శ్రీ సాయి చరణములే సకల పుణ్యక్షేత్రాలు,పవిత్ర పుణ్య నదులు ఉన్నాయి .
భాగోజీ షిండే అనే ఓ వ్యక్తి కుష్ఠు వ్యాధితో బాధపడుతూ షిర్డీ లో ఉండేవారు.కుష్టువ్యాధి కారణంగా ఆయన రూపం అసహ్యంగా మారిపోయి. శరీరం నిండా పుండ్లతో చీము రక్తం కాటుతూ ఉండడం వలన ఎవరూ కూడా ఆయన దగ్గరికి రానిచేవారు కాదు. అంతే కాకుండా ఆయన వద్దకు కూడా రావడానికి ఎవరు సాహసించే వారు కాదు. ఆదరించే వారు లేక కనీసం తిండి పెట్టే వారులేక ఆయన చాలా ఇబ్బందితో బాధతో జీవిస్తూ ఉండేవారు.ఎవరూ ఆయనకు ఆకలితీర్చడం కొరకు ప్రయత్నం చేయలేదు సరి కదా..... ఆయనను చాలఆసహ్యించు కున్నారు. అ సమయంలో ఆ కుష్ఠు రోగిని చూసిన బాబా.
వెంటనే ఆయన్ని పైకి లెవనెత్తి భుజము పైన వేసుకొని మశీదుకి తీసుకువెళతారు.ఆయన ఆకలి తీర్చి, ఆ వ్యక్తి రాత్రంతా ఆయనకీ సేవలు చేస్తూ గడుపుతారూ.కుష్ఠు రోగిఅయిన బాగోజిని శ్రీసాయిబాబా వారు ముట్టుకొని ఆదరించి సేవలు చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.బాబా వారు ఒక కుష్టురోగిని తీసుకొని వచ్చి మశీదులో వుంచినదుకు మసీదు ముందు గొడవ చేయడానికి సిద్ధపడి కొంతమంది అక్కడికి చేరుకుంటారు.అదే సమయంలో నిద్రలేచిన భాగోజీ షిండే తన శరీరం పై ఎక్కడా కుష్ఠు లేకపోవడం చూసి బాగోజి ఆశ్చర్యపోతా బయటకు వస్తారు.అది చూసిన వారు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. తన కుష్ఠు వ్యాధిని పూర్తిగా నివారించిన బాబా పాదాలపై పడినప్పుడు చూస్తున్న శిరిడీ గ్రామ ప్రజలు ఈ దృశ్యన్నీ స్వయంగా చూసిన గ్రామస్తులు తమ కళ్ళను తామే నమ్మలేకపోతారు.శ్రీసాయిబాబా సాక్షాత్తు భగవంతుడి స్వరూపమని వాళ్లంతా దృఢంగా విశ్వసిస్తారు.మసీదు ముందు గొడవ చేయడానికి వచ్చినవారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. భాగోజీ మాత్రం తన వ్యాధిని నయం చేసి తనని నలుగురిలో తిరిగేలా చేసిన బాబా పట్ల కృతజ్ఞతగా బాబా వారు సమాధి చెందినతవరకు బాబా వారికి సేవకుడుగా ఉండిపోయారు.ఈయనే బాబా వారి మొదటి సేవకుడు.
సాయి పాదాలే సకల పుణ్యక్షేత్రాలుగా ... బాబా సేవయే తన జీవిత పరమార్థంగా భావించి ఆయనతో పాటే ఉండిపోయారు........
No comments:
Post a Comment