Tuesday, May 26, 2020

సావిత్రి భాయి టెండూల్కర్, రాధాకృష్ణ మయీ, ద్వారాకమయీ

*శ్రీ సాయినాథ భజనమాల*

*శ్రీమతి సావిత్రి బాయ్ టెండూల్కర్*
*శ్రీ రఘునాథ టెండూల్కర్*

శ్రీ సాయినాథ భజనమాల  మనకు శ్రీ సాయి సచ్చరిత్ర *29వ అధ్యాయం ఓవి. 97 ( మణెమ్మ ) ప్రస్తావించారు*
*ఇది ప్రధానంగా సాయిబాబా స్తుతి. మొత్తం పద్యాలన్నీ ఆయన ప్రార్థనలే.*
*భజనమాల పారాయణ మనం సాయిని ఏవిధంగా స్తుతించాలి, ఆర్థించాలి, సేవ చేయాలి అనే విషయాలు అవగతం అవుతుంది.*

1 .  *ప్రపంచంలో ఎవరి కీర్తి అయితే గొప్పదో అటువంటి మంగళ స్వరూపమూర్తికి మొదలుగా వందనం. మిమ్మల్ని మొదటగా పూజిస్తున్నా, ఈ అల్పసేవను స్వీకరించు. నీ కడుపులో 14 కళల భాండాగారం ఉంది. మీ యొక్క కళలు చాలా గొప్పవి. నేను మీ సేవకై అష్ట సిద్ధులను ఉపయోగించే దాసిని. నేను అనగా ఈ దాసురాలు మిమ్ములను కోరేది కేవలం మీ దయా దాక్షిణ్యములే.*
 
2.  *తల్లి సరస్వతికి ప్రణమిల్లుతున్నాను. దేనికనగా గురువు యొక్క నామాన్ని కీర్తించుటకు వరమిమ్మని.*
 
3. *తల్లి సరస్వతికి ప్రణమిల్లుతున్నాను. ఏ తల్లయితే అందరికీ బుద్ధిని ప్రసాదిస్తుందో ఋషులు, మునులు అందరూ నీ చరణకమలములు వద్దే ఉన్నారు. కారణమేమంటే నీవే వేదాలకు పుట్టినిల్లు కనుక. బ్రహ్మ మానసపుత్రీ, అతిలోకసుందరి నా మీద నీ దయాదృష్టి ప్రసరింపచేయి తల్లీ. భక్తులకు ఎప్పుడైనా సరే కష్టాలు రాగానే, నీవు పరిగెత్తుకు వచ్చి వారిని కాపాడు తల్లీ.* 
 4. *సాయి సద్గురు,  నీకు నా వందనం. నిన్ను కీర్తించేటంతటి శక్తి కలిగిన దానను కాను. భక్తిలేని దానను. అజ్జానురాలను, దీనురాలను, నీ చరణ కమలాలను ఆశ్రయించినదానను.*
 
5. *సాధుమహాత్ములకు మీరు యజమాని. మీకు నా సాష్టాంగ ప్రణామం. లోక కల్యాణం కోసం మీరేంత శ్రమ చేశారు. అందరకు మంచి మార్గం చూపావు. మీరు ఇల్లు, వాకిలి ఏర్పాటు చేసుకోలేదు. మీరు కుటుంబం కూడా ఏర్పరచుకోలేదు. నీ పాదాలకు నా రెండు చేతులు జోడించి ప్రణమిల్లుతున్నా, నా ప్రార్థన మన్నించు.*

*శ్రీ సాయినాథ భజనమాల*
*శ్రీమతి సావిత్రి బాయ్ రఘునాథ్ టెండూల్కర్*

        *పలికే దైవం*
  *తెలుగు అనువాదం*

*శ్రీయుత కంభంపాటి శేషుమూర్తి గారు*

No comments:

Post a Comment