Monday, May 11, 2020

ఒక గొప్ప అద్భుత లీలా శ్రీ B. V.నరసింహ స్వామీజీ గారు శ్రీ సాయిబాబా వారి సహస్రనామావళి


ఒక గొప్ప అద్భుత లీలా శ్రీ B. V.నరసింహ స్వామీజీ గారు శ్రీ సాయిబాబా వారి సహస్రనామావళిని వ్రాయాలి అనుకొని పరిపూర్ణమైన పూర్తి ధ్యానంలో మునిగిపోయారు.  సాయి సహస్రనామానికి సరిపోయే విధంగా ఒక నామం కూడా వ్రాయాలేకపోవడంతో అతని కాంక్ష అంతా ఫలించలేదు.* 

*21.12.1936 తేదీన రాత్రి 11.00 సమయంలో అతను సాయి సహస్రనామమును వ్రాసే ప్రయత్నం చేస్తూ సాఠే వాడలో కూర్చున్నారు. ఆ సమయంలో శ్రీ దాసగణు మహారాజ్ వాడాలోకి వచ్చారు, ఈ విషయం తెలుసుకున్న స్వామీజీ తన వైపు చూసి వ్రాయడం ప్రారంభించమని చెప్పారు.  అప్పుడు దాసగణు  మహారాజ్ గారు అక్కడే ధ్యానం చేయడం కోసం కూర్చున్నారు.*
*ఉదయం 4:00 సమయం అయ్యే సరికి శ్రీ దాసగణు మహారాజ్ ధ్యానం నుండి బయటకు వచ్చి స్వామీజీని ఎంతవరకు వ్రాసారు అని అడిగారు.  శ్రీ నరసింహ స్వామీజీ ఈ విదంగా బదులిచ్చారు - "నేను సహస్రనామవళిని పూర్తి చేసాను. మీరు నిర్దేశించి చెపుతున్నా ప్రకారం నేను వ్రాశాను."  అసలు దాసగణు మహారాజ్ గారు భౌతిక స్పృహ లేని పూర్తిస్థాయి ధ్యానంలో ఉన్నారు.  ఈ అద్భుతాన్నీ  దాసగణు మహరాజ్ గారికి   B. V. N.స్వామీజీ ఇద్దరూ శ్రీ సాయిబాబా వారే స్వయంగా సాయి సహస్రనామను శ్రీ నరసింహ స్వామీజీకిగారి ద్వారా ధృవీకరించారు.

No comments:

Post a Comment