Monday, May 4, 2020

*శ్రీ సాయిబాబా మరియు ఉల్లిపాయ లీలా:*

*శ్రీ సాయిబాబా మరియు ఉల్లిపాయ లీలా:*

 *1954 లో శ్రీసాయిబాబా వారి విగ్రహాన్ని సమాధి మందిరంలో ప్రాణప్రతిష్ఠపన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా గొప్పవేడుకలు జరిగాయి. శ్రీ కులకర్ణి గారు వృత్తిరీత్యా వంటవారు.  ప్రాణప్రతిష్ట కార్యక్రమం పూర్తి అయిన  తరువాత జరిగే ఏర్పాటు చేసిన విందుబోజనాలకు ఆయన వంటవారిలో ఒకరిగా  షిర్డీలో ఉన్నారు. చాలా మంది పండితుల,పూజారుల ఆచారావ్యవహారాలను పర్యవేక్షించి వాటిని అమలు చేసే బాధ్యత కలిగి ఉన్నారు.  శ్రీసాయిబాబా ఉల్లిపాయను ఇష్టపడతారు, కాని పూజారులకు ఉల్లిపాయ నిషేధించబడింది.  ఆ విధంగా వంటివారు. ఉల్లి లేకుండా పిండితో చేసిన బజ్జిలను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు.  కానీ, ఒక అద్భుతం ఇక్కడ జరగడం మొదలయింది. వంటవారు పొయ్యి మీద వేడిగా ఉన్న  నూనెలో పిండిని బజ్జిలను  వేయించడానికి ప్రయత్నించినప్పుడల్లా, అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.వారు బజ్జిలను మరుగుతున్న నూనెలో వేసి తీసిన ప్రతిసారి తరిగిన ఉల్లిపాయలతో నిండిన బజ్జిలు నూనె నుండి బయటకు  వస్తున్నాయి.  పూజారులు,పండితులు భోజనంలో ప్రారంభించినప్పుడు భారీ కోలాహలంగా ఉంది. వారు  బజ్జిలలో ఉల్లిపాయను గమనించి, వంటవారు పనిచేసిన ప్రదేశానికి వెళ్లి ప్రతి సందు మరియు మూలలో దర్యాప్తు జరిపి, అందరినీ విచారించారు. అసలు వంటగదిలోకి ఉల్లిపాయలు ఎలా అక్రమంగా రవాణా చేయబడ్డారో తెలుకోవలనుకున్నారు. అంతా వెతికారు ఆ సమయంలో వారు ఎక్కడా ఉల్లిపాయలు ఎక్కడ నుండి వస్తున్నాయో తెలుసుకోలేకపోయారు.నూనెలో  పిండి వేయించినప్పుడు  ఉల్లిపాయ లేదు. కానీ చివరిలో నూనె నుండి బజ్జిలను తీస్తున్నప్పుడు బజ్జిలలో ఉల్లిపాయలు ఉంటున్నాయి.  అందరూ శ్రీ సాయిబాబా అద్భుతలీలకు నమస్కరించి.... ఆ రోజు అందరూ ఉల్లిపాయ బజ్జిలును ఆస్వాదించారు.*
 *మూలం: శ్రీ సాయి లీలా*

No comments:

Post a Comment