్చి అష్టోత్తరం చదివి పూజ చేసారు.*
*సర్పముపై బుట్టెడు పువ్వులు వేశారు. సర్పము ప్రశాంతముగా పుష్పాలను స్వీకరించింది.*
*తరువాత 9 గంటలకు సాయి మందిరానికి ప్రదక్షిణ చేసి వచ్చి, మందిరంలో నృత్యము చేయసాగింది.*
*అక్కడికి షుమారు అయిదు కిలోమీటరు దూరంలో ఉన్న ఫోటోగ్రాఫర్ కు కబురు పెట్టగా వచ్చాడు. ఫోటోలు తీయడానికి సాయిబాబా ఫోటోను సర్పము దగ్గరగా ఉంచారు సర్పానికి రెండు అడుగుల దూరంలో ఉండి ఫోటోగ్రాఫర్ ఫొటోలు తీసాడు.*
*తరువాత సర్పానికి దగ్గరగా పాలు ఉంచారు. సర్పం ఆ పాలు సేవించింది. సరిగ్గా 11 గంటలకు మందిరము నుండి ఉత్తర దిశగా వెళ్లి అదృశ్యమైంది.*
*సర్పం బంగారు వర్ణములో ఉన్నది పడగ మీద శంఖు, చక్రాలు వున్నాయి.*
*సాయి మందిరం వద్ద గానీ, చుట్టుపట్ల గానీ ఎక్కడా పాము పుట్టలు లేవు.*
*మానవులే సాయిబాబాకు భక్తులు కానక్కరలేదు. శ్రీ కాళహస్తీశ్వరుని వలే సాయి కూడా సాయీశ్వరుడే కదా !*
No comments:
Post a Comment