ఘానా శ్యామా సుందరా ,శ్రీధరా
షిరిడీలో పాడే కాకడ హరతి పాటలన్నీ
ఎక్కువ భాగం పాండురంగ పరంగానే వున్నాయి .పాండురంగడు శ్రీకృష్ణుని రూపాంతరమే గానీ మురళీధరుడు కాదు .
గోపాలకృష్ణుడు కూడా కాదు .అయితే ఆ లోటు తీరింది .కాకడ హారతికంటె సాయినాధునికి వినిపించే మూడు గీతాలలో
మధ్య హరతి గీతం శ్రీకృష్ణునికి చెందినదే .
"ఘానా శ్యామసుందరా ,శ్రీధరా అరుణోదయ
ఝాలా ...అంటూ మొదలవుతుంది .ఈ మేలుకొలుపు గీతాన్ని రచించింది శ్రీ హోనాజీ
బాల (1754 _1844) అతడు మహరాష్ట్ర కు
చెందిన లావణీ నృత్య సంగీత ప్రక్రియలో
నిష్ట్నాతుడు .ఈ పద్దెనిమిది శతాబ్ది కి చెందిన
గీతాన్ని గాన గంధర్వులైన పండితరావు
నగర్ కర్ ,లతా మంగేష్కర్ ,వసంత్ దేశాయి
సంగీత సారధ్యములో ఇరవై శతాబ్దిలో గానం
చేశారు .ఈ గీతం తెలియని మహారాష్ట్రుడు
ఉండరు అంటారు .ఏ సాయిభక్తుడు కూడా
ఉండరు .హోనాజీ బాల శ్రీకృష్ణుని వలె గోపాలుడు ."ఘానా శ్యామసుందరా ! శ్రీధరా !
అరుణోదయమవుతుంది ,పక్షులు గూటీనుండి ఎగిరి పోతున్నాయి ,గొల్లవాండ్రు
కావళ్లను భుజానికి తగిలించుకొని పోతున్నారు ,గోపకాంతలు నడుమున బిందెతో యమునాతీరం వైపు పోతున్నారు .
"లే ! వాసుదేవా ! లే ! ,లేగదూడలు ఆకలితో
"అంబా "అంటున్నాయి .లేచి వాటికోసం
పాలు పితుకు "అంటూ హోనాజీ బాల మనలను తెల్లవారు ఝామున ,వ్రేపల్లెకు తీసుకుపోతాడు భూపాలీరాగంలో .హోనాజీ బాల రచనలోని చివరి రెండు చరణాలు సమాధి మందిరంలో బాబాకు వినిపించరు .
"కోటి సూర్య ప్రభలతో వెలిగే కృష్ణా నా హృదయములో నిలిచిపో "అంటారు హోనాజీ బాల .ఘానా శ్యామసుందరా గీతానికి ప్రముఖ సినీ దర్శకుడు శాంతారాం
"అమర భూపాళీ "చిత్రంలో మనకి వినిపించి అమరుడైనాడు శాంతారాం .
🏵️🌸🌺🌼💮🌼🌷💐🙏🙏🌹🌻🥀☘️🌸

No comments:
Post a Comment