Monday, May 11, 2020

గోధుమపిండి - వ్యాధి నివారణ ..!!

*గోధుమపిండి - వ్యాధి నివారణ* ..!!

సాయివద్ద మసీదులో ఒక మూల తిరగ లుండేది. బాబా అప్పుడపుడు నేలమీద ఒక గోనె పరచి, దానిమీద తిరగలి పెట్టుకుని కూర్చునే వారు. తర్వాత కఫ్నీ చేతులు ముడుచుకొని, ఒకచేత్తో గోధుమలు విసిరే వారు. ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనే వారు. ఒకసారి కారణమడిగితే, *ప్లేగు, మశూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నాయి. వారికి బదులు ఈ పిండి తీసుకొమ్మని వాటినాజ్ఞాపించాను* అన్నారు.

ఒకసారి 1911లో భక్తులు వారి ఆదేశం పాటించలేదు. కొద్ది రోజులకు శిరిడీలో ప్లేగు వ్యాపించింది. తెల్లవారుతూనే సాయివంటి మీద కూడా 7 ప్లేగు బొబ్బలు కనిపించాయి. భక్తులు భయపడి వాటికి చికిత్స తెల్పమంటే ఆయన, *ఈ బొబ్బలు శిరిడీలో ప్లేగుతో ఏడుగురు మరణిస్తారని సూచిస్తున్నాయి. నాకే చికిత్సా అవసరం లేదు* అన్నారు. భక్తులు వత్తిడి చేయగా, కాల్చిన దూది నూనెలో తడిపి అద్ద మన్నారు. తర్వాత గ్రామంలో ఏడుగురు ప్లేగుకు బలి అయ్యారు. బాబా వంటిమీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది.

No comments:

Post a Comment