*" శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యము, ఆత్మనివేదనము "*
*ఈ తొమ్మిది భక్తి మార్గాలద్వారా కానీ, ఇందులో ఏదో ఒకటి అచరించి భగవంతుని అనుగ్రహము పొందవచ్చును. ఈ సాధనల ద్వారా మనసు పవిత్రపరచుకొని భగవంతుని సన్నిధికి చేరుకోవచ్చును.*
*అధ్యాత్మిక అభివృద్దికి చెప్పబడిన ఈ తొమ్మిది మార్గములలొ " శ్రవణం " మొదటిది.*
*సాయిబాబాతో తమకు కలిగిన అనుభవాలు, బాబా కథలు, బాబా లీలలు, బాబా మహిమలు ఎవరైనా వర్ణించినప్పుడు కానీ, బాబాకు సంబంధించిన గ్రంథాలు, సచ్చరిత్ర పారాయణం, స్వయముగా మనము విన్నవి, చదివినవానియందు కుతూహలం కలుగుతుంది.*
*శ్రద్దగా పారాయణము చేయడంవల్ల ఆ కుతూహలము ఆసక్తిగా మారుతుంది. ఆ అసక్తితో చదివినకొద్దీ, విన్నకొద్దీ, బాబా మహిమలు తెలుసుకొని, అనందం పొంది, భజనలు, నామ సంకీర్తనలు చేయడమే " కీర్తన భక్తి ". ఈ భక్తి మార్గంద్వారా మనలో ప్రగాఢమైన విశ్వాసం నాటుకొంటుంది.*
*ఫలితంగా మానసికముగా బాబా సన్నిధి, అనుభూతితో మూడవదైన*
*" స్మరణ భక్తి " కలుగుతుంది.*
*మనో ప్రేరణతో బాబా మందిరమునకు పోయి బాబా చరణ పాదుకలను కానీ, మన ఇంట్లొ గల బాబా చరణ పాదుకలను సేవించుటయే*
*" పాద సేవనం ".*
*అక్కడనుంచి మరో మెట్టుగా, బాబా పటముగానీ, విగ్రహముగానీ పెట్టుకుని శ్రద్దతో భక్తితో పంచోపచార పూజ ప్రారంభిస్తాం. అదియే*
*" అర్చన భక్తి ".*
*ఈ సేవతో బాబా యందు మరింత భక్తి పెరిగి " బాబా నేను నీ సేవకుడను .నీవే నా యజమాని " అన్న భావనయే " దాస్య భక్తి ".*
*ఎక్కడ బాబా ఫొటొ, విగ్రహము కానీ కనిపిస్తుంటే భౌతికంగా, మానసికముగా నమస్కరించుటయే*
*" నమస్కార భక్తి ".*
*మరింత భక్తీ వృద్ది చెందినపుడు బాబా యందు కలిగే భక్తీ " సఖ్య భక్తీ "కలుగును.*
*అనగా బాబా దయతో మరింత సన్నిహితమగుటే.*
*చివరగా " ఆత్మ నివేదనం " అదే శరణాగతి. అదే మోక్ష పాప్తి.*
*ద్వైతమునకు, అహంకారమునకు, స్థానమైన మనసు బాబా యందు లయమగుట అదియే " ఆత్మనివేదనం " ఈ తొమ్మిది భక్తి మార్గాలలో కానీ, ఏదో ఒక మార్గాన్ని కానీ ఆచరించి బాబాను సేవించి బాబా అనుగ్రహ అశీసులు పొందవచ్చును.*