Thursday, May 7, 2020

శ్రీసాయినాధుని పూజా విధానములో హారతులనేవి ఒక విశిష్ట స్థానాన్ని పొందినవి



శ్రీసాయినాధుని పూజా విధానములో హారతులనేవి ఒక విశిష్ట స్థానాన్ని పొందినవి 
.
కాకడ హారతి ,మధ్యాన్న హారతి ,సాయం హారతి ,
శేజ్ హారతి .ఇలా నాలుగు వేళలలో హరతులనేవి 
షిర్డీ సంప్రదాయముగా ఏర్పడ్డాయి .

బాబా వారు 
మశీదు ( ద్వారకామాయి ) లో నివసిస్తుండేవారు .
ముస్లింలకు అయిదు సార్లు నమాజు చేయడం 
విధాయకం .వారికేదో ఒక పద్దతి ఉంది ".మనం కూడా ఏదో ఒక ప్రత్యేక విధానాన్ని ,సమయాలను 
పెట్టుకొంటే బాగుండేది " అన్న ఉద్దేశంతో హిందూ 
భక్తులు హారతులు ఇవ్వడం ప్రారంభించారు .అది 
ఆలా స్థిరపడిపోయాయి .

ఇందులో ఉన్నవాటిలో 
ఎక్కువభాగం శ్రీకృష్ణ జగేశ్వర భీష్మ , 
దాసగణు మహరాజ్ ,
ఉపాసనీ మహరాజ్ ,మున్నగు మహా సాయిభక్తులు రచించినవి .

వేకువ జామున ,
ప్రశాంత వాతావరణంలో ,రాత్రి నిద్రవలన ,హాయిగా , తాజాగా ఉన్న మనసుతో పాడే మేలుకొలువు పాటలు అద్భుతమైన అనుభూతులు కలిగిస్తాయి .

భావనాపరంగా కూడా ఈ కాకడ హారతి పాటలు అతి సున్నితంగా హృదయాలను కరిగిస్తున్నట్లుగా వుంటాయి .

" రహం నజర్ కరో అబ్ మోరేసాయి ,తుమ్ బినా 
నహి మాబాప్ భాయీ " అంటే గుండె కరుగక మానుతుందా ? " ముజేసె ప్రభు దిఖాలనా " అనగానే ఈ దీనత్వ మనసు తాకకుండా ఉండదా ???

ఉపాసనీ మహరాజ్ రచించిన సాయినాథ మహిమా స్తోత్రం లో " భవ ద్దర్శనాత్ పునీతం ప్రభో " అన్న పలుకులు పెదవులమీదకు రాగానే 
ఏదో తెలియని ఒక నిశ్చింత కలుగుతుంది .

" షిర్డీ మాఝే పండరీపుర " అన్న పాట ,దాని రాగంలాగానే మనలో ఉత్సాహము నింపుతుంది .
నమస్కార అష్టకంలో " ధరావే కరిసాన "అన్నది 
మనలోని  ,పసితనాన్ని , ఆత్మార్పణ భావమును 
పైకి తేగా ,,
చివరి భాగం
 " తులామాగతో "భక్తీ 
వినమ్రులను చేస్తుంది .ఇలా అడుగడునా అద్భుతమైనవే ఈ హారతులన్నీ .

అసలు ఈ హారతులు రచించిన వారంతా ,ఎంతో 
ఆర్తీ ,ఆర్ద్రత నింపుకుని రచించారు .అందుచేత 
పాడేవారు కూడా తగిన జాగ్రత్త అవసరం కదా 

మనం ముఖ్యముగా గుర్తుంచుకోవలిసిన విషయము ఏమిటంటే మనం పాడేది బాబా కోసం 
వినవలిసిన అసలు వానిమీదే దృష్టిని నిలపాలి .
స్వయంగా సాయబాబా ఎదుట ద్వారకామాయిలో నిలబడి పాడుతున్నాం ,అల నాటి భక్తులతో కలసి పాడుతున్నాం " అన్న లోతైన భావముతో పాడాలి .

ముఖ్యముగా పాటలోని భావన మన హృదయాన్ని తాకుతూ 
ఉండాలి .అసలు నిజం చెప్పుకోవాలంటే ఒక్క పాట ,ఒక్కపాట ఏమిటీ ? ఒక్క చరణం పాడితే 
మనసు రుద్దమైతే ,మరో చరణం ఎలా పాడగలను ? " నా తల్లి తండ్రులు కోపగించినా సరే -నా భార్యాబిడ్డలు కోపగించిన సరే -నా తోబుట్టువులు ,అత్తమామలు అలిగినా సరే -
తండ్రీ ! సాయినాధ ! నీవు మాత్రం నాపై కోపగించుకోకు స్వామీ ! " 
ఈ మాటలు మన నోట 
పలుకగానే ఏదో తెలియని దుఃఖం లోపలనుంచి 
తన్నుకు వస్తుంది .
కంఠం రుద్దమైపోతుంది .
ఆ తరువాత శ్లోకం ఎలా చదవగలము ? ఎంతో 
కష్టం మీద నిగ్రహించుకొని ముందుకు సాగవలిసి 
వస్తుంది .ఇలా మనసు మెత్తబడడమే హారతుల 
ప్రయోజనము .

అది కావాలంటే గట్టి భావన 
ప్రధానం .మొత్తం మీద ఫలితార్ధం ఏమిటంటే -
ప్రియ సాయిభక్తులారా ! హారతులను ఆర్తితో ,
భక్తితో ,బాబా పట్ల గొప్ప అనురక్తితో పాడితేనే 
అవి సత్ఫలితాలిస్తాయి .ఆలా కాకపొతే మనకి 
టేపు రికార్డర్ కు తేడా వుండదు .సాయబాబా 
ముందు అలనాటి భక్తుల వలె హారతులు పాడుదాం .

*ఓం శ్రీ సాయిరాం*

No comments:

Post a Comment