*పరమహంస పరివ్రాజక, అపర దత్తస్వరూపులైన శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి ( టెంబె ) స్వామి వారి 170 వ జన్మదినం *
*సాయిసచ్చరిత్ర చివరి అధ్యాయములలో టెంబె స్వామి ప్రస్తావన కనిపిస్తుంది.*
*వాసుదేవానంద సరస్వతి స్వామివారు సాయిబాబాకి సమకాలికుడు.*
*స్వామివారు తమ 18 వ చతుర్మాస దీక్షలో భాగముగా రాజమహేంద్రవర పట్టణాన్ని 1909 సం. ఫిబ్రవరి నెలలో దర్శించడం జరిగింది.*
*అక్కడే పుండలీకరావు గా పేర్కొనబడిన దాసగణు మహరాజ్ స్వామివారిని కలవడం జరిగింది.*
*పరమనిష్టాగరిష్ఠుడైన స్వాములవారు తమ ఆచారాన్ని ఉల్లఘించి సాయిబాబాకు పాదాభివందనం చేసి ఒక నారికేళమును బాబాకు సమర్పించమని దాసగణు మహరాజ్ కు అదేశించారు.*
*అయన రాజమండ్రి నుండి కొబ్బరి కాయని పంపడమే మహాకార్యం కాదు, అదే సంవత్సరములో పిఠాపురం దర్శించి, అక్కడ ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుఁడు తెలుగువారని, ఆయన జన్మస్ధలం పిఠాపురమని తెలిపి అక్కడ దత్త పాదుకలు ప్రతిష్టించారు.*
*వాసుదేవానంద సరస్వతీ స్వాములవారు తెలుగునాట దత్త సంప్రదాయాన్ని పునరుద్ధించారు* *"వ్యాసోచ్ఛిష్ఠం జగత్సర్వము" అని అంటారు.* *దత్తాత్రేయులవారి సాహిత్యం వాసుదేవానందులవారి ఉచ్ఛిష్ఠం అన్నా తప్పు కాదనీ అనిపిస్తుంది.*
*కొంకణ్ ప్రాంతములో గల సావంతవాడి సమీపములో మాన్గావ్ గ్రామములో 13 ఆగష్టు 1854 న వాసుదేవానందులు జన్మించారు.*
*దత్తాత్రేయ స్వామి అయనకు స్వప్నములో మంత్రోపదేశం ఇచ్చారు.*
*ఆయన తన వద్దగల దత్త విగ్రహం ( అది సాక్షాత్తూ దత్తాత్రేయ ప్రభువే ) ఆయనతో స్వయంగా, సన్నిహితంగా సంభాషించేవారు.*
*స్వాములవారు ఆ దత్తస్వామిని పూజించేవారు. ఈవిధమైన సన్నిహిత సంబంధం అపూర్వమైన విషయము.*
*సన్యాసులు ఇతరులకు నమస్కరించడం గానీ, విగ్రహాలను పూజించడం కానీ చేయరు.*
*దత్త మూర్తిని ఆరాధించడంలోను, సాయిబాబాకు నమస్కరించడంలోనూ తన అచారాన్ని పాటించలేదు.*
*దత్తుని అరాధనను విశేషంగా మహరాష్ట్రలో తిరిగి ప్రవేశపెట్టారు. ఆయన శ్రీగురుచరిత్రను, గురుసంహిత అనే గ్రంథాలను సంస్కృతంలో వ్రాశారు. ఇంకా దత్తపరమైన స్తోత్రాలు, గ్రంథాలు అనేకమైనవి సంస్కృతంలో రచించారు.*
*స్వాములవారు శృంగేరిని దర్శించినప్పుడు అలనాటి శృంగేరి శంకర పీఠం అధిపతి అయిన శ్రీ సచ్చిదానంద శివాభి నవ నృశింహ భారతీ స్వాములవారిచే (1879 -1912 ) "అయంహీ భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయ స్వయం యతిః " ( ఈ యతి సాక్షాత్తూ దత్తాత్రేయుడే ) అని కీర్తించబడిన వాసుదేవానంద సరస్వతి స్వాముల స్మరణ చేసి దత్తాత్రేయుని అనుగ్రహ ఆశీస్సులు పొందుదాం.*
*పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, తిథి ప్రకారం శ్రావణ బహుళ పంచమినాడు అనఁగా ఆంగ్ల కాలమానం ప్రకారం 13 -8 -1854 తేదీ నాడు జన్మించారు.*
*నేడు అనగా 23- 08 -2023 శుక్రవారం, శ్రావణ బహుళ పంచమి, వాసుదేవానంద సరస్వతి స్వామి వారి 170 వ జయంతి.*
*దిగంబరా ! దిగంబరా ! శ్రీపాద వల్లభ దిగంబరా !*
*దిగంబరా ! దిగంబరా !*
*దత్తాత్రేయ దిగంబరా*
*దిగంబరా ! దిగంబరా !*
*అవధూత చింతన దిగంబరా!*

.jpg)
.jpg)

.jpg)