Thursday, May 21, 2020

షిరిడి కే సాయి బాబా Shiridi ke Sai Baba शिरडी के साईं बाबा

షిరిడి కే సాయి బాబా
Shiridi ke Sai Baba
शिरडी के साईं बाबा

శ్రీ హేమాది పంత్ గారు రచించిన శ్రీ షిరిడి సాయి సత్చరిత్ర ను ఆధారంగా చేసుకుని 28/02/1977 పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో తేదీన"షిరిడి కే సాయి బాబా" అను చిత్రము శ్రీ శ్యామ్ మూవీస్ సంస్థ ద్వారా విడుదలయ్యింది.
*ఈ చిత్రం విడుదల అయ్యి సరిగ్గా (43)నలబై మూడు సంవత్సరాలు గడిచింది. ఈ నాటికి ఈ చిత్రానికి ఉన్న జనాదరణ చెప్ప నలవి కానిది.
*ఇంతటి అద్భుత చిత్రాన్ని నిర్మించి మనకు అందించిన" శ్రీ సరళ చారటీస్ ట్రస్ట్" వారికి శ్రీ షిరిడి సాయి భక్తులు అందరి తరపున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
*ఈ చిత్రానికి గాను దర్శకత్వం అశోక్ వి. భూషణ్
మాటలు,స్క్రీన్ ప్లే- మనోజ్ కుమార్
కథా, సంకలన కర్త - దేవ్ కిషన్
సంగీత దర్శకుడు - పాండు రంగ దీక్షిత్
నృత్యం - ఎం.నాయుడు,దీపక్ మజ్ముదార్
ఎడిటర్ - వి.వి. కామత్
ఫోటో గ్రఫీ - ఎం. డబ్ల్యు .ముకుందం
స్పెషల్ ఎఫెక్ట్స్ - కను దేశాయ్
అలంకరణ - ఎన్.కే. జుకర్
దుస్తులు - కిషన్ దమనియా, కృష్ణా బాయి
రికార్డింగ్ - ఫేమస్ సిని లాబొరేటరీస్
స్టూడియో - రాజ్ కమల్ కళా మందిర్‌, మోహన్ స్టూడియోస్, బొంబాయి
పాటలు పాడిన వారు - మొహమద్ రఫీ, ఆశా భోంస్లే, ఉషా మంగెష్కర్, జాని బాబు, అనురాధ పౌంద్వల్, అనుప్ జాలోత,దిల్ రాజ్ కౌర్.
* ఈ చిత్రంలో సాయిబాబా గా నటించిన సుధీర్దాల్వి ని చూస్తే సాయిబాబా నిజంగా అదే రూపంలో ఉంటారేమో అనిపించింది. చిత్ర ఆద్యంతం మనం బాబా గారి తో కలిసి ఉన్న అనుభూతిని కలిగించే అంత గొప్ప గా నటించారు ఆయన. బాబా వారి పాత్ర లో లీనమై ఆ పాత్ర కు ప్రాణం పోశారు.
* తల్లి పాత్రలో హేమమాలిని,సాయి భక్తుని పాత్ర లో మనోజ్ కుమార్, గుడ్డి వాడు అయిన హీరా గా శతృఘ్న సిన్హా, ఆయన బిడ్డ గా నమ్రత శిరోద్కర్, బాయిజా మా గా రత్న మాల, కులకర్ణి గా బీర్బల్, దాసగణు గా మన్మోహన్ కృష్ణ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు అని చెప్ప వచ్చును.
*చిత్రం మొదటి సన్నివేశం తరువాత వచ్చే 
" साईं बाबा बोलो, साई बाबा बोलो"
" సాయిబాబా బోలో సాయిబాబా బోలో" అను పాట బాబా వారి భక్తి గీతాలలో తలమానికం  గా నిలిచి ఉండే లా పాడారు మొహమ్మద్ రఫీ తదితరులు.
*బాబా గారిని ఎప్పుడు తలచుకున్నా కూడా ఆ పాట తప్పక స్ఫురణకు వచ్చే అంత చక్కగా సంగీతాన్ని సమకూర్చారు.
* బాబా గారు తిరిగి షిరిడి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసే మహల్సాపతి, బాయిజా మా దృశ్యం.
*సాయి అని మహల్సాపతి బాబా వారి ని పిలిచే సన్నివేశం అద్బుతం చూసి తీరవలసినదే.
*సాయిబాబా  గురుస్థానం అయిన వేప చెట్టు కింద సత్యం,ధర్మం,ప్రేమ,శాంతి అను నాలుగు దివ్య జ్యోతులు వెలిగే దృశ్యం.
* ఆ జ్యోతుల వెలుగులతో అఖండ ధుని  ప్రజ్వలన దృశ్యం సాంకేతిక అభివృద్ధి చెందని రోజులలో చాలా అద్భుతము గా చిత్రించారు.  ....ఇంకా ఉంది తరువాయి భాగం వచ్చే గురువారం💐
http://adipudisairam.blogspot.com/2020/04/12_22.html

No comments:

Post a Comment