Thursday, May 7, 2020

సాకోరి లో ఉపసాని మహరాజ్ మరియూ గోదావరి మాత పాదుకలు.

సాకోరి లో ఉపసాని మహరాజ్ మరియూ గోదావరి మాత పాదుకలు..
ఇవి  సాకోరి లో ని ఉపాసినీ బాబా తపస్సు చేసిన కుటీరం లో ఉంటాయి.
దాని ని अम्र वाली అంటారు.. ఇది భక్తులకు  ఉదయము 9 నుంచి 10:30 దాకా తెరచి ఉంచు తారు...
ఇక్కడ ఈ గది లోకి వచ్చి న వారికి ఇప్పటి దాకా చేసిన పాపాలు క్షాళన కాబడతాయి.. అని హామీ ఇచ్చి ఉన్నారు...
అంత అద్భుతం గా ఉంటుంది ఆ గది...
షిరిడీ నుంచి రహత వెళ్లే షేర్ ఆటో లు (ఖండోబా మందిరం నుంచి ఉంటాయి) లో సాకోరి క్రాస్ రోడ్ లో దిగి 1 km దూర ము లో ఉన్న ఉపాసనీ మహరాజ్ వద్దకు వెళ్ళ వచ్చు...
చాలా చాలా ప్రశాంతం గా ఉంటుంది...
స్త్రీ ల చేత ఆశ్రమము నడపడం మనను ఆశ్చర్య పరచు చుంది....
తప్పక దర్శించ గలరు...
జై సాయి మాస్టర్
ఉపసాని మహరాజ్ మాత గోదావరి సమాధి కూడా ఆశ్రమము లో ఉన్నాయి...👏
మే 5, ఉపాసనీబాబా జయంతి*
శ్రీ ఉపాసనీబాబా తన సమయాన్నంతటినీ ఎక్కువగా సాధు సత్పురుషుల సాంగత్యం ల గడిపేవాడు. ఒక బ్రహ్మచారి చూచినప్పటినుంచీ బ్రహ్మచర్యం యొక్క విశిష్టత, శివభక్తి అతని హృదయంలో చెరగరాని ముద్ర వేసుకున్నాయి. మనస్సులో ధైర్యం సడలినప్పుడల్లా ఒక వృద్ధురాలైన సాధ్వి చెప్పిన ఈ పద్యాన్నతడు స్మరించే వాడు : *“అవసరమైతే నీరు త్రాగైనా ప్రాణం నిలుపుకో, భగవంతునియందు అచంచల భక్తిని పెంపొందించుకొని, నీ ప్రారబ్దాన్ని ఓర్పుతో సహించు సుఖాలను తిరస్కరించు, బాధలను సహించు. కోరికలనే బంధాలను చీల్చు.* అయితే మహాత్ముల సన్నిధినే ఎప్పుడూ విడువవద్దు".

సాయి సాక్షాత్తు ఆ పరమ శివుడు,
 శ్రీ ఉపాసనీ నిత్యమూ ఆయన చెంతనుండే నందీశ్వరుడు. శిరిడీ సందర్శనం సాకోరి సందర్శనంతో గాని పరిపూర్ణం కాదని నేటికీ ఎందరో భక్తుల విశ్వాసం.

*|జై సాయి మహరాజ్|*
*సేకరణ: శ్రీ సాయి లీలామృతం*

No comments:

Post a Comment