Monday, May 11, 2020

బయాజా బాయి గణపథ్ కోతే పాఠిల్ (బయాజా మా)


బయాజా బాయి గణపథ్ కోతే పాఠిల్ (బయాజా మా) గొప్ప సంపన్న భూస్వామి.


గణపత్ కోటే పాటిల్ ను పెళ్లి చేసుకున్న తరువాత షిర్డీకి వచ్చరు. ఆమె విధులన్ని తెలిసిన ప్రేమ తత్వంగల భార్య, ఇంటి పనులన్నీ చక్కగా చేసేవారు.  కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఆమె తన ఇంటికి వచ్చిన రకరకాల యాచకులు, సాధువులు మరియు బంధువులు ఎవరు వచ్చినా స్వయంగా అన్నం వండి పెట్టడం అంటే ఈమెకు చాలా ఇష్టం.*
 *"అన్నం పర బ్రహ్మ స్వరూపం" అని ఆమెకు తెలుసు .మొదటి రోజుల్లో బాబా షిర్డీకి వచ్చినప్పుడు బోజనము పెట్టిన మొదటి మహిళ.శ్రీ సాయి సచ్చరిత్ర 8 వ అధ్యాయంలో ఈమెకు బాబా యందు గల  ప్రేమ, భక్తి బాబావారిని ఈమె చూసుకునే విధానాన్ని చక్కగా వర్ణించబడింది. బయాజా మా బాబా లో వున్న దైవత్వాన్ని గుర్తించి ఫకీరును వెతుకుతూ తిరిగి తిరిగి ప్రతిరోజూ అతనికి సమయానికి భోజనం ఇచ్చేవారు.*
*ఆలా బాబా వారికీ బోజనము పెట్టిన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చి భోజనం చేసేవారు.  బాబా ద్వారకామాయి మసీదులో నివసించడం మొదలు పెట్టినప్పటి నుండి  ఆమె బాబా ఎక్కడ వున్నారా అని వెతికి భోజనం పెట్టే శ్రమను బాబావారు తగ్గించారు.*

 *ప్రతిరోజు బాబా ఈమె ఇంటి నుండి బిక్ష స్వయంగా వెళ్లి తీసుకునేవారు. బాబా గొంతు విన్న వెంటనే ఆమె చేస్తున్న పనులన్నీ వదిలి బాబా వద్దకు వచ్చేవారు. ఆ సమయంలో ఆమె పశువులకు లేదా గుర్రాలకు  దాన వేసే పనిలో ఉండేవారు. బాబా వారి కోసం తాజా భాక్రీ మరియు కూరలు రోటీలను సిద్ధం చేసి బాబా వారికీ ప్రేమతో సమర్పించే వారు. బాబా వారు బయాజ మా తన యందు చూపించే  ప్రేమ , భక్తికి చాలా సంతోషించేెవారు.*

 *బాబా ఒకసారి ఆమెను ఏమైన కోరిక కోరుకోమని  అడిగాడు?*

 *"మీకు సంపతి (సంపద) లేదా సంతతి (మీ కుటుంబ సంక్షేమం) కావాలా"?  ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ, పిల్లలు లేని తాత్యా సంక్షేమం కోసం ఆమె అనాలోచితంగా కోరిక కోరింది. బాబా వాగ్దానానికి అనుగుణంగా బాబా తాత్యా  మరియు అతని కుటుంబాన్ని చూసుకున్నారు. తాత్యా 'మరణాన్ని' కూడా తీసుకున్నారు*

 *బాబా సజీవ శరీరంతో జీవిస్తునప్పుడు హారతిని బాబాకి ఇచ్చేవారు. సాధారణంగా మాధవ్ అడ్కర్ ఇచ్చిన హారతి సమయంలో  “హారతి సాయి బాబా సౌక్య దతారా జీవా” వచ్చే సరికి బాబా ఒక్కటి లేదా రెండు సార్లు పీల్చిన చిలుముల అతనికి ఇచ్చేవారు.*

 *షిర్డీ సాయిబాబా సంస్థాన్  వారు వారి వారసులకు పల్లకిలో ఊరేగింపు సందర్భలలో  బాబా ఫోటోను తీసుకువెళ్ళే గౌరవాన్ని అందించారు.  చావాడి ఊరేగింపు వివరాలు ఈ క్రింది విధంగా ఉంటాయి .:*

*తాత్యా మనవడు విజు కోతే  పాటిల్ మరియు బయాజీ మా మనవడు అయిన గోపీనాథ్ కోతే  పాల్కి ఊరేగింపు ప్రారంభమయ్యే ముందు సమాధి మందిరానికి వెళతారు.  పూజారి బాబా యొక్క ఛాయాచిత్రాన్ని విజ్జుకు,  పాదుకలు ఉన్న కేసును గోపీనాథ్‌కు ఇస్తారు.  (అంతకుముందు, వారు వాటిని తీయటానికి సమాధి మెట్లు పైకి ఎక్కేవారు. అయితే ఈ పద్ధతి నాలుగేళ్ల క్రితం నుండి ఆగిపోయింది).  అప్పుడు వారు వాటిని సిద్ధంగా   ఉన్న పల్లకి వద్దకు తీసుకొని వెళ్లి పల్లకి లోపల ఉంచేవారు.  అప్పుడు పల్లకి ద్వారకామాయికి వెళుతుంది.  విజు అప్పుడు బాబా వారి  ఫోటో తీసి కొద్దిసేపు ద్వారాకామాయి ఎదురుగా వుండే రాయి మీద ఉంచి (బాబా వారు సజీవ శరీరంతో వున్నప్పుడు ఈ రాతిపైన కూర్చునేవారు.). రాతిపైన భజన హారతి జరిపిన తరువాత ఫోటోను    పల్లకి వద్దకు తీసుకువచ్చి అందులో ఉంచుతారు.*

*పల్లకిని మోసేవారు పల్లకిని పైకి  ఎత్తమని విజ్జు సందేశం  ఇచ్చేవరకు పల్లకిని పైకి ఎత్తబడదు. తాత్యా  వచ్చి పల్లకినిలో వున్నా బాబావారిని పల్లకి  ఊరేగింపుకు వెళ్ళమని కోరినంత వరకు బాబా పల్లకిలేవదు(అంటే  బాబావారు లేవరు). బాబా వారు అప్పుడు పల్లకిలో అక్కడనుండి  చావాడికి వెళతారు,చావడికి వెళ్లిన తరువాత అక్కడ షాడోపచార పూజ, హారతి ఇస్తారు.  ఆ సమయంలో బాబావారికీ విజ్జు  చేత వెలిగించిన చిలుము అందిస్తారు.*

 *తల్లి బయాజామాను దీవించిన ఇల్లు “సాయి కుటిర్” ఈ  ప్రక్కనే ఉంటుంది .*


 *(మూలం: విన్నీ చిట్లూరి)*

No comments:

Post a Comment