శ్రీ శిరిడీ సాయిబాబా వారు స్వయంగా మరాఠీ లో చెప్పిన ఏకాదశ సూత్రాలు..
శ్రీ సాయినాధ్ మహరాజ్ వారి ఏకాదశ సూత్రాలు
సాయి హారతులలో ’అనంతా తులాతే కసేరే స్తవావే’ అన్న నమస్కారాష్టకాన్ని వ్రాసిన శ్రీ మోహినీ రాజ్ పండిట్ అభంగ రూపంలో వ్రాసారు.
సాయి ఏకాదశ సూత్రాలు.
మరాఠీ మూలం: శ్రీ మోహినీ రాజ్ పండిత్
తెలుగు సేత: స్వామి అచలానంద సరస్వతి
🙏🌷☘️శ్రీ సాయి ఏకాదశ సూత్రాలు 🙏🌷☘️
1. శిరిడిలో అడుగు పెట్టిన తక్షణమే
తొలగి పోవును భక్తుల సర్వ అపాయాలు.
2. నా సమాథి వేదికను ఎక్కిన వెనువెంటనే
హరించును భక్తులు సర్వ దుఃఖములు.
3. ఈ శరీరాన్ని నేను వదలి వెళ్లి పోయిన
వస్తాను పరుగు పరుగున భక్తుల హితం కోసం.
4. ప్రాప్తిస్థాయి నాసమాథి మీ కోరిక లన్నీ కూడ
ఉంచండి నా యందు మీ దృఢ విశ్వాసం.
5. నిత్యం జీవించే వుంటాను నేను ఇది పరమ సత్యం
స్వానుభవంతో తెలుసుకొండి ఇదే సత్యమని నిత్యం.
6. నన్ను శరణు కోరి నిరాశులై మరలిన వారిని
ఒక్కరిని ఒక్కరినైన ఎవరైనా నాకు చూపండి.
7. ఎవరెవరు నన్ను ఏలా ఎలా భావించి భజిస్తారో
వారి వారికి నేను అలా అలానే ప్రాప్తిస్తాను.
8. మీ భారాన్ని నేను వహిస్తాను సర్వదా
ఈ నామాట కానే కాదు ఎప్పుడూ అన్యథా.
9. అందరికీ లభిస్తుంది ఇక్కడ నా సహాయం
ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ దొరకుతాయి.
10. కాయ వాచ మనసుతో నాకంకితమైన వారికి
ఎప్పటికీ నేను ఋణపడి ఉంటాను.
11. నా చరణాలలో అనన్య భక్తి తో అంకిత మైన వారు
వారే సుమా ధన్యులు ఇదే నా వచనములు.

No comments:
Post a Comment