*నేడు మనము షిర్డీ దర్శించునప్పుడు సమాధి మందిరం, ద్వారకా మాయి, గురుస్థాన్ మున్నగు ప్రదేశాలు దర్శించునప్పుడు* *ఆయా ప్రదేశాలలో బాబా వారి పాదుకలు దర్శించుకోవచ్చు.*
*మొదటిసారిగా 1912 సం. శ్రావణ పూర్ణిమ నాడు అత్యంత భక్తి శ్రద్దలతో, వైభవపేతంగా, షిరిడీలో బాబా అశీసులతో, ఖండోబా మందిరం నందున్న ఉపాసనీ మహరాజ్ ఆదేశాలతో, సూచనలతో గురుస్థాన్ నందు గల వేపచెట్టు క్రింద పాలరాతి పాదుకలు పాదుకలు ప్రతిష్టించబడినవి.*
*ఆ పాదుకలు వృత్తాంతం - బాంబాయి నగరము నందున్న రామారావు కొఠారీ అను డాక్టరు గారి వద్ద పనిచేసే అయన కాంపౌండర్, అతని స్నేహితుడైన భాయి కృష్ణాజీ అలీబాగ్ కర్ చేసిన ప్రయత్నముతో ఈ పాదుకలు గురుస్థాన్ నందు ప్రతిష్టింపబడినవి.*
*భాయి కృష్ణాజి అలీబాగ్ కర్ మొదట అక్కల్కోట మహరాజ్ భక్తుడు.*
*అతను అక్కల్కోట వెళ్ళి అక్కల్కోట మహరాజు పాదుకలు, చిత్రపటమును పూజించవలెనని సంకల్పించెను.*
*అతను బయలుదేరుటకు మునుపే అక్కల్కోట మహరాజ్ స్వప్న దర్శనమిచ్చి, షిర్డి గ్రామము తన నివాసమని, అక్కడ ఉన్న సాయి మహరాజ్ తాను వేరు కాదనీ, అక్కడకి పోయి పూజ చేసుకోమని ఆదేశించగా, అలీబాగ్ కర్, అతని మిత్రుడైన డాక్టర్ కొఠారి కాంపౌండర్ ఇద్దరు కలసి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నారు.*
*వారు షిరిడీలో నున్నపుడు అక్కడగల బాబా భక్తులయిన సగుణ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ అను వారి పరిచయము చేసుకుని బాబా షిరిడీలో వేపచెట్టు క్రింద తపస్సు చేసినందుకు గురుతుగా బాబా పాదుకలు ప్రతిష్టాపన చేయవలెనని నిశ్చయించుకొనిరి.*
*మొదట వారు రాతితో చేసిన పాదుకలు ప్రతిష్టించవలెనని అనుకొనిరి.*
*కానీ ఈ విషయము డాక్టరు రామారావు కొఠారి కు తెలుపగా, ఆయన*
*సంతోషముగా షిరిడీకి వచ్చి నమూనా పాదుకలు* *చిత్రమును ఖండోబా మందిరం నందున్న ఉపాసనీ మహరాజ్ గారికి చూపగా, ఉపాసని మహరాజ్* *పాదుకల యందు పద్మము, శంఖము, చక్రము మున్నగున్నవి చేర్చి, బాబా యోగ శక్తి మరియు వేపచెట్టు గొప్పదనాన్ని తెలిపే తాను రచించిన " సాయినాథ మహిమా స్తోత్రము " లోని నాలుగు అయిదు శ్లోకాలను పాదుకలు ప్రతిష్ట చేసే పీఠము నందు చెక్కించమని సలహా ఇవ్వగా, ఉపాసనీ బాబా సూచించిన విధంగా డాక్టరు రామరావు కొఠారి కృషితో బాబా వారి పాలరాతి పాదుకలు తయారు చేయబడి బొంబాయి నుండి షిరిడీకి రాగనే బాబా వాటిని సృజించి " అవి భగవంతుని పాదుకలు." అని సూచించారు. గురుస్థాన్ నందు ప్రతిష్టించవలెనని ఆదేశించగా, పాదుకలను దాదాకేల్కరు, ఉపాసనీ* *మహరాజ్ మున్నగు భక్తులు వెంటరాగా గోవింద కమలాకర దీక్షిత్ అను భక్తుడు ఆ పాదుకలు శిరస్సున పెట్టుకుని ఖండోబా మందిరం నుండి* *గురుస్థానము వచ్చి ఆ వేపచెట్టు మూలమున పాదుకలు శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం 11 గంటలకు ప్రతిష్టంపబడినవి.( 27 -8 -1912 శ్రావణపౌర్ణమి)*
*" సదా నింబవృక్షస్య ములాధివాసత్ ....*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథం.*
*నేడు అనగా 19 -8 -2024 సోమవారం శ్రావణపౌర్ణమి.*
*నేటికి షిరిడీలో, గురుస్థానం లో పాదుకా ప్రతిష్ట జరిగి 112 ఏళ్లు సమాప్తి అగును.*
*సాయి సచ్చరిత్ర (ప్రత్తి నారాయణరావు గారి గ్రంథములో అయిదవ అధ్యాయములో ఈ విషయము ప్రస్తావించబడినది.*
.jpg)
No comments:
Post a Comment