*" అన్ని పరిమితులకు పరమైనది, సకల బేధ భావాలను అభావము చేసేది, మతాలమధ్య కనిపించే తరతమ అంతరాలకు అతీతమైనదే,సత్యమైన అధ్యాత్మిక తత్వం.*
*ఆ మహత్తర తత్వమే, శ్రీ సాయిలీలా ప్రబోధాలద్వారా మహా మహిమోపేతంగా ఆవిష్కరింపబడినది.*
*పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.*
----------------------------------------------------------------
*రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ గృహంలో పూజింపబడే గణపతి విగ్రహంలోని ఒక చేయి విరిగింది.*
*అందువల్ల అందరూ ఆ విగ్రహాన్ని అవతల పారవేయమన్నారు.*
*తర్ఖడ్ భార్య షిర్డి వెళ్ళి సాయిబాబాను దర్శించి, విగ్రహం గూర్చి అడిగింది.* *అది విన్న బాబా ఆమెతో "అమ్మా ! నీ బిడ్డ ఒక చేతిని విరగ్గొట్టుకొంటే, ఆ బిడ్డను నీటిలో పారవేస్తావా ? నిత్యము ఆ విగ్రహాన్ని పూజించు " అని అన్నారు.*
*తర్ఖడ్ కుటుంబం అలాగునే చేసింది.*
*భౌతికమైన గణేశ విగ్రహంలోని లోటుపాట్లు భక్తి వ్యక్తీకరణను ఏ రకంగానూ ఆటంకపరచవు.*
*ఎందుకంటె అనంతుడు, అఖండుడు అయిన భగవంతుడు పగిలిపోవటమేమిటి ?*
*అసలు భగవంతునికి ఒక రూపము అంటూ ఉన్నదా ? ఏ రూపమైనా, ఏ నామమైనా అతనికేచెందుతాయి.*
*అందుకనే సాయి సచ్చరిత్ర గ్రంథ రచయిత అయిన హేమడ్ పంత్, తన గ్రంథంలో" సర్వమంగళ మాంగల్యా లంబోదరా, సాయినాధునితో ఐక్య రూపముగల కృపామూర్తీ, గణనాధా ! నన్ను ఆనంద డోలికలలో తేల్చి, ఆత్మసుఖము దగ్గరకి చేర్చు " అని ప్రార్థన చేశాడు.*
*సాయియే గణపతి - గణపతియే సాయి .*
No comments:
Post a Comment