Thursday, May 7, 2020

శ్రీసాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 15 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబు లు

  శ్రీసాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 

15 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబు లు 
ఓం శ్రీ సాయి రామ్
1. రెండు బల్లుల కధా లో ఇంకొక బల్లి ఎక్కడ నుండి వచ్చెను?
జవాబు) ఔరంగాబాద్.

2. సంచీని దేని కోసం విదిలించెను? ఏమి తీసుకొని రావటానికి?
జవాబు) దుమ్ము, ధూళి. ఉలవలు.

3.   చోల్కర్ బాబా పాదములపై బడి ఏమి యిచ్చేను?
జవాబు) ఒక టెంకాయ.

4.  దాసగుణ ఏ ఆలయము లో హరికథ చెప్పను?
జవాబు) కౌపీనేశ్వరాలయము.

5.  హరికథ ను ప్రారంభించిన మహర్షి ఎవరూ?
జవాబు) నారద మహర్షి.

6.  చోల్కర్ ఏ ఉద్యోగం చేసేవారు?
జవాబు) ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తా.

7. బాబా ఎవరిని పిలిచి చక్కెర ఎక్కువ గా వేసుకుని రమ్మనెను?
జవాబు) జోగ్

8. రెండు బల్లుల కధ లో  బాబా యొక్క శక్తి ఏమిటి అని నిరూపించెను?
జవాబు) సర్వజ్ఞడు.

9. చోల్కర్ ఏ పరీక్ష లో ఉత్తీర్ణుడు అయ్యారు?
జవాబు) సర్కారు వారి పరీక్ష లో.

10. ఎవరి హరికథ ల వలన అనేకులు బాబా వద్దకు వచ్చిరి?
జవాబు) దాసగణు.

11. రెండు బల్లులు ఎవరి కి ఏమి అవుతాయి?
జవాబు) అక్క, చెల్లెలు.

No comments:

Post a Comment