Monday, May 18, 2020

సాయిబాబాకు భక్తాగ్రేసరుడైన దాసగణు మహరాజ్

సాయిబాబాకు భక్తాగ్రేసరుడైన దాసగణు మహరాజ్ తన కీర్తనలు ,హరికథలు ,

సత్కాలక్షేపం ,ఉపన్యాసాలద్వారా ,సాయినాథుని 
మహిమలను ,అవతార ప్రశస్తిని దేశం నలుమూలలా ప్రచారం చేసాడు .తద్వారా సాయినాథుని దర్శనం కొరకు షిరిడీకి వేలాదిమంది  వస్తుండేవారు .ఒకసారి దాసగణు తన కీర్తనల 
పరంపర ముగించుకుని షిరిడీకి వచ్చేందుకు 
కోపెరగాన్ రైల్వే స్టేషను లో రైలు దిగాడు .మాటల 
సందర్బంలో అతనికి ,కోపెరగాన్ స్టేషను మాస్టరుకు మధ్య వాగ్వివాదం చెలరేగింది .
సాయిబాబా గూర్చి ఆక్షేపించిన మాటలను స్టేషను 
మాష్టర్ అన్నప్పుడు ,అతనితో ,ఒకసారి షిరిడీకి వచ్చి ,షిర్డి సాయిప్రభువులను దర్శించుకొన్నాక 
మాట్లాడమని దాసగణు సమాధానం చెప్పాడు .
' సరే ' అని స్టేషను మాష్టర్ దాసగణు తో కలిసి 
షిరిడీకి వచ్చాడు .ఆ సమయములో సాయబాబా 
మశీదు ముందు మట్టి కుండలను బోర్లిస్తున్నారు .
దాసగణు బాబాకు నమస్కరించి ,కుండలను ఎందుకలా బోర్లిస్తూన్నారని అడుగగా " ఏమి చేయమంటావు దాసగణు ? నా వద్దకి వచ్చేవారి 
హృదయాలన్నీ బోర్లించిన కుండలవంటివి .
వాటిపై ఎంత నీరు పోసి నింపుదామన్నా సాధ్యపడుటలేదు ." అని చమత్కారముగా అన్నారు ." కొంచెం అర్ధమయ్యేలా వివరించండి 
బాబా " అని దాసగణు ప్రార్ధించగా "మానవుల 
హృదయాలు కాళీ కుండలవంటివి .విశ్వాసంతో 
వస్తే కుండలలో నీరు నింపినట్లు ,వారి హృదయాలలో జ్ఞానాన్ని నింపవచ్చు .కానీ అవిశ్వాసంతో వచ్చే వారి హృదయాలు బోర్లించిన 
కుండలవంటివి .వాటిపై ఎంత నీరు పోసినా పక్కకు జరిగిపోతాయి కానీ కుండలు నిండవు "
అని బాబా బదులిచ్చారు .

No comments:

Post a Comment