Sunday, July 28, 2024

బాబా అంకిత భక్తుడైన వామనరావు పటేల్ ( సాయి శరణానంద ) ఒక అంధుడు ద్వారకామాయిలో కూర్చుని " రామకృష్ణ హరి, జై జై పాండురంగ హరి " భజనలు చేయడం చూశాడు.*

*షిరిడీలో ఘమారు సన్నిధిలో షుమారు 1913 -1915 మధ్యకాలంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది.*

*బాబా అంకిత భక్తుడైన వామనరావు పటేల్ ( సాయి శరణానంద ) ఒక అంధుడు ద్వారకామాయిలో కూర్చుని " రామకృష్ణ హరి, జై జై పాండురంగ హరి " భజనలు చేయడం చూశాడు.* 


*తిరిగి అతడిని వామనరావు పటేల్ 1942 - 1943 సం. మధ్యలో అదే ద్వారకామాయి సభా మంటపంలో భగవద్గీత, అమృతానుభవం చదువుతూ కనిపించేసరికి శరణానంద ఆశ్చర్యపోయాడు.*

*అతడికి కంటి  చూపు ఎప్పుడు వచ్చిందని అడిగాడు.* 
*సాయిబాబా కరుణవలనే తనకు కంటిచూపు వచ్చిందని చెప్పాడు.*
*బాబా సజీవంగా ఉన్నప్పుడు చూపు కొంచం మసకగా వచ్చింది.* *సాయిబాబా మహాసమాధి అనంతరం చూపు స్పష్టంగా వచ్చిందని సమాధానం ఇచ్చాడు.*
*సాయిబాబా కటాక్షించిన చూపును ధన్యం చేసుకున్న వ్యక్తి.*

*బాబా సమాధి అనంతరం కూడా తమ అవతార కార్యాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.*

*2. బాబా భక్తురాలైన మాతాజీ కృష్ణ ప్రియ గారు బాబా పూజచేసిన తరువాత, బాబాకు నివేదించిన పదార్ధాలు తగ్గివుండేవి.ఆ తగ్గిన భాగాన్ని బాబా స్వీకరించారని భక్తులు నమ్మేడివారు.*
*ఒకసారి శ్రీ బి. వి. నరసింహస్వామి గారు కొంత హల్వాను కొని, అది ఒక డబ్బా నిండా ఉంచి, స్వయముగా ఆ డబ్బాకు సీలువేసి, సాయిబాబాకు నైవేద్యము నిమిత్తం ఆవిడకు అప్పగించారు.*

*పూజ అయిపోయిన తరువాత ఆమె తిరిగి ఆ డబ్బాను నరసింహస్వామి గారికి ఇచ్చినప్పుడు "నేను ఇచ్చిన డబ్బా సీలు, సీలుగానే వుంది కదా ? అని కృష్ణప్రియగారిని అడిగాడు.*
*అందుకు సరిగాన్నే వుంది స్వామీ ! " అని జవాబిచ్చింది. డబ్బా సీలు తీసి చుడగా హల్వాపై చేతి వేలి గుర్తులు కనిపించాయి.*
*బాబా చేసిన ఈ లీల చూసి అందరూ అశ్చర్యపోయారు.*

*సాయి లీలలు అమోఘం, అనంతం.*

Sunday, July 7, 2024

శ్రీ సాయిబాబా

*సాయి అంకిత భక్తులు - శ్రీమతి చంద్రాబాయి బోర్కర్.*

*సాయిబాబా పేరు ప్రఖ్యాతులు మహరాష్ట్ర రాష్ట్రంలో అంతగా తెలియక ముందే బొంబాయి నగరంలో శివారు ప్రాంతంలో నివశించే శ్రీమతి చంద్రాబాయి బోల్కర్ సాయి భక్తురాలైంది. ఆమె ఏడాదిలో ఆరు నెలలు షిర్డీలోనే నివసించి బాబాను సేవించేది.*

*సాయిబాబా నీటితో దీపాలు వెలిగించడం చూసిన ఈ భక్తురాలు ధన్యజీవి.*

*సాయిబాబాయే స్వయంగా చంద్రాబాయి గూర్చి చెపుతూ "ఈమె నాకు ఏడు జన్మలనుండి నాకు సోదరి " అని మట్లాడేవారు.*

*అందరికి అన్ని వరాలిచ్చే, కామధేనువు, కల్పవృక్షం మించిన శ్రీ సాయినాధుని సన్నిధిలో ఉన్నా ఆమెకు సంతానం కలగలేదు.* 

*సాయిబాబా వరప్రసాది అని, తనకు సంతానం ప్రసాదించగలిగే మహితాత్ముడని అమెకు తెలుసు.*

*కానీ నిరంతరం సాయి దర్శన, సేవ భాగ్యము, తన అదృష్టంగా భావించే, చంద్రాబాయి, బాబాను తనకు సంతానం ప్రసాదించమని కోరలేదు.*

*అంతే కాదు బాబాను మనసావాచా అంకితభావంతో సేవిస్తున్న తాత్యాకోతే పాటిల్ కు కూడా సంతానము లేదు.*
*చంద్రాబాయి బాబాతో, తాత్యాకు సంతానము ప్రసాదించమని కోరేది.*

*బాబా సమాధి చెందక పూర్వము చివర రోజులలో, బాబా చంద్రాబాయిని ఇలా అడిగారు " అమ్మా ! నీ కోరిక ఏమిటి ? అని అడగగా అందుకు ఆమె "బాబా ! నీవు సర్వజ్ఞుడవు, ఎవరికి ఏది అవసరమో, ఎవరి మనసులో ఏమి కోరుతున్నారో నీకు తెలియనిది ఏమీ లేదు " అని జవాబిచ్చినది.*

*ఆమె బాబా దేహం విడిచే అవసాన సమయాన సాయినాధుని నోట్లో నీరు పోసి, పాదాలు కడిగిన భాగ్యశాలి.*

*ఆమె వయసు ఏభయి దాటిపోయి, అమెకు సంతానం కలిగే అవకాశమే లేదన్న సమయములో బాబా అనుగ్రహముచే సంతానము కలిగింది.*
*కొన్నాళ్లకు ఆమె గృహమే సాయి మందిరమైంది.*