శ్రీ రామచంద్ర అత్మారాం తర్ఖడ్ ఒక పెద్ద కంపెనీలో అధికారిగా ఉండేవాడు .అతడు ప్రార్ధనా సమాజమునకు చెందినవాడైనా బాబా సన్నిధితో
ఎంతో అధ్యాత్మికంగా ఎదిగాడు .బాబా మహాసమాధి చెందిన కొన్నాళ్లకు ,అతను తరచుగా " మిర్చి బాబా " గా పిలవబడే " మాధవదాసు " అనే సిద్ధయోగి వద్దకి వెళ్తుండేవాడు .ఆయన మహరాష్ట్ర లో ,కనకేశ్వర్
అనే పట్టణంలో ఉండేవాడు .ఆయన 12 సంవత్సరాలు కేవలం మిరపయకాయలు ఆహారంగా స్వీకరించి తపసు చేసాడు .అందుకే
అయనను " మిర్చీబాబా " అని ప్రజలు పిలిచేవారు .ఒకసారి రామచంద్ర తర్ఖడ్ మిర్చీబాబా వద్దకి వెళ్ళి ,ఆయన సన్నిధిలో వుండగా ,ఒక మహిళా భక్తురాలు వచ్చింది .
వెంటనే మిర్చీబాబా తనుకూడా మహిళగా మారిపోయాడు .ఇది అత్మారాం ప్రత్యక్షంగా చూశాడు .మిర్చీబాబా స్త్రీ రూపముతోనే ఆ మహిళాభక్తురాలుతో మాట్లాడేడు .కొంతసేపు ఆ సంభాషణ జరిగింది .కొంతసేపు తరువాత ఆ భక్తురాలు వెళ్ళిపోయింది .మరికొంతసేపటికి
మిర్చీబాబా మమూలుగా తన పురుషరూపంలోకి
వచ్చాడు .ఆ సంఘటన చూసి తర్ఖడ్ ఎంతో
ఆశ్చర్యం పొందాడు .అతడు మిర్చీబాబాతో " ఇదంతా ఎలా సంభవం అయినది ?" అని ప్రశ్నించగా ,మిర్చీబాబా తన కాలు తొడవద్ద గల
ఒక కండరాన్ని లాగితే తాను పురుషరూపాన్ని నుంచి స్త్రీ రూపంగా మారిపోతానని చెప్పాడు .
ఆదివిన్న తర్ఖడ్ తన గురువైన షిర్డీసాయిబాబా
చేసిన ఖండయోగ పక్రియ చెప్పాడు .అందుకు
సమర్థ సద్గురువైన శిరిడీ సాయబాబా లాంటివారికే సాధ్యపడుతుందని ,అది తనకు
ఈ జన్మలో అసాధ్యమని తర్ఖడ్ కు తెలిపాడు .
పరమ యోగిపుంగవునిగా పేరుగాంచిన మిర్చీబాబా కు కూడా అసాధ్యమైన ఖండయోగాన్ని శ్రీ సాయిబాబా తన బాల్యమునుండే చేసేవారు .అందుకే ఆయన యోగులకే యోగి .ఆందుకే మనం యోగిరాజా ,అని పిలుస్తాం .అందుకే ఆయన
యోగసామ్రాట్ .ఆయన భక్తులు కావడం మన
పూర్వజన్మ సుకృతం .



No comments:
Post a Comment