Tuesday, May 14, 2024

శ్రీ సాయబాబా పట్ల భక్తిగా ఉండేందుకు పదకొండు కారణములు .


శ్రీ సాయబాబా పట్ల భక్తిగా ఉండేందుకు పదకొండు 

కారణములు .

1 మొదటిదీ, విశిష్టమైనది అయిన కారణం 

బాబా భక్తుల కోరిన కోరికలు తీర్చే నియమము 

పెట్టుకున్నారు .భక్తులు ఏమేమి కోరుతారో వాటిని 

వారికివ్వాలని నియమము పెట్టుకున్నారు .

(అధ్యాయం 13 -ఓవి 60 )

2 అది కూడా వేంటనే అలస్యం కాకుండా ,మీరు 

నిజమైన శ్రద్దతో అడగండి .సహనం పెట్టుకోండి .

ఇక మీకోరిక తీరిపొయినట్లే .(అ .15 .ఓ -67 .)

3 ఆయన ప్రసన్నులగుటకొరకు కష్టదాయకమైన 

ఉపవాసాలూ ,తపవాసాలు అక్కరలేదు .

నీవు నావైపు అనన్యంగా చూడు .నేను కూడా 

ఆలాగే చూస్తాను .(అ .19 .ఓ .73 )

4 బాబా దేహత్యాగము చేసి నూరు సంవత్సారాలైనది .అయినా ఈ రోజుకీ లక్షలాది 

భక్తులకు తమ ఉనికిని తెలుపుతున్నారు .

భక్తుల పిలుపుకి ఆయన పరుగున వస్తున్నట్లు 

అనుభవం కూడా కలుగుతుంది .(నా ఎముకలు 

సమాధినుంచి మీకు సమాధానం దొరుకుతుంది .

(అ .25 .ఓ .105 ).



5 బాబా ఇప్పుడు దేహంలో లేకున్నా అయనను సద్గురువుగా భావించి భక్తి కలిగి వుంటే మనం 

మోసపోతామేనన్న చింత వుండదు .ఈ రోజులల్లో 

మన దేశములో తమను భగవాన్ ,అవతార పురుషుడు ,మహర్షి అని పిలుపించుకొనే అనేక మంది గురువులను చూసినప్పుడు నిజమైన 

గురువు ఎవరో తెలుసుకోవడం చాల కష్టమై పోయింది .(అ.47 .ఓ 9  )

6 బాబాపట్ల భక్తి కలిగి ఉండటానికి డబ్బు అవసరం లేదు .కేవలం పూలు ,ఆకులు ,

నిజమైన ప్రేమతో మోక్షము ప్రాప్తిస్తుంది .

ఆదరంతో ఏది సమర్పించినా ఆయనకు సరిపోతోంది .ఇంతేమిటి ? రెండు చేతులతో చేసే 

నమస్కారాన్ని కూడా ఇష్టపడతారు .

సాయిబాబాకి రెండు చేతులు ,ఒక తల ,అనన్య విశ్వాసం ,అనన్య శ్రద్ద కేవలం చాలు 

(అ .13 .ఓ 180 )

మిగతా భాగం రేపటి దినం .



బాబాపట్ల భక్తిగా ఉండేందుకు పదకొండు కారణాలు .

(నిన్నటి భాగం తరువాయి ) 

7  బాబాకు మన కష్టాలు చెప్పుకోడానికి ప్రతీసారి 

డబ్బు ఖర్చు పెట్టుకుని షిరిడీకి పోనవసరం లేదు .ఆయన తన భక్తులు ఎక్కడినుంచైనా 

(సప్తసముద్రాల కవతలినుంచైనా )సరే పిలిస్తే 

ఆయన పరుగున వస్తారు .(అ .40 .ఓ 32 .)

8 .ఆయన ద్వారకామాయిలోని అఖండంగా వెలిగే ధునిలోని విభూతి సర్వరోగాలకు రామ బాణంలాంటి ఔషథం .దాని ధర కేవలం రెండు 

పైసలు .శ్రద్ద -సహనం .(అ .33 ఓ 16 )

9 హేమడ్ పంత్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్ర లో 

వేదం -ఉపనిషత్తులు -భగవద్గీత -వీటి సర్వస్వం 

గోష్టి రూపంలో వుంది .వాటిని సతతం చదివి ,

మననం చేసి ,వాటిలోని ఉపదేశాన్ని ఆచరణలో 

పెడితే నిశ్చయంగా మోక్షము ప్రాప్తిస్తుంది .

(అ .53 ,ఓ 171 .)

10 -బాబాకు ఉన్న పేరు ఎంత చిన్నది ? ఎంత తియ్యనిది .పలకటం ఎంత సులభం .కష్టమైన 

జొడక్షరాలు లేవు .నాలుకకి బాధ లేదు .

(అ .10 .ఓ 135 )

11 చివరిదీ ,మహత్వపూర్వకమైనదీ అయిన కారణం ,శ్రీ సాయబాబా మీ ఐహిక ఇచ్ఛలు నెరవేర్చి ,మిమ్మల్ని మొహమయ సంసారములో 

చిక్కుకొనివ్వరు .మెల్లమెల్లగా మీకు పరమార్థికం 

పై అసక్తి కలిగించి ,పదే పదే దిశలు చూపించి ,

నిత్య ఆనందమయమైన మోక్షము వద్దకి తీసుకెళతారు .

నన్ను అనన్యంగా శరణు వచ్చి ,ఎవరు నన్ను 

నిరంతరం స్మరిస్తుంటారో వారి ఋణం నా తల మీద ఉంటుంది .వారిని ఉద్దరించి దానినుంచి 

నేను ముక్తుడవుతాను .(అ .44 ,ఓ 151 )

No comments:

Post a Comment