శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం - శ్రీ ఉపాసనీ మహరాజ్ .
శ్రీసాయినాధమహిమ స్తోత్రం షిర్డీసాయి కిచ్చే మధ్యాహాన ,సాయంకాల హరతులలో పాడుకొంటాము .దీనిని రచించింది సాయిభక్త
శ్రీ ఉపాసనీ మహరాజ్ .శ్రీ ఉపాసనీ షిరిడీలో సాయి సన్నిధిలో అధ్యాత్మిక శిక్షణలో ఉన్నప్పుడు
1911 సం .లో రచన చేసాడు .1912 సం.లో
శ్రావణ పౌర్ణమినాడు షిరిడీలో గురుస్థాన్ లో
బాబా వేపచెట్టు క్రింద తపసు చేసిన గుర్తుగా
పాలరాయి పాదుకలు ప్రతిష్టించబడినవి .ఆ సందర్భములో పాలరాతి పాదుకలు ప్రతిష్టించిన
చిన్న ఎత్తు స్తంభముపై ఈ మహిమస్తోత్రము లోని
నాలుగు ,అయిదు శ్లోకాలు చెక్కబడినవి .ఈ మహిమా స్తోత్రం నిత్య పారాయణ ఎంతో శుభకరం .ఈ శ్లోకాలన్నిటిలోనూ చివరగా "నమామీశ్వరం సద్గురు సాయినాథం " అను శ్లోకం
ఒక మకుటం .ఇందులో శ్రీ సాయిబాబావారి ఈశ్వరతత్వం ,గురుతత్వం ప్రస్ఫుటముగా కనిపిస్తుంది .ఈశ్వర తత్వం అనగా సర్వ శక్తిమత్వం ,సర్వవ్యాపక తత్వం ,సర్వఙ్ఞత ,ఈ సృష్టియందు తనకు గల సర్వభౌమత్వం విశదమవుతుంది .నిరంతరం ఆత్మధ్యాన స్ధితి ,
తన ను, సమర్ధసద్గురువుగా ఆశ్రయించినవారికి
గురుతత్వం బోధించి తనంతవారిగా చేయుటయే
గురువుగా తన ఆశయం .బాబా పరబ్రహ్మ స్థితిగా
ఒక గురుస్వరూపంగా ,ఈ రెండు తత్వాలూ ,ఈ
మహిమా స్తోత్రంలో కనిపిస్తాయి .
No comments:
Post a Comment