Friday, May 22, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 28 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ  సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 
28 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు. 
ఓం శ్రీ సాయి రామ్


1. షిరిడి వెళ్ళే వారికి ఏమీ ఇచ్చి పంపించాలి?
జవాబు) పూల మాలలు, కర్పూరం, దక్షిణ.

2. మేఘుడు చాల దూరము నడిచి ఇవి తీసుకు వచ్చెను?
జవాబు) పత్రి ని, గోమతి తీర్థము.

3. కిచిడి కధ ద్వారా బాబాకు ఏ విధమైనది తన వద్దకు వచ్చిన వారి మీద వుండును?
జవాబు) అసాధారణమైన ప్రేమ.

4. సాయి పాద తీర్థము త్రాగిన ధన్యుడు ఎవరు?
జవాబు) మేఘశ్యాముడు.

5. ద్వారాకా మాయి వాసి దేనిలో పారంగతులు?
జవాబు) వేద జ్ఞానము నందు, ఆత్మ సాక్షాత్కారం నందు.

6. షిరిడి ప్రయాణమునకు గుమస్తా కు ఎంత మంది తోడ్పాటు చేసారు?
జవాబు) మంజునాధ, దాసగణు, శంకర్ రావు, పినతండ్రి కొడుకు, ముసలమ్మ.

7. సర్వజ్ఞత బాబాకు ఉన్నది ఎన్ని కధలలో వచ్చును?
జవాబు) మూడు కధలు.

8. దారిలో ఎవరు భజన చేసెను?
జవాబు) (లాలా లక్ష్మి చంద్) టక్కరి వాడు.

9. మద్యాహ్న హారతి కాగానే దేహ త్యాగము చేసిన వారు ఎవరు?
జవాబు). మేఘశ్యాముడు.

10. చావడి ఉత్సవము లో బాబా ఎలా వుండే వారు?
జవాబు) దగ్గు చే బాధ పడుతుండేవారు.

11. ఎన్ని పిచ్చుకలు కలవు ఎన్ని కోసుల దూరం లో?
జవాబు) మూడు పిచ్చుకలు, 1000 క్రోసుల దూరం.

🌿🌷🌿
28వ అద్యాయము
1. దాదా కేల్కర్ అల్లుడి పేరు ఏమిటి?
జవాబు) హరి వినాయక సాఠే.

2. మేఘ శ్యాముడు బాబాను ఎన్ని చోట్ల పూజించు చుండెను?
జవాబు) రెండు చోట్ల.

3. దీక్షిత్ ధ్యానము లో ఏమి కనపడెను?
జవాబు) శివలింగము.

4. 28వ అద్యాయము లో ఎంతమంది భక్తుల కు బాబా స్వప్నదర్శనము ఇచ్చెను?
జవాబు) ఇద్దరు భక్తులకు.

5. సాంజా ప్రసాదము తీసుకురమ్మని బాబా ఎవరితో చెప్పెను?
జవాబు) బాపూ సాహేబ్ జోగ్.

6.బాబా దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను?
జవాబు) కిచిడి కొరకు.

7. మేఘుని గదిలో బాబా పటము వద్ద లింగము ఎవరు ప్రతిష్టించెను?
జవాబు) స్వయంగా బాబాయే.

8. మేఘునికి నానా సాహేబ్ చంద్రోర్కర్ ఏమి ఇచ్చెను?

జవాబు) బాబాగారి పటం.

No comments:

Post a Comment