Tuesday, May 14, 2024

సత్యం తెలుసుకున్న గురువులు సాదాసీదాగా ఉంటారు "* *నాకేమీ వద్దు " అనేది సద్గురువుల మరో లక్షణం.* *ఎక్కువగా మౌనంగా ఉంటారు.*

 *సద్గురు అన్వేషణ*


*సత్యం తెలుసుకున్న గురువులు సాదాసీదాగా ఉంటారు "*

 *నాకేమీ వద్దు " అనేది సద్గురువుల మరో లక్షణం.* *ఎక్కువగా మౌనంగా ఉంటారు.*


*శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో గురువు మౌన వాఖ్య ద్వారా పరబ్రహ్మ తత్వాన్ని తన శిష్యులకు తెలియచేసేరంటారు.* 


*ఆత్మ తత్వ విచారము చేయడం అంత సులువేమీ కాదు.*

*శ్రద్ద కావాలి. శ్రద్ద లేనివారు మాములు పనులే చేయలేరు.* 

*అటువంటిది బ్రహ్మవిద్య గురించి తెలుసుకొవడం సాధ్యమేకాదు.*

*తెలుసుకొన్నవారి వద్ద శుశ్రూష చేసి బ్రహ్మవిద్యను అభ్యసించాలని శాస్త్రం చెబుతున్నది.*

*శాస్త్రం తెలుసుకొన్నవారు కూడా ఎంతో జిజ్ఞాస కలవారికే చెబుతారు.* 

*లౌకిక విధులు సక్రమముగా నిర్వహిస్తూ అలౌకిక విషయాల గూర్చి తపన ఉన్నవారికే బోధ అందుతుంది.* 

*డబ్బు ప్రధానమే అన్నవారికి అధ్యాత్మిక అంతర్యామి సాధన రుచి తెలియదు.*


*కనీసం తెలుసుకోవాలని తోచదు. కలియుగ ప్రమాణంలో సగటు మానవుని ఆయుర్దాయం 0.002 %అని మనం తెలుసుకోవాలి.*


*గురువు అంటే భగవంతుడే.గురువును* *త్రిమూర్తి తత్వంగా, సాక్షాత్తూ పరబ్రహ్మంగా మనం రోజూ ప్రార్థన చేస్తుంటాం.* 


*అటువంటి గురువు దొరికిన తరువాత సాధకుడు అయనను అనుసరించాలి సాధన వ్యక్తిగతం మాత్రమే.*


*ఆకలి తీరటానికి ఎవరి అన్నం వారే తినాలి కానీ వేరొకరు తింటే తమ ఆకలి తీరదు కదా !* 


*కొంతమంది శిష్యులు గురువును అనుకరిస్తారు కానీ గురువును అనుసరించరు.* *అనుసరించటం అంటే గురువాక్యాన్ని శిరోధార్యంగా భావించి సాధన చేయాలి.* 


*ఏ గురువైనా శిష్యుడి అధ్యాత్మిక పురోగతికి కావలసిన మార్గాలు ఉపదేశిస్తాడు.*


*నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రతీ వ్యక్తిని పరమాత్మ స్వరూపంగా భావించటం, జరగుతున్న ప్రతీ సన్నివేశం భగవంతుని లీలగా దర్శించడం అభ్యాసము చేయాలి.*


*ఈ సాధన బాగా జరగాలంటే మన స్వభావాన్ని మనం దాటాలి.*


*ఇది అంత సులభమైన విషయం కాదు. ఎంతో జాగ్రత్తగా కష్టపడి కట్టుకున్న మన ఇంటిని మనమే కూల్చుకొన్నంత బాధ కలుగుతుంది.*


*సద్గురువు, శిష్యుని సాధన బాగా జరగటానికి తన ఆశీస్సులను బోధనలను అందచేస్తుంటారు.*


*మన పని కేవలం గురువు ఇచ్చిన మార్గాన్ని అనుసరించటమే.* 


*మన నిజ స్వరూపము గురించి తెలియచేసి, భగవంతుని సంతానమే మనమని చూపించగలిగిన సద్గురువు దొరకాలని ప్రార్దించాలి.*


*తన లోపల తాను వెతుకుతున్న స్వరూపం బయటపడగానే అన్వేషకుడి అన్వేషణ ఆగిపోతుంది. తనకు లభించిన గురువు లొపల కనిపించిన మూర్తి ఒకరే అని తనకే తెలుస్తుంది.*


*సద్గురు అన్వేషణ సాధన చేయాలని సంకల్పించుకొన్న ప్రతీ ఒక్కరూ మార్గదర్శనం చేయకలిగిన గురువు కోసం భగవంతుని ప్రార్దించాలి.* 

*ప్రార్థన ఎంత మక్కువగా చేస్తే అంత త్వరగా గురువు దర్శనం లభిస్తుంది అని అంటారు.*


*శాస్త్రాలు ప్రకారం గురువే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అలా గురువును భగవంతుడే మన దగ్గరకి పంపిస్తాడని చెబుతారు*

 

*కనిపించని భగవంతుడు కనిపించే గురువుని ఎందుకు పంపుతాడంటే మనం సాధన బాగా చేసి, గురువు ద్వారా తన గురించి తెలుసుకొంటామని.*


*గురువును ఎన్నుకోగలిన శక్తి ఉన్నవారికి గురువు అవసరం వుండదు. ఎందుకంటే వారు గురువు కంటే గొప్పవారై వుంటారు.*


*ఒకవేళ మనమే గురువును ఎన్నుకొంటే కొన్నిరోజుల తరువాత అతనిలోని గుణాలు నచ్చక వదిలిపెట్టడం జరుగుతుంది.*


*అలా కాకుండా గురువే మనల్ని ఎన్నుకొంటే ఆ గురువు మనల్ని ఎన్నటికీ వదలటమనేది ఉండదు.*


*భౌతికమైన రూపంలో గురువు దర్శనం జరిగినప్పటికీ గురువు అనేది తత్వం మాత్రమే.*

No comments:

Post a Comment