Thursday, May 28, 2020

సాయి కి రంజాన్ కు ఉన్న సంబంధం

సాయి కి రంజాన్ కు ఉన్న సంబంధం


  *ఇమాంబాయ్ చోటాఖాన్*
వయస్సు: 65 సం. వైజాపూర్
ఔరంగాబాద్ జిల్లా
*అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని-* *
*ఓ సాయిబాబా ఇవే మా నమస్సులు* .
క్రీ .శ .1918 లో సాయిబాబా తన దేహత్యాగానికి 
నాలుగు నెలల ముందు అనగా జూన్ నెలలో 
(1918 సం .జూన్ నెల రంజాన్ మాసము. )        

బాబాగారు సమాధి చెందుటకు నాలుగు నెలలు పూర్వము అప్పాబిల్ అను అతనిని రాత్రి 9 గంటల సమయమున 4 కోళ్లను తీసుకొని రమ్మనరి.  అతిథులు వచ్చుచున్నారని చెప్పారు. నేను అతిధులు ఎవరై ఉంటారు అని ఆశ్చర్యమొందాను.  ఆ రోజు రాత్రి మసీదులు తెరవెనుక మేలుకొని కూర్చుని ఉన్నాను. *తెల్లవారుజామున 2 గంటలకు ఒక పెద్ద నిప్పు గోళం ( Ball of Fire ) ఒక అడుగు వ్యాసము తో ( గోళ్ళము మధ్యరేఖ - Diameter ) మసీదు లోనికి చొచ్చుకొని వచ్చెను* *పడమర దిశలో ఉన్న గూడు వరకు వెళ్ళను. కొంత సేపు కూర్చోనేను. తరువాత మసీదు పైకప్పు వరకు వెళ్ళెను. అక్కడ అది చాలా తుణకలుగా చీలి పోయాను. మసీదు మొత్తం వ్యాపించెను. అక్కడ ఉన్న అన్నింటిని కాంతివంతముగా చేసెను* ఆ వెలుగును తదేకంగా చూడజాలక నా కళ్ళును మూసుకొని, నా మెడను క్రిందకు వంచాను. నాతో కూడా ఉన్న అప్పాబిల్ కూడా అలాగే చేసెను. 
*తరువాత బాబాగారు దుని దగ్గరకు వెళ్ళిరి. తన దగ్గర ఉన్న పొట్టికర్ర యొక్క ఒక కొనను వంచి ఉన్న తన మెడ పై ఉంచుకొని పది, పదిహేను నిమిషములు వరకు అరబ్బీ భాషలో దీనినో చెప్పుచుండిరి. బాబా గారు ధుని దగ్గర వెళ్ళగానే కాంతివంతమైన వెలుగు మరగిపోయెను* 

ఉదయమున బాబాగారు 
అప్పా బిల్ కోళ్లు తెమ్మనిరి. అవి వండబడెను. మండపములో ఉన్న నిప్పు దగ్గర బాబాగారు పోళీలను తయారు చేసిరి.

బడే బాబా కుమారుడు కాసిం తర్వాత వచ్చెను. బాబా గారు అతనికి వండిన ఆహారమును కొంత ఇచ్చారు. ఔరంగాబాదుకు వెళ్లమనిరి. అచ్చట సంసుద్దీన్ చూడుము. ఈ రెండు వందల యాభై రూపాయలు అతనికి ఇవ్వము.
 అక్కడ ' మౌలు' 'కవాలి' 
' న్యాస్ ' చేయుము అనిరి.
( మౌలు అనగా పైగంబరు గురించి నోటితో పాడుట.
కవాలి అనగా తబలా వాయించుట, న్యాస్ అనగా ఆహారము తయారు చేసి పంచుట )
తరువాత బాబాగారు కాశింను 
' *బన్నేమియా ఫకీరు* ' వద్దకు వెళ్లి ఆయనకు పూల హారము వేయుము, మరియు ఆయనతో *నవ్ దిన్ నవ్ తారీఖ్  అల్లా మీనే అప్పా దునియా  తెగాయా మార్జీ అల్లాకి*' అని చెప్పుమనిరి.
(అనగా *9వ తారీఖున 9వ నెల అల్లా వెలిగించిన దీపము అల్లా తీసుకొని పోవును* *ఇది అల్లా అనుగ్రహము*)

ఇలా చెప్పుచు బాబా గారు కాశింకు ₹250 సెవెంతి పుష్పముల హారము యిచ్చిరి. కాసిం తనకు ఆ ప్రదేశములు క్రొత్త అనెను. తరువాత బాబా గారు నన్ను  
( ఇమామ్ భాయి ) కాసిం తో వెళ్ళమనిరి.  మేమిద్దరమూ మరియు కాసిం పనివాడు అమీర్ ను తీసుకొని మూడు గంటలకు మధ్యాహ్నము ఔరంగాబాద్ స్టేషన్ చేరుకున్నాము. ఆ స్టేషన్ కు ఫకీర్ సంసుద్దీన్  వచ్చి అతిథులు ఎవరు ఫకీర్ సాయి వద్ద నుండి వచ్చి ఉన్నారు అని అడిగారు. నేను సంసుద్దీన్ ను ఇంతకు ముందే చూసి ఉన్నాను. నేను కాసిం ఆయన దర్శనం చేసుకున్నాము. *సంసుద్దీన్ గారు మా దగ్గర బాబా ఇంతకు ముందు చెప్పిన వాటిని అక్షరము తప్పకుండా చెప్పారు.* కోటలోని ఆయన గృహమునకు మమ్ములను పిలుచుకొని పోయి భోజనము పెట్టారు. ఆయనకు బాబా గారు ఇచ్చిన రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాను. ఆయన చాలా మందికి ఆహారం పంచిపెట్టారు.( న్యాస్ ) సంసుద్దీన్ కవాలి మరియు మౌలు చేశారు. అవన్నియు రాత్రికి ముగిసెను.

*నాకు బన్నేమియా ఇల్లు తెలియును. మరుసటి రోజు పొద్దున్న అక్కడికి వెళ్ళాము. ఆయన ఒక చేతిని పైకెత్తి ఒక చేతిని కిందకు దించి నిలుచొని యుండెను. అక్కడ ఉన్న అరబ్బులు, మమ్ములను బన్నేమియా వద్దకు వెళ్ళవలదు ఆయన కోపగించు కొనును అనిరి. ఒక గంట సేపు తరువాత ధైర్యం పుంజుకుని నేను బాబా గారు ఇచ్చిన పుష్ప హారమును ఆయన మెడలో వేశాను. తరువాత పైకి ఎత్తిన చేయిని క్రిందకు దించరి. తరువాత బన్నేమియాతో చెప్పమని బాబాగారు పలికిన పలుకులను చెప్పాను. బన్నేమియాగారు ఆకాశము వైపు చూశారు. ఆయన కళ్ళ వెంబడి కన్నీరు కారెను* ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చాము నాలుగు నెలలు తరువాత బాబా గారు 
మహాసమాధి చెందారు. ఆయన మహా సమాధి చెందిన రోజు దసరా తొమ్మిదవ రోజు 9వ నెల ( సెప్టెంబర్ ) . మేము రంజాన్ నెలలో ఔరంగాబాద్ వెళ్లి పగలు ఉపవాసం చేసి రాత్రి భుజించాము.

  *ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః* .
శ్రీ సాయిబాబా అన్ని మతాలకు సమ్మతమైన 
మార్గంలో నడిచారు .ఇవ్వాళ ప్రపంచం అంతటా 
అన్ని మతాలలోను సాయిభక్తులున్నారు .ఈ పర్వదినాన బాబాను స్మరణ చేయవలెను .

అధ్యాయం 40
*శ్రీ సాయినాథుని భక్తుల మధుర స్మృతులు*

మూలం: *పూజ్యశ్రీ బి వి నరసింహ స్వామీజీ*

తెలుగు సేత: 
*పెండ్యాల శ్రీనివాస్*

No comments:

Post a Comment