అధ్యాత్మిక గ్రంధాలైన భగవద్గీత ,రామాయణం ,భాగవతాల్ని సర్వసాధారణంగా ఎందరో పారాయణం చేస్తారు .మొత్తం గ్రంథాన్ని లేదా అందులోని భాగాన్ని /ఘట్టాన్ని ఎంచుకొంటారు .
భగవద్గీతలో కొన్ని అధ్యాయాలు ,రామాయణం లో సర్గలు ,భాగవతంలో ఘట్టాలు (రోజుకు ఇన్ని
అని )నిర్ణయించుకొంటారు .నియమాలకు లోబడి
వాటిని నియమిత కాలంలో పూర్తిచేస్తారు .ఒక్కో
గ్రంథ పారాయణాన్ని ఒక్కొక్క ఉద్దేశంతో కొనసాగిస్తారు .
పారాయణం -"పారం "అంటే ఒడ్డు, దాటటం అనే
అర్ధాలు వున్నాయి .వాటినుంచి పుట్టినదే
"పారాయణం "అనే పదం .ఏదైనా గ్రంథాన్ని ఒకసారి పూర్తిగా చదివే ప్రక్రియను "పారాయణం
చేయడం "అంటారు .అది సాధారణ అర్థం .దాని
అంతరార్థం గ్రహించగలిగితే ,ఆ గ్రంథం చదివినవారి జీవితం తరిస్తుంది .ఫలితంగా వారు
తమ జీవితాలలో ,చతుర్విధ పురుషార్ధాలోని ,
అర్ధ ,కామాలకు బదులు ధర్మ ,మోక్షాలకే ప్రాధానమిస్తారు .గ్రంథాన్ని మాములుగా చదివితే
అది పఠనం .దానివల్ల విషయం ఒక్కటే తెలుస్తుంది .మనసులో ఏదో ఒక కొరిక కలిగి అది నెరవేరడానికి చదవడాన్ని పారాయణంగా భావిస్తారు కొందరు .దానివల్ల ఆ గ్రంథంలోని
అంతర్గత విషయాలు తెలుస్తాయి .భక్తి ,వైరాగ్య ,
జ్ఞానాలు కలుగుతాయి .వాటితో అనేక అధ్యాత్మిక
ప్రయోజనాలు కలుగుతాయి .మొదట ఒక కోరికతో పారాయణం మొదలుపెడితే అది పూర్తికావచ్చేసరికి ఆ గ్రంధంతో పాటు ఆ గ్రంథం
సంబంధించిన దైవంతో విడదీయరాని మానసిక
అనుబందం ఏర్పడుతుంది .అప్పుడు కోరిక స్థానంలో మానసిక శాంతి చోటుచేసుకొంటుంది .
పాడగా ,పాడగా రాగం వీనులవిందుగా మారుతుంది .అభ్యాసం చేయగా, చేయగా వైరాగ్యం అలవాటవుతుంది .పర్యవసానంగా ,
ఐహికా వాంఛల మీద వ్యామోహం తగ్గుతుంది .

No comments:
Post a Comment