సాయిభక్తుడైన హరిభావు కర్ణిక్ కోడలికి మానసిక
అరోగ్యం దెబ్బతింది .తరుచుగా ఫిట్స్ రావడము ,
ఆ సమయములో చేతికందిన వస్తువులు విసరివేయడం ,తనను తాను గాయపరచుకోవడం చేసేది .ఆమె భర్త డాక్టరుకి
చూపించినా ఎటువంటి ప్రయోజనము జరగలేదు
కార్ణిక్ తన కోడలి అరోగ్యం బాగాలేదని తెలిసి
తన స్వగ్రామమునుండి బయలుదేరాడు .రైలు
పరేల్ స్టేషను చేరుకోగానే నీలి రంగు నేత్రాలు కలిగి తెల్లని కఫనీ ధరించు ఉన్న ఒక ఫకీర్ ,కార్ణిక్
ప్రక్కనే కూర్చున్నాడు .ఇద్దరికీ మాటలుకలిసి పరిచయము ఏర్పడింది .ఆ ఫకీర్ కార్ణిక్ తో " పరమేశ్వరుడు ఈ సృష్టిలో అనేకరకాలైన మొక్కలను ,చెట్లను సృష్టించాడు .కానీ వాటిని
ఉపయోగించుకొనే విధానము మనకు తెలియదు
కనీసం తెలుసుకోవాలని ప్రయత్నం చేయము .ఉదాహరణకి ఫలాన చెట్టు ఆకులను
పిండి రసం తీసి ,పిచ్చివారికి ఇస్తే వారికి పిచ్చి తగ్గిపొతుంది .ఫిట్స్ కి కూడా దివ్య ఔషధంలా పనిచేస్తుంది .అది తెలియక మానవులు డాక్టర్ల చుట్టూ తిరుగుతు తమ విలువైన ధనాన్ని ,
కాలాన్ని వృధాచేసుకొంటారు " అని చెప్పి ఆ చెట్టు
పేరు కుడా చెప్పారు .ఆ మాటలు విన్న కార్ణిక్ కు
చాలా ఆశ్చర్యము కలిగింది .తన సమస్యకు
అడగకుండానే పరిష్కారము చూపించిన ఆ ఫకీర్
దైవాంశ సంభూతుడై ఉండవచ్చని అనిపించింది .
అప్రయత్నంగా చేతులు జోడించి అతనికి నమస్కరించాడు .తరువాత అతని మనసు ప్రశాంతతపొంది సీటులో వెనకకు జారగిలిబడి
కళ్లుమూసుకుని హాయిగా నిద్రపోయాడు .రైలు బాంద్రా స్టేషను చేరుకోగానే అతనికి మెలకువ వచ్చి చూస్తే ఆ ఫకీర్ కనపడలేదు .మార్గ మధ్యలో
హఠాత్తుగా దిగి వెళ్ళిపోయాడని తోటి ప్రయాణీకులు చెప్పారు .
బాంద్రా రైల్వే స్టేషను బయట ఆ ఫకీర్ చెప్పిన చెట్టు కనిపించింది వెంటనే దాని ఆకులు కోసి
సంచిలో వేసుకున్నాడు .ఇంటికి వెళ్లి కోడలికి
ఆ అకులరసం ఇవ్వగా మూడురోజులకు ఆమెకు
స్వస్తత చేకూరింది .ఆమె భర్తతో సహ అందరూ
ఈ అద్భుతమైన పరిమాణానికి ఆశ్చర్యపోయారు
డాక్టరు కూడా తన మందుల వలన కానిది ఎలా
సాధ్యమైనదా అని విస్తురపోయాడు .జరిగినది
అంతా సాయినాధుని లీలే అని ,ఈ లీల వెనుక
అసలు సాయిబాబా వాక్కు ప్రకారం పిచ్చి మొక్కలు కూడా సంజీవనిలాగా ప్రాణాలు
కాపాడతాయని కార్ణిక్ డాక్టరుకి చెప్పగా ఈ దివ్య
లీలను చూసి విశ్వాసం కలిగి డాక్టరు కూడా బాబా భక్తుడయ్యాడు .కొంతకాలం తరువాత కార్ణిక్
షిర్డీ వెళ్లి బాబాను దర్శించుకోగా ,అక్కడివారికి
కార్ణిక్ ను చూపించి " ఇతను తన కోడలి అరోగ్యం
గూర్చి దిగులు చెందుతుండగా నేను ఫకీర్ రూపంలో స్వయంగా వెళ్ళి విరుగుడు మార్గము
ఉపదేశించవలిసి వచ్చింది .ఆ అమ్మాయి అరోగ్యం బాగుపడినందున అందఱికీ సంతోషము

No comments:
Post a Comment