శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
18, 19 వ అధ్యాయం ప్రశ్నలు మరియు జవాబులు
☘️ఓం శ్రీ సాయిరాం ☘️
1. సాఠే తనకు వచ్చిన స్వప్నమును ఎవరికి తెలియచేసెను?
జవాబు) కాకా సాహేబ్ దీక్షిత్.
2. హేమాది పంత్ సాఠే కన్నా ఎన్ని సంవత్సరాల ముందు షిరిడి వచ్చే ను?
జవాబు) ఏడు సంవత్సరాలు.
3. ఖాశాబా దేశముఖ్ గారి గ్రామం పేరు ఏమిటి?
జవాబు) సంగమనేరు.
4. శ్యామ చెప్పే కథలు బాబా కు భక్తుల పట్లగల ఏ గుణముల గురించి తెలుపును?
జవాబు) దయా దాక్షాణ్యములు.
5. ఇంద్రియ విషయ వాంచలు నిష్క్రమించిన చేతికి ఏమి వచ్చును?
జవాబు) వివేక వైరాగ్యము లను జంట ఫలములు.
6. నిష్ట సబూరీ ఎటువంటివి?
జవాబు) అన్యోన్యమైన అక్క చెల్లెలు వంటివి.
7. రాధామాయి దేశముఖ్ కథ వలన హెమాది పంత్ ఏమి కనుగొన్నారు?
జవాబు) సత్య మార్గం.
8. బాబా నిరాకార స్వరూపము ఏ మూడు గుణములు?
జవాబు) జ్ఞానము, చైతన్యం, ఆనందం.
9. అమరులై ఎవరు సుఖము గా ఉండెదరు?
జవాబు) జీవిత పరమావధిని పొందిన వారు.
10. తిట్ట బడిన వాడు తిట్టిన వానికి ఏమి చేయవలెను?
జవాబు) కృతజ్ఞతలు తెలుపవలెను.
11. శ్రీ సాయి బోధనలు ఎలా జరుగుచుండెను?
జవాబు) సందర్బవసరములను బట్టి నిరంతరం.
12. ఏ లోకోక్తి ఆధ్యాత్మిక విషయములలో పనికి రాదు?
జవాబు) నీ దేవుడు వున్నచో నాకు మంచం పైన కూడా బువ్వ పుట్టును.
🙏🌷🙏

No comments:
Post a Comment