Sunday, September 1, 2024

శ్రావణ కృష్ణ అమావాస్య* *మహారాష్ట్రలో, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో " పోలాల అమావాస్య " అంటారు.*

 శ్రావణ కృష్ణ అమావాస్య*

*మహారాష్ట్రలో, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో " పోలాల అమావాస్య " అంటారు.*

*ఉత్తర భారతదేశంలో* 
*" హరియాలి అమావాస్య " అంటారు*

*కొద్ది రాష్ట్రలలో వారి సాంస్కృతిక, సాంప్రదాయం ప్రకారం ఈ రోజు పండుగగా జరుపుకుంటారు.*

*శిరిడీలో, మహారాష్ట్రలో* 

*" పోలాల అమావాస్య "ఎంతో వైభవంగా జరుపుకునే విషయం మనకు తెలిసిందే.*

*మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుందాం*

*మహారాష్ట్రీయులు ఈ రోజు తమ  పాడి పంటలు వృద్ధి కోసం శ్రమ పడిన పశు సంపదకు కృతజ్ఞతగా పూర్వకంగా పూజలు నిర్వహిస్తారు.*
*వాటికి అభ్యంగనస్నానం, వివిధ రకాల అలంకరణలు చేసి, పూజలు చేస్తారు.* 

*పిండి వంటలతో షడ్రసోపేతమైన విందు భోజనం ఆరగింపు చేయిస్తారు*  

*సమాధి మందిరంలో, మధ్యాహ్న ఆరతికి ముందు సాయి మూర్తికి ( విగ్రహానికి ) ఇరువైపులా మట్టితో చేసిన రంగు రంగుల 5 ఎద్దులు, 1 ఆవు, దూడల ప్రతిమలను ఉంచుతారు.*
*వాటికి  గంధం, పుష్పాలతో పూజ చేసి నైవేద్యంగా వరి అన్నం, పూర్ణ పోళీలు సమర్పిస్తారు.*

*శిరిడిలో సాయంత్రం అలంకరించిన తమ పశు సంపదను గేట్ నెంబర్ 4 ద్వారా తీసుకుని వచ్చి సమాధి మందిరం కిటికీ దగ్గర నిలబెట్టి సర్వజీవ కారుణ్యమూర్తి సాయిని దర్శింప చేస్తారు.*

*( ప్రస్తుత కారణాల వలన ఈ రోజు పశు సంపదకు దర్శన ఏర్పాటు గురించి సమాచారం లేదు )*

*నిమ్నోకర్ భార్య, బేలాపూర్ ప్రయాణం కథ మనం సాయి సచ్చరిత్రలో పారాయణ చేసినదే.*

*నిమ్నోంకర్ ఆమెను రెండవ రోజే తిరిగి రావాలని ఆదేశించారు. ఆ రోజు అమావాస్య, అమావాస్య ప్రయాణానికి శుభసూచకం కాదని ఆమె సంశయిస్తుంది.*
*అది కాకుండా తన పిల్లలు, బంధువులతో " పోలాల అమావాస్య " రోజు గడపాలి అని మనసులోనే కోరుకుంటుంది.*

*సర్వాంతర్యామి సాయి ఆమె మనస్సు లోని కోరికకు అనుగుణంగా, బేలాపూర్ వెళ్లి నాలుగు రోజుల తరువాత తిరిగి షిర్డి రమ్మంటారు.*

సేకరణ, సమర్పణ

*చిల్లర కృష్ణమూర్తి*
06-09-2021

No comments:

Post a Comment