1. మూల విరాట్టు అయిన కామాక్షి
2. అటు పక్కనే ఉన్న తపో కామాక్షి
3. ప్రధానాలయం వెనక వైపున ఉన్న విమాన కామాక్షి
4. లక్ష్మి దేవి, సరస్వతి దేవీలను కుడి వైపు, ఎడమ వైపు పెట్టుకొని మధ్యలో ఉంటారు ఉత్సవ కామాక్షి..
5. స్వర్ణ కామాక్షి..
ప్రస్తుతం ఈ స్వర్ణ కామాక్షి తంజావూరు లో ఉన్నారు... ఎందుకు అక్కడికి వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాము....
ఒకప్పుడు ముస్లింల దండయాత్ర భారీ నుండి కాపాడడానికి... ఈ ఆలయంలో ఉన్న అర్చకులు ఆ స్వర్ణ మయంతో చేసిన కామాక్షి విగ్రహాన్ని కాంచీపురం నుండి తంజావూరు తీసుకెళ్లి దాచారు... కొంత కాలం తర్వాత అమ్మవారు అక్కడే ఉండడానికి కొన్ని సంకేతాలు ఇచ్చారు.. అలా స్వర్ణ కామాక్షి తంజావూరులో కొలువయ్యారు..
అయితే కాంచీపురంలో స్వర్ణ కామాక్షి ఉన్న స్థలం ఖాళీగా ఉంచకూడదు అన్న భావన చేసి.. అక్కడ అమ్మవారీ యొక్క స్వర్ణ పాదుకలు పెట్టారు...
మనం కేవలం తంజావూరులో మాత్రం స్వర్ణ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము...
తంజావూరులో కొలువైన బృహదీశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నాక.. ఈ స్వర్ణ కామాక్షి ఆలయానికి వెళ్తారు...
సాధారణంగా కామాక్షి అమ్మవారు కూర్చున్న భంగిమలో ఉంటారు.. ఇక్కడ తంజావూరులో నిల్చొని ఉన్న భంగిమలో దర్శనం ఇస్తారు స్వర్ణ కామాక్షి అమ్మవారు...
అరుణాచలశివ 🌹
.jpg)
No comments:
Post a Comment