శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
25 వ అధ్యాయం, ప్రశ్నలు మరియు జవాబులు
ఓం శ్రీ సాయి రామ్
💐
1. దామోదర్ సావలరాం ను ఎన్ని సార్లు బాబా కాపాడెను?
జవాబు) రెండు సార్లు.
2. బాబా కు భూత, భవిష్యత్తు, వర్తమానములు తెలియజేయుట గురించి ఎలా పోలుస్తారు?
జవాబు) అరచేతిలో ఉన్న ఉసిరికాయ వలే.
3. అన్నా ఏ విధముగా సంతుష్టి చెందవలెను?
జవాబు) సగము రొట్టె తో.
4. అన్నా ఎన్ని సార్లు బాబా తో వ్యాపారము గురించి ఎన్ని సార్లు ప్రస్తావించారు?
జవాబు) (ఉత్తరము, స్వయంగా) రెండు సార్లు.
5. ఆమ్రలీలలో ఎంత మంది సంతానం కలిగిరి?
జవాబు) 4 గురు కొడుకులు, 4 గురు కుమార్తెలు.
6. సావల్ రాం ఏ విధంగా తనకు సంతానము కలగదు అనుకొనేను?
జవాబు) తన జ్యోతిష్య పరిజ్ఞానం వలన.
7. దామోదర్ ఏమి పోగొట్టు కోనేను?
జవాబు) భార్య నగల పెట్టె లో నాసికాభరణం.
8. రాసనే ఎవరి ఇంట్లో విందు గావించెను? వారు ఏమి చేసిరి?
జవాబు) విందు అప్పా కులకర్ణి ఇంట్లో బొబ్బట్టు, నుదుట చందనము పూసిరి.
9. రాసనే తన జీవిత కాలంలో గుర్తించ దగిన పనులు రెండు చేసెను, అవి ఏవి?
జవాబు) పతకములు ఇచ్చుట, బీదలకు అన్న దానము.
10. సాయి బాబా దాబోల్కర్ కు ఏమి ఇచ్చి తన పని ముగించెను?
జవాబు) బుద్ధి, శక్తి, ధైర్యం.
11. సాయి బాబా మనకు ఏ అంశ తో ఉన్న రాముడుగా కనిపిస్తారు?
జవాబు) ఆత్మా రాముడు.
🌿🌷🌿

No comments:
Post a Comment