శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
12వ అధ్యాయం, ప్రశ్నలుమరియుజవాబులు
ఓం శ్రీ సాయి రామ్
1. కాకా మహజని షిరిడి వెళ్లి ఏ ఉత్సవము చూడాలి అనుకోనెను?
జవాబు) గోకులాష్టమి ఉత్సవము.
2. ధూమాల్ ఎక్కడకు వెళ్లాలని బయలుదేరి షిరిడి వెళ్లే ను?
జవాబు) కోర్ట్ పని మీద వెళ్లాలని.
3. మనము ఎంత వరకు షిర్డీ ఉండగలము?
జవాబు) బాబా ఆజ్ఞ ఎంత వరకో అంత వరకు మాత్రమే.
4. థూమాలి కేసు ను ఎంత మంది మేజిస్ట్రేట్ లు విచారించారు?
జవాబు) నాలుగురు.
5. మూలి శాస్త్రి ఎక్కడ నుండి ఎవరి ని కలుసు కొనుట కు షిర్డీ వచ్చెను?
జవాబు) నాసిక్ నివాసి, బూటీ ని.
6. రామ భక్తు డైన డాక్టర్ కు ఆనందానుభూతి ఎన్ని రోజులు వుండెను?
జవాబు) 15 రోజులు.
7. రామ భక్తుడైన డాక్టర్ ఎన్ని రోజులు ఉపవాసము ఉండెను?
జవాబు) మూడు రోజులు.
8. మూలి శాస్త్రి గురువుగారి పేరు ఏమిటీ?
జవాబు) ఘొలప్ స్వామి.
9. నిమొను గ్రామ పఠానుదారు, మేజిస్ట్రేట్ ఎవరు?
జవాబు) నానా సాహెబ్ నిమొనుకర్.
10. బేలాపూర్ లో రోజులు ఉండమని బాబా ఆజ్ఞాపించెను?
జవాబు) 4 రోజులు.
11. బాబా ఏ రంగు వస్త్రాలు ధరించేదమని చెప్పేను?
జవాబు) కాషాయ రంగు.

No comments:
Post a Comment