బాబా వారి ఊదీ యొక్క అమోఘమైన శక్తి గురించి ఈరోజు ఒక అధ్భుతమయిన సంఘటన తెలుసుకుందాము.
శ్రీమూలే నాసిక్ లో ప్రముఖ న్యాయవాది. ఆయన, ఆయన భార్య ఇద్దరూ బాబా భక్తులు. మూలే గారు ఎన్నో ఆధ్యాత్మిక సాంప్రదాయాలను పాటించే వారు. అంతే కాదు ధ్యానం, యోగా కూడా చేసేవారు. ఎక్కువ సార్లు ఉపవాసాలు ఉంటూ ఉండేవారు. ఆయన ఉపవాసాలు చాలా కఠినంగా ఉండేవి. ఆయన రోజుల తరబడి, వారాలు, ఒక్కొక్క సారి నెలలపాటు ఉపవాసాలు ఉండేవారు.
ఆయన పాలు మాత్రమే తీసు కుంటూ, ఆయా కాలాలలో దొరికే పండ్లను మాత్రమే చాలా సార్లు ఆహారంగా తీసుకునే వారు. అయినప్పటికీ ఆయన చాలా చురుకుగాను, బలం గాను ఉండేవారు. ఆయన శరీరం చుట్టూ ప్రకాశవంత మయిన వెలుగు (ఆరా) ప్రసరిస్తూ ఉండేది. ఆయన వదనం ప్రకాశవంతమయిన వెలుగుతో కాంతవంతంగా ఉండేది.
ఒకరోజు ఆయన ఇంటిలోకి ఒక సర్పం ప్రవేశించింది. ఆ సమయంలో ఇంటిలో ఆయన భార్య ఒక్కతే ఉంది. మూలేగారు కోర్టుకు వెళ్ళారు. ఇంటిలో మగవారెవరూ లేరు. మూలేగారి భార్య సర్పాన్ని చూసి, మనఃస్ఫూర్తిగా ఎంతో వేగంగా బాబాని ప్రార్ధించ సాగింది. ఆ సర్పం గదిలో ఒక మూలకు వెళ్ళి చుట్టచుట్టుకుని కూర్చుంది. మూలేగారి భార్య ధైర్యాన్ని కూడదీసుకుని పూజ గదిలోకి వెళ్ళి ఊదీ ఉన్న చిన్న పెట్టెను తీసుకుని వచ్చింది.
ఆమె బాబాకు శిరసు వంచి నమస్కరించు కుని సర్పం చుట్ట చుట్టుకుని పడుకున్న చోటకి వెళ్ళింది. ఆ సర్పంతో “ఓ! నాగదేవతా! ఇది బాబా ఊదీ. నువ్వు ఈ ఊదీని గౌరవిస్తావని నేను అనుకుంటున్నాను. నేను ఈ ఊదీతో లక్ష్మణ రేఖను గీస్తున్నాను. నువ్వు ఈ గీత దాటి రావటానికి వీల్లేదు” ఇలా అని ఆమె ఊదీతో ఒక పొడవాటి రేఖను గీసింది. ఆశ్చర్యకరంగా ఆ సర్పం ఊదీ రేఖను దాటి బయటకురాలేదు.
ఆ తరువాత ఆమె ఇంటిలోకి వెళ్ళి ప్రశాంతంగా తన పనులు తాను చేసుకో సాగింది. మూలేగారు కోర్టు నుంచి వచ్ఛిన తరువత మంత్రం చదివి ఆసర్పాన్ని ఇంటి బయటకు పోయేలా చేశారు. “ఊదీ యొక్క శక్తిని మాటలలో వర్ణించలేము.” ఊదీని మనం నొసట ధరించినా, లేక నోటిలో వేసుకున్నా దాని ప్రభావం మనలోని అహంకారమనే సర్పం యొక్క కోరలను పెరికి వేస్తుంది. ఇంకా ముఖ్యమయిన విశేషమేమిటంటే అది మనలోని కుండలినీ శక్తిని జాగృతం చేసి ఆత్మానుభూతిని కలిగిస్తుంది.

No comments:
Post a Comment