Thursday, May 7, 2020

నింబారు ముందు మశీదు పైకప్పు దూలాలకు రెండు కొక్కాలు కనిపిస్తాయి.బాబా బల్లపై పడుకొనిన ఆ దృశ్యమును

కోక్కాలు

     నింబారు ముందు మశీదు పైకప్పు దూలాలకు రెండు కొక్కాలు కనిపిస్తాయి. నానాసాహెబు డేంగలే యనువారు బాబా నిద్రించుటకై నాలుగు మూరల పొడవు ఒక జానెడు మాత్రమే వెడల్పు గల కర్ర బల్లను తెచ్చిరి. బాబా దానిని నేలపై వేసుకొని పరుండుటకు బదులు, ఉయ్యాలవలె పాతగుడ్డ పీలికలతో మసీదు దూలాలనున్న కొక్కాలకు వ్రేలాడకట్టి నాలుగ వైపుల ప్రమిదలనుంచి దానిపై నిద్రించుట ప్రారంభించారు. ఆ పలుచని పాతగుడ్డ పీలికలు బల్ల బరువును మొయుటయే చిత్రము కాగా, దానికి తోడు బాబా బరువును కూడా భరించుట మరింత విచిత్రము. ఆజానుబాహులైన బాబా కాళ్లు చాపి పడుకొనినచో ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లు చాలకుండెను. అందుకే హేమదిపంతు *బాబా బల్లపై పడుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతము చూసి తీరవలసిందేనని వర్ణించియున్నాడు*. ఈ యొక్క దృశ్యాన్ని దత్తసాయి బంధువులందరు కూడా చూసి తరించండి. బాబాగారి ఆశీర్వాదముతో బల్లపై దీపపు ప్రమిదలా పడి ఉండాలి అని కోరుకుంటూ ..... ఓం  సాయి శ్రీ సాయి జయ జయ సాయి 

No comments:

Post a Comment