Thursday, May 28, 2020

సద్గురు సేవ ముక్తికి మార్గం

మసీదులో శ్రీసాయిబాబా వారికి సేవ చేసే విషయంలో కొందరు భక్తులు పోటీ పదుతుండే వారు. నిత్యం శ్రీసాయి వెంటే ఉంటుండేవారు.  *సద్గురు సేవ ముక్తికి మార్గం* అని నమ్మిన నిజమైన భక్తాగ్రేసరులు వారు అందరూ కూడా..... అందువలన బాబాకు సేవ చేసే విషయంలో ఒక చిన్న అవకాశం వచ్చిన శ్రద్ధ,భక్తితో మనస్ఫూర్తిగా ఆ సేవను పూర్తి అంకితభావంతో చేసేస్తుండే వారు. నిజముగా చెప్పాలి అంటే మన ఎవరికి కూడా భగవంతుడు ఎలా ఉంటారో అనే విషయం తెలియదు.మన *శ్రీ సాయినాథుడు ఎలా ఉంటారో మన కన్నులకు మాత్రమే కాదు..... మన హృదయంతరాలంకి కూడా తెలుసు.....*.అలానే అక్కడ ఉన్నవారి దృష్టిలో శ్రీసాయినాథుడే అనంత పరబ్రహ్మస్వరూపం మైనా  భగవంతుడు. శ్రీసాయిబాబాకు సేవ చేసే విషయంలో భక్తుల మధ్య వుండే ఈపోటీ ఓకొక్కసారి మాటమాట పెరిగి గొడవలకు, పంతానికి,పట్టింపులు దారితీసేవి.ఇలా జరుగుతున్న సమయంలో బాబా మధ్యవర్తిత్వంతో చక్కని మాటలు చెప్పి బోధించడంతో  అవి తొలగిపోతుండేవి.
*అలాంటి కథను ఇప్పుడు ఒక్కసారి చదువుకుందాం:-*
అణ్ణాచించణీకర్ (దామోదర్ ఘనశ్యామ్) శ్రీసాయిబాబా వారి భక్తుడు.ఈయన మొండివాడు,మొరటి మనిషిలా ప్రవర్తిస్తునదేవారు.కానీ ఈయన మనసు సున్నితమైనది.ఇతనికి కల్లాకపటం తెలియదు.మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసులో ఎంవుందో అదే బయటికి మాట్లాడే గుణం కలవాడు.ఎవరినీ లెక్కపెట్టే తత్త్వం ఆయనలో లేదు. పైగా ఏదైనా పట్టింపు, పంతం, గొడవైనా......  సరే అక్కడికక్కడే తేల్చుకొని పోవాల్సిందే తప్ప దాన్ని వాయిదా వేసేవారు కాదు.గుంటనక్క వేషాలు తెలియవు.నిజమైన భక్తి ఒక్కటే అతనికి తెలుసు. శ్రీసాయిబాబా వారికి అణ్ణాలో వుండే భక్తి కన్న అతనిలోనే మొండితనమే ఎక్కువగా నచ్చేటట్లు ఉండేది. అందువలన అతనిని ఎక్కువగా దగ్గరికి చేరదీసే వారు. 
ఒక సందర్భంలో మసీదులో వేణుబాయి కౌజల్గి (మావిశీబాయి) అనే ముసలి వితంతువు కూడా ఉండేవారు. ఆమెను బాబా  "అమ్మా" అని పిలిచేవారు. ఇతర భక్తులు మాత్రం ఆమెను మావిశీబాయి అనే పిలిచేవారు.మావిశీబాయిది స్వచ్ఛమైన హృదయం. ఒకరోజు అణ్ణా,మావిశీబాయి బాబాసేవలో పూర్తిగా నిమగ్నులై అణ్ణా బాబాకు కాళ్లు వత్తుతున్నాడు. మావిశీబాయి బాబా  నడుమును మర్ధనం చేస్తున్నప్పుడు ఒకసారి అణ్ణాముఖం మావిశీబాయి ముందుకు వెళ్ళింది.
ఆమె వెంటనే "బాబా! ఈ అణ్ణా చూడు. నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు. వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు"అంది మావిశీబాయి. అణ్ణా గురించి మనకు తెలిసిందే ఇంకా చెప్పేదేముంది. ఆమె మాటలు వింటూనే కోపంతో లేచి. "నేనా బుద్ధి లేని వాన్ని ? నేనా నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకున్ననా......? నా జోలికొచ్చావో.." అంటూ కోపంతో గొడవ ధిగబోయారు. మసీదులో ఉన్న వారూ అందరూ వాళ్ళిద్దరి గొడవని చూసి నవ్వుకుంటున్నారు. బాబా కూడా వారి మాటల మధ్యలో మాటలు కలిపి. శ్రీసాయిబాబా ఇలా అన్నారు. *"అన్నా ! ఎందుకంత గొడవ చేస్తున్నావ్ ? ఆమె నీ తల్లివంటిది. తల్లిని కొడుకు ముద్దుపెట్టుకుంటే తప్పేముంది ?"*
అని ఒక్క చక్కని మాటతో అక్కడ వారిని శాంతింపచేశారు.

No comments:

Post a Comment