Thursday, May 28, 2020

షిరిడీలో ఒక గురుపూర్ణిమ

షిర్డీ సాయిబాబా శ్రద్ద -సబూరీలకు పెద్దపీట వేశారు .షిరిడీలో 1909 సం.లో ప్రారంభమైన 
గురుపూర్ణిమ ఉత్సవాలు యధావిధిగా ప్రతీ ఆషాఢపూర్ణిమకు గురుపూర్ణిమ ఉత్సవాలు నేటికినీ కొనసాగుతునే వున్నాయి .ఆలా 1914 
సం .లో షిరిడీలో ఒక గురుపూర్ణిమ సందర్భంగా 
విశేషముగా ప్రసాదాలు  తయారుచేస్తున్నారు .
ఆ సందర్భంగా సాయిభక్తురాలైన రాధాకృష్ణ మాయి ,మసాల దినుసులు పొడిచేసేందుకు ఒక 
పెద్ద రోలును తరలించవలసి వచ్చింది .ఆ సమయములో ఆమెకు సహాయము చేసేందుకు 
ఎం .బి .రేగే  అను భక్తుడు అక్కడకు వచ్చాడు .
అదే సమయములో పురందరే అనే మరొక బాబా భక్తుడు ఆ పెద్ద రోలును కదలించడానికి వారితో 
కలిశాడు .ఆలా ఆ రోలును కదిలించడంలో రేగే 
చెయ్యి ఆ రోలుక్రిందపడి నుజ్జయిపోయేది .కానీ 
అది గమనించిన రాధాకృష్ణమాయి చాకచాక్యంగా 
ఆ రోలును తనవైపు తిప్పుకొని రేగెను కాపాడింది 
అలాచేయడంలో ఆమె చూపుడువేలు రోలుక్రింద 
నలిగి రక్తం కారసాగింది .వెంటనే ఆమె ఒక గుడ్డను నూనెలో తడిపి తన వేలుకు చుట్టుకొంది .
ఆలా ఆ తరువాత మిగిలిన కార్యక్రమము 
పూర్తిచేసి వంటల పని ముగించింది .ఆ పని అంతా పూర్తిఅయ్యేక రేగెను వెంటబెట్టుకుని ఒక 
నిర్జన ప్రదేశానికి వెళ్ళి తన బాధ తీరేదాకా షుమారు అరగంట సేపు విలపించింది .తన వేలు 
చిట్లినప్పుడు ,బాధతో విలపిస్తే మిగతా పనులు 
దెబ్బతింటాయని ఓర్పుతో భరించింది .
అపూర్వ కార్యదక్షతతో బాబాను సేవించిన ఆ భక్తురాలు చిరస్మరణేయురాలు .శిర్డీసాయి బాబాను మనసావాచాకర్మణా అంకితమైన 
సుందరీబాయి క్షీరసాగర్ అనే రాధాకృష్ణమాయి 
ధన్యురాలు .

No comments:

Post a Comment