Saturday, November 2, 2024

సాయి భక్త ప్రపంచంలో -- ధృవతార* *కాకాసాహెబ్ దీక్షిత్ - సూక్ష్మ పరిశీలన

*సాయి భక్త ప్రపంచంలో -- ధృవతార*

 *కాకాసాహెబ్ దీక్షిత్ - సూక్ష్మ పరిశీలన*




*1 నవంబర్ 1909*
*2 నవంబర్ 1909*

*1) సాయి అంకిత భక్తులు మిరికర్ తండ్రి కొడుకులు గృహంలో అహ్మద్ నగర్ లో బస.*

2) సాయి ఆహ్వానం - పటం   
       రూపంలో 

*(నానాసాహెబ్ చందోర్కర్ మేఘశ్యామాకు పూజ నిమిత్తం ఇచ్చిన శ్రీ సాయి బాబా చిత్రపటం  అద్దం పగిలి నందు వలన సరిచేయడానికి మిరీకర్ ఇంట్లో ఉండటంతో కాకాసాహెబ్ దీక్షిత్ సాయి దర్శనం చేసుకున్నాడు.)* 

*అంతేకాదు అంతర్లీనంగా ఆలోచిస్తే దీక్షిత్ ని షిరిడీకి ఆహ్వానించటానికి ఫోటో రూపంలో సాయే అక్కడ కొలువై ఉన్నారు. సాయిబాబా వారికి వారి చిత్రపటానికి ఏమాత్రం తేడా లేదని మనకు తెలుసు కదా!*

*3) శ్యామా అత్తగారికి అస్వస్థతగా ఉన్నదని టెలిగ్రామ్ రావడం, శ్యామా అహ్మద్ నగర్ బయలుదేరి వెళ్లడం, మిరికర్‌ను కలవడం అంత దీక్షితుని షిరిడికి ఆహ్వానించడానికి బాబా చేసిన ఏర్పాటు. దీక్షిత్ ను ఎవరితోపాటు శిరడి పంపాలి అని ఆలోచిస్తున్న మిరీకర్ కు శ్యామా కంటే వేరెవరూ మంచితోడు. శ్యామా సాయి ప్రతినిధి కదా!*

*4) దీక్షిత్, సాయిబాబా వారి చిత్రపటంతో, శ్యామాతో  సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణానికి సిద్ధమైనప్పటికి బాబా గార్డ్ రూపంలో వారిని ఫస్ట్ క్లాస్ లో ప్రయాణానికి ఏర్పాటు చేయటం.*


*5) రైలులో సాయి చిత్ర పటం సమక్షంలో శ్యామా  సాయి లీలలను మహత్తును చర్చించుకోవడం.*

*6) సాయిబాబా వారిని కలవాలనే కుతూహలాన్ని, లోనావాలాలో శ్రవణానంద పరిచయం దీక్షితుకు కల్పించిన నానాసాహెబ్ చందోర్కర్ కోవపర్గావ్ రైల్వే స్టేషన్లో కలవడం.*

*02-09-1909 సాయి ప్రత్యక్ష దర్శనం*

ఇంతటి భాగ్యం దీక్షితుకు ఎలా కలిగింది అనే అంశంపై ఒక పరిశీలన:

*దీక్షిత్ సాయిని పుణ్య పావన ప్రత్యక్ష దర్శనం చేసుకున్న సమయం*

 *" గురు పుష్య అమృత యోగం.*"
 
*పుష్యమి నక్షత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు బృహస్పతి (గురు) సంచారంతో సంపూర్ణమైన శుభసంయోగ వేళ*

*"గురు పుష్య అమృత యోగం అంటారు.*"

*25-07-1925 సాయిలో ఐక్యం కావడం*

రైలులో సచ్చరిత గ్రంధ రచయిత హేమాడ్ పంతు మరియు భజనమాల రచయిత రఘునాథ్,  టెండూల్కర్  తో సాయి లీలలను మహత్తును చర్చించుకుంటూ దీక్షిత్ సాయిలో ఐక్యం కావడం మరో గొప్ప విశేషం.

      *అనాయాస మరణం -* 
           *వాస్తవమే కదా!*

సాయి ఇది మాత్రమే ప్రసాదించారా?!

*"నేను నా కాకాను విమానంలో తీసుకు వెళతాను "* 

 సాయి దీక్షిత్ కు ఇచ్చిన వాగ్దానం

అధ్యాయం 12 ఓ వి 112

*కీ తే సంతాచే బోల*
*కధీంహీ జే నసణార బోల*
*అర్థభరిత సదా సఖోల*
*కరవేల మోల్ కవణతే*

సాయి మాటలు ఎప్పుడు అర్థం లేకుండా ఉండవు. అవి ఎప్పుడు అర్థం తో నిండి పూర్ణంగా ఉంటాయి.ఆ మాటలకు ఎవరు విలువ కట్టగలరు?

అధ్యాయం 13 ఓవి 1.

*ఆకారే సూత్రమయ అతి లహాన*
*అర్థగాంభీర్యే అతి గహన*
*వ్యాపకత్వే బహు విస్తీర్ణ*
*సంకీర్ణ తరీ తితుకేచ*

బాబా పలుకులు చాలా చిన్నవిగా, సూత్రాల లాగా, సంగ్రహంగా ఉంటాయి. కానీ వాటి అర్ధం చాలా లోతుగాను, గంభీరంగానూ, పూర్తిగానూ ఉంటాయి.

అధ్యాయం 13 ఓవి 2.

*ఏసే తే బాబాంచే బోల*
*అర్థే తత్వే అతి సఖోల*
*కల్పాంతీహీ నవ్హతీ ఫోల*
*సమతోల ఆణి ఆనమోల*

వారి మాటల లోని అర్థం లోతుగా, సులభంగా అర్థం కానిదిగా ఉండే సత్యత మాటలు ఎప్పుడూ అర్థం లేకుండా ఉండవు. అవి చాలా అమూల్యమైనవి గాను, సమము గాను ఉండేవి.

*సాయి సత్యవాక్య పరిపాలకుడు*
 
*ఆ గమ్యం ఏమిటి!?!*

*ఆ గమ్యం సాయి నిజసుఖ ధామం*

*సాయి సచ్చరిత్రలో సాయి స్వయంగా సుఖధామం గురించి ప్రస్తావించిన అధ్యాయం 27 ఓ వి 56*

*తేవ్హా హే గ్రంథ యేతీల కామా*
*దస్త రాంతూ న దావీల* 
*శామా*
*స్వయే ఆపణ జాఊ నిజధామా*
*గ్రంథ ప్రతిమా హోతీల*

*నేను నా నిజ నివాసానికి వెళ్ళిపోయాక* శ్యామా వీనిని తీసి వారికి చూపిస్తాడు. అప్పుడు ఈ గ్రంథాలు జ్ఞానాన్ని పంచి పెడతాయి.

శ్యామా దగ్గర సాయి గ్రంథాలు ఇచ్చి భద్రపరచు అంటారు కదా ఆ సందర్భంలో సాయి చెప్పిన మాటలు పైన ఉన్న 
ఓ వి లోనివి.

*సంత్ తుకారాంను పుష్పక విమానంలో మహావిష్ణువు తన నిజ సుఖధామం (వైకుంఠం) తీసుకుని వెళ్ళారు.*

*సాయి నిజ  నిజధామం*  
        *సిద్ధలోకం.*

*సాయి సమాధి అనంతరం సుమారు ఏడు సంవత్సరాల తరువాత దీక్షితును సప్త సముద్రాలు దాటించి సాయి తాను ఒకే ఆత్మ స్వరూపులు అనే సాక్షాత్కారము కలిగించి దీక్షితుకు, సాయి అఖండ అనంత అక్షయ సన్నిధి ప్రాప్తి తన  నిజ సుఖదామం లో కలిగించారు*

*దీక్షిత్ సత్యసంధతకు సాయి ఇచ్చిన బహుమతి, బహుమానం, పురస్కారం.*

*దీక్షిత్ యొక్క గురువు ఆజ్జా పాలన మార్గంలో ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క మైలురాయి.*

*సాయి భక్తులకు దీక్షిత్ అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఆదర్శమైన వాడే.*

*ఎవ్వరు ఎన్నటికీ, ఎప్పటికీ చేరుకోలేని కలికితురాయి. (MILESTONE) అధిగమించలేని శిఖరం దీక్షిత్.*

*సాయిని మనం ప్రేమించటం ఉత్తమం.*

*సమర్థ సద్గురు పరిపూర్ణ పరబ్రహ్మచే మనం ప్రేమించబడటం సర్వోత్కృష్టమైనది.*

*ఆ సర్వోన్నత స్థాయికి,  స్థితికి గురు ఆజ్ఞా పాలన, గురు వచన దక్షత మూలంగా, క్రమంగా చేరుకున్న గుణవంతులలో అత్యుత్తమ గుణవంతుడు, ఏకైక భక్తుడు కాకా దీక్షిత్.*

*దీక్షితులా మరెవరైనా ఆచరించటం అసాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో!!!!!!*

*🙏🙏🙏సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పనమస్తు🙏🙏*
 


*చిల్లర కృష్ణమూర్తి*
9840184204


*1 నవంబర్ 2018*

Wednesday, October 23, 2024

విమర్శకులకు సూచన 🕉️ *శ్రీ సాయిబాబాను విమర్శించే వారికి ఈ వ్యాసము ఒకసారి పంపండి.*

🕉️విమర్శకులకు సూచన 🕉️

*శ్రీ సాయిబాబాను విమర్శించే వారికి ఈ వ్యాసము ఒకసారి పంపండి.*



ఇప్పటికన్నా ఆచార వ్యవహారములు పటిష్టంగా ఉన్న ఒక శతాబ్దం క్రితమే అనగా శ్రీసాయిబాబా
భౌతికంగాకంగా ఉన్నప్పుడు ఆయనను సేవించినవారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులే. శ్రీసాయిసచ్చరిత్ర రచించిన హేమాద్రిపంత్, సాయిచరిత్రను తన హరికథల ద్వారా గానం చేసిన దాసగణు మహారాజ్, సాయి నివాసాన్ని రాజదర్బారులా అలంకరించి, పూజలు, హారతులు ప్రారంభించిన రాధాకృష్ణమాయి బ్రాహ్మణులే.అంతేకాదు వీరందరికీ మొట్టమొదట సాయిని పరిచయం చేసిన నానాసాహెబ్ చందోర్కర్ కూడా సద్బ్రాహ్మణ వంశంలో జన్మించి, భగవద్గీతకు మూడు రకాల భాష్యాలను చదువుకున్నవాడు. అంతే కాదు ఆరోజులలోనే డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉన్నత పదవిని అలంకరించినవాడు. ఇకపోతే సాయితో అతి సన్నిహితంగా మెలిగిన శ్యామ, బొంబాయి, నాసిక్ లలో ప్రసిద్ధి చెందిన న్యాయవాదులయిన దీక్షిత్ మరియు ధూమల్, ఇంకా అనేకమంది సాయిని సేవించిన వారిలో ఎక్కువమంది బ్రాహ్మణులే ఉన్నారు. నిష్టాచార పరాయణుడు, అనేక కఠిన సాధనలు అనుష్ఠించి, చివరకు ఒక గొప్ప మహనీయుని సూచనమేరకు షిరిడీ వచ్చి సాయిని ఆశ్రయించిన ఉపాసనీ బాబా బ్రాహ్మణుడే. సాయికి పేరు పెట్టిన మహల్సాపతి విశ్వబ్రాహ్మణుడు.నిజంగా సాయి గనుక ముస్లిం ఫకీరే అయితే ఈ వ్యాస ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఇప్పటికన్నా ఆచార వ్యవహారాలు పటిష్టంగా ఉన్న ఆరోజులలోనే సనాతన హైందవ ధర్మంలో జన్మించడమే కాకుండా, ఉన్నత విద్యను అభ్యసించిన వారు, ఉన్నత పదవులలో ఉన్నవారు, సాధకులైన ఎందరో సాయిని సేవించేవారా? కనుక ముస్లింల బారి నుండి హిందువులను రక్షించడం కోసమే ఆయన ఆ వేషధారణలో కనిపించారని భావించాలి. అంతేకాదు సాయి నగ్నంగా స్నానం చేస్తున్నప్పుడు చూసిన ఒక భక్తుడు ఆయన సుంతీ చేయించుకోలేదని స్వయంగా చెప్పాడు. మరొక విషయం ఏమిటంటే ఆయన చెవితమ్మెలకు రంధ్రాలు ఉండేవి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటే ఆయన హిందువో ముస్లిమో తేల్చుకోవచ్చు. ఇకపోతే కొంతమంది సాయిబాబా హిందూ ఆచారాలను పాటించారా? అని అడుగుతున్నారు. ఆయన నివాసం పేరు ద్వారకామాయి.అందులో ఆయన ఈశాన్యం మూల కూర్చొని, ఆగ్నేయం మూల అగ్నిహోత్రం వెలిగించేవారు. గుమ్మానికి ఎదురుగా తులసి బృందావనం స్థాపించారు. ప్రతిరోజు సాయింత్రం దీపాలు వెలిగించేవారు. శ్రీరామ నవమి ఉత్సవం వైభవంగా జరిపేవారు.మహా సమాధికి ముందు "శ్రీరామ విజయం" అనే గ్రంథాన్ని మూడుసార్లు చదివించుకుని విన్నారు. ఇవన్నీ హిందూ సంప్రదాయం కాదంటారా? అంతేకాదు ఆయన ఎవరినీ ముస్లిములుగా మార్చలేదు. తనకు తానుగా ముస్లిం మతాన్ని స్వీకరించిన ఒకహిందూ యువకుడిని చెంపదెబ్బ కొట్టి, నీ అబ్బను మార్చు కుంటావా? అని ప్రశ్నించారు?.సాయి బాబా భౌతిక దేహాన్ని విడిచి పెట్టిన తరువాత దక్షిణ భారతావనిలోని మద్రాస్ నుండి షిరిడి వెళ్లి శ్రీసాయి సమాధి దర్శనంతో ప్రభావితులై సాయి చరిత్రను ఆంగ్లంలో రచించి ప్రపంచానికి అందించిన బి.వి నరసింహ స్వామిఎవరో చూడండి, ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించి,ఐఏఎస్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించారు, అలానే వారి అన్నగారైన కులపతి మాస్టర్ Ekగారు, ఎక్కిరాల వేదవ్యాస్ గారిలాంటి గొప్పవారు సాయిని మహనీయుడుగా ఎందుకు కీర్తించారు ? అంతదాకా ఎందుకు కాకినాడ శ్రీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామివారు, ప్రసిద్ధి చెందిన ప్రవచనకర్తలైన చాగంటివారు, గరికిపాటివారు సాయిబాబాను ఎప్పుడైనా వ్యతిరేకించడం,విమర్శించడం జరిగిందా?సాయిబాబాను గురించి పురాణాలలో లేకపోవచ్చు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నిజమైన జ్ఞానికి-నాకు భేదంలేదని చెప్పాడు కదా? అయినా పురాణాలలోలేని ఎందరో దేవీ దేవతలను మనమిప్పుడు పూజించడం లేదంటారా? సమ్మక్క-సారక్క గురించి ఏ పురాణంలో ఉంది? గుబ్బల మంగమ్మ పుంతలో ముసలమ్మల గురించి ఏ పురాణాలు వర్ణించాయి? పోనీ భగవాన్ రమణులు, శ్రీరామకృష్ణులు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి గురించయినా మన పురాణాలలో ఉన్నాయా? కాకపోతే వారంతా హిందూ రూపంలో ఉండడం వలన అభ్యంతరం లేదు.. అంతే కదా? రూపమే అభ్యంతరమైతే మత్స్య, కూర్మ ,వరాహాది రూపాలలో కూడా భగవంతుడు ఎందుకు వచ్చాడు?ఒకవేళ సాయి భక్తులలో ఏవైనా లోపాలు ఉంటే సరి చేసుకోమని చెప్పడంలో ఎంతమాత్రం తప్పులేదు. అంతేకానీ సాయినే విమర్శించడం సరికాదు. ఒకవేళ అలా విమర్శించే వారిలో ఎవరైనా పై వ్యాసంలో పేర్కొన్న వాళ్ళందరి కన్నా గొప్పవాళ్ళా?పోనీ సాయి భక్తులంతా ముస్లిం మతం స్వీకరించి హైందవేతర కార్యక్రమాలు చేస్తుంటే బాధపడాలిగానీ వాళ్లంతా శుభ్రంగా హైందవ ఆచారాలే పాటిస్తుంటే ఇక బాధ పడడం దేనికి? అయితే సాయి పాదాల దగ్గర ఇతర దేవతామూర్తులను, యంత్రాలను, శివలింగాలను పెట్టడం మాత్రం చాలాచాలా తప్పు. ఇలాంటి లోపాలను మాత్రం సాయి భక్తులు వెంటనే సరి చేసుకోవాలి. విద్యా,వైద్య, ఆర్థిక, రాజకీయ  రంగాలలో లోపాలు ఉన్నాయని ఆ రంగాలే లేకుండా చేయాలంటే కుదరదు కదా? వాటిలోని లోపాలను మాత్రం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే సాయి భక్తులు ఏవైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దుకోమని చెప్పాలికానీ సాయినే విమర్శించకూడదు. భారతదేశమంతటా కాలినడకతో సంచరించి 24 చాతుర్మాస్య వ్రతాలు అనుష్టించి,అలనాటి శృంగేరి జగద్గురువుల చేత "అయం హి  సాక్షాత్ భగవాన్ దత్తాత్రేయః స్వయం యతిః" అని కీర్తింపబడిన పరమహంస పరివ్రాజకాచార్యులు, అతి నిష్ఠా గరిష్టులు అయిన శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కూడా సాయిబాబాను కీర్తించి, బాబాకు నమస్కారములు మరియు నారికేళము పంపించారు. నేడు సాయిని ద్వేషించే వారంతా ఈ విషయాలను ఒకసారి గుర్తిస్తే బాగుంటుంది. సాయి మీద చేసే తిరుగుబాటేదో మత మార్పిడులకు పాల్పడుతున్న అన్యమతస్తుల పైన చేస్తే బాగుంటుంది.. సాయి భక్తుల చేత విష్ణుసహస్రనామము, భావార్ధ రామాయణము,ఏకనాథ భాగవతము,దాసబోధలు  చదివించారుగాని ఖురాన్ చదివించలేదు కదా? ముస్లిం పకీర్ లా కనిపించి, అల్లా మాలిక్ అనడం ద్వారా హిందువులను బాధించే అనేకమంది ముస్లింలు వెనకంజ వేశారు.. అయినా అల్లాహ్ అన్నప్పుడల్లా భగవంతుడు అనే అర్థమే తప్ప ముస్లింల దేవుడు అని మాత్రంకాదు!! అనేక వేల మంది చేత  కీర్తింపబడిన అవతార్ మెహర్ బాబా కూడా శ్రీసాయి బాబాను వజ్రాలలో కెల్లా గొప్ప వజ్రం కోహినూరు వజ్రం లాగా సాయిబాబా మహనీయులలో కోహినూరు వజ్రం లాంటి వారు అని కీర్తించారు కదా? ఇలాంటి విషయాలన్నీ ఒకసారి తెలుసుకోండి. ప్రసిద్ధి చెందిన పురాణ పండితులు వయోవృద్ధులు అయిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కూడా వారి ప్రవచనాలలో సాయిబాబాను దత్తావతారంగా కీర్తించారు. సాయిని విమర్శించే కుహనా మేధావులంతా వీరిలో ఎవరికన్నా గొప్పవాళ్ళు?

Tuesday, October 15, 2024

షిరిడీలో సాయినాథుని పాలరాయి విగ్రహం కాదని, సజీవ మూర్తి అని, ఉదయము బాబాకు మంగళ స్నానం చేసిన, మందిర పూజారికి కలిగిన అనుభవాన్ని తెలుసుకొందాము

*షిరిడీలో సాయినాథుని పాలరాయి విగ్రహం కాదని, సజీవ మూర్తి అని, ఉదయము బాబాకు మంగళ స్నానం చేసిన, మందిర పూజారికి కలిగిన అనుభవాన్ని తెలుసుకొందాము.*


*ప్రతిదినమూ సమాధి మందిర పూజారులు సాయినాథుని విగ్రహానికి ఉదయము మంగళస్నానం చేయిస్తుంటారు.*
*ఒక రోజు అలా బాబాకు స్నానం చేయిస్తూఉండగా, ఒక పూజారి చేతి లోంచి నీళ్లతో ఉన్న చెంబు జారి పోయి సాయిబాబా విగ్రహం మోకాలిపై పడింది.*
*ఆ ఘటనను అతడు మర్చిపోయాడు.*
*కొన్నాళ్లకు ఆ పూజారి కి మోకాళ్ళ నొప్పి మొదలైంది. మందులు, ఇంజెక్షన్లు, మాత్రలు అన్నీ వాడినా ప్రయోజనము కనిపించలేదు.*
*ఒక రాత్రీ " బాబా ! నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది ? నేను చేసే సేవలో ఏమైనా పొరపాటు జరిగిందా ?" అని సాయిబాబా ను ప్రార్దించాడు.*
*"ఓయీ ! నీవు నీ మోకాలి నొప్పి గురించి ఆలోచిస్తున్నావు. కానీ నీవు నా విగ్రహానికి ఒక రోజు చేసిన మంగళ స్నానంలో నీ చేతిలోంచి నీళ్లతో నిండిన చెంబు జారిపడి నా మోకాళ్లపై పడింది. అందువల్ల నా మోకాలికి నొప్పి కలిగింది, నీ అజాగ్రత్తవల్ల నాకు కలిగి న నొప్పి గూర్చి ఆలోచించావా ?" అని బాబా పలికారు.*
*అప్పుడు పూజారికి తాను స్నానం చేయించింది పాలరాయి విగ్రహనికి కాదు, సజీవంగా ఉన్న సాయినాథునికే అని అనుభవమైనది.*
*అందుకే  సాయినాధునికి - సాయిబాబా విగ్రహానికి గానీ ఫొటోకు గానీ తేడాలేదని ఎన్నొ అనుభవాలను భక్తులకు ప్రసాదించారు.*

*నమామీశ్వరం సద్గురుం సాయినాథం*

Sunday, October 13, 2024

షిరిడీసాయిబాబా అత్యథిక ఆరాధనా వ్యవస్థ కలిగిన మహా మహిమాన్వితుడుగా కీర్తించబడ్డాడు

*షిరిడీసాయిబాబా అత్యథిక ఆరాధనా వ్యవస్థ కలిగిన మహా మహిమాన్వితుడుగా కీర్తించబడ్డాడు.*


*ఆయన కరుణా ప్రసరణకు పగలూ రేయీ అని వైవిధ్యమే లేదు.* 

*అంటే భక్తుల జాగ్రదావస్థ (మెలకువ ) ను ఎంత* *విసృతంగా బాబా వినియోగించుకొన్నాడో, అంతే విసృతంగా భక్తుల* *స్వప్నావస్థను కూడా వినియోగించుకున్నాడు.* 

*కొన్నికొన్ని సంఘటనలలో పోలికలు కనిపిస్తాయి.*

*ఉదాహరణకు - బయ్యాజీ అప్పాకోతే పాటిలుకు తాను భీముడంటి బలవంతుడనని గర్వము.*
*అతడు అప్పుడప్పుడు సాయిబాబా కాళ్ళు మర్దన చేసి, ఎత్తుకుని ధునివద్ద కూర్చోబెట్టేవాడు. ఒక రోజు బయ్యాజీ సాయిని ఎత్తలేకపోయాడు. బాబా అతనిని చూస్తూ నావ్వాడు.*
*ఆ విధముగా సాయి అతని గర్వాన్ని అణచి వేశాడు.* 

*అటువంటిదే మరొకటి. కానీ ఫలితం వేరు.*

*1917 సం. లో ఫిరోజ్ షా అను వ్యక్తి తల్లి తండ్రులు షిర్దీయాత్ర చేసి, బాబా దర్శనం చేసుకుని, బాబా ఫోటో ఒకటి కొని తెచ్చుకొన్నారు.* 

*వారు తమ షిర్దీయాత్ర గురించి బాబా మహిమ శక్తుల గూర్చి, దివ్యత్వాన్ని గూర్చి తమ కుమారునికి తెలియపరిచారు.*

*అది విన్న ఫిరోజ్ షా తన తల్లితండ్రులు బాబాల వెంట తిరిగి సమయాన్ని, ధనాన్ని వృధాచేస్తున్నారని బాధపడ్డాడు.*
 *అతనికి సాయిబాబా అంటే మనసులో దురభిప్రాయము ఉండేది.* 

*ఒక రాత్రి ఫిరోజ్ షాకు నిద్రలో బాబా స్వప్నములో కనపడి " నా దైవ శక్తి మీద నీకు నమ్మకం కలగలా ?* 
*సరే ! నీ తల్లితండ్రులు షిరిడీ నుండి తెచ్చుకొన్న ఆ ఫొటొ గదిలో బల్ల మీద పెట్టారుకదా ! ఆ బల్లమీద గల ఫొటోను ఎత్తు. ఎత్తలేకపోతేనే నన్ను నమ్ము. ఎత్త కలిగితే నీకు నాయందుగల అభిప్రాయాన్ని మార్చుకోవద్దు.* 
*నేను కపటి ని అనుకో " అని బాబా పలికారు.* 

*అతడు నిద్రలేవగానే బాబా ఫోటో పెట్టిన బల్లవద్దకు వెళ్ళి, బాబా ఫొటోను ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఫోటో లేవలేదు.* *ఎత్తాడు ప్రయత్నించేకొలదీ ఫోటో బరువు పెరగసాగింది.* 
*ఫిరోజ్ కు బాబా యందు నమ్మకం కుదిరింది.*

*ఫిరోజ్ షా తన తప్పును తెలుసుకొని తనను క్షమించమని బాబా ఫొటొ ముందు నిలబడి ప్రార్దించాడు. తరువాత ఆయన బాబా భక్తుడిగా మారాడు.* 

*ఇలా బాబా భక్తుల స్వప్నాలలో కనబడి భక్తుల సంకుచిత భావాలను, దుర్గుణాలను, వ్యాధులను తొలగించేవారు.*

*అందుకే భక్తులు "సాయీ ! ఒకసారి నా కలలోకి రావయ్యా !"అని ప్రార్ధిస్తారు.*

*జై సాయినాథ*

Saturday, October 5, 2024

శ్రీ సాయిరాం త్రయస్త్రింశత్ గురు నామములు

1. షిర్డీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము.

2. ఆర్తులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించినంతనే సుఖసంపదలు పొందగలరు.
3. భౌతిక దేహానంతరము నేనప్రమత్తుడను.
4. నా భక్తులకు రక్షణంబు నా సమాధినుండియే వెలువడుచుండును.
5.నా సమాధినుండియే నా మానుష శరీరము మాటలాడును.
6.నా సమాధి నుండియే నేను సర్వ కార్యములు నిర్వహింతును
7.నన్నాశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము.
8.నాయందెవరికి దృష్టియో వారి యందు నా కటాక్షము కలదు.
9.మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను.
10.నా సహాయము గాని, నా సలహాను గాని కోరిన తక్షణమొసంగ సంసిద్ధుడను.
11. నా భక్తుల యింట లేమి యను శబ్దమే పొడచూపదు.

ఇతి శ్రీ సాయి ఏకాదశ సూత్రములు ||
ప్రతిరోజు పారాయణం చేస్తే మంచిది
ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః
ఓం సాయి నమో నమః శ్రీ సాయి నమో నమః జయ జయ సాయి నమో నమః సద్గురు సాయి నమో నమః 🙏🏻🙏🏻

శ్రీ సాయిరాం త్రయస్త్రింశత్ గురు నామములు 

1 ఓం శ్రీ సాయిరాం గురవే నమ:
అడగకనే అవసరం తీర్చు గురువు శ్రీ సాయిరాం కు నమస్కరిస్తున్నాను
2  ఓం శ్రీ సాయిరాం అఖండాయ నమ:
సంపూర్ణుడు, అనితర సాధ్యుడు గురువు శ్రీ సాయిరాం కు నమస్కరిస్తున్నాను
3  ఓం శ్రీ సాయిరాం ఇష్ట దైవాయ నమ:
ఇష్టమైన దేవుడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
4  ఓం శ్రీ సాయిరాం ఉదారాయ నమ:
గొప్పవాడు,మనోజ్ఞుడు గురువు శ్తీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
5 ఓం శ్రీ సాయిరాం బుుషీశ్వరాయ  నమ:
సర్వం తెలిసినవాడు. దుష్టశక్తులు దూరం చేసి జ్ఞానం ప్రసాదించు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
6 ఓం శ్రీ సాయిరాం ఎలయునే నమ:
సర్వం హ్యపించి తన చెంతకు చేరు వారిని కాపాడు గురువు శ్రీ సాయి రాంకు నమస్కరిస్తున్నాను 
7  ఓం శ్రీ సాయిరాం ఒజ్జనే నమ:
తల్లిదండ్రుల తర్వాతి స్థానము పొందిన గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
8 ఓం శ్రీ సాయిరాం ఖట్వాంగధరాయ నమ:
విశ్వంలోని ప్రజలందరి చర్యకు సాక్షులుగా ఉండే సర్వోన్నత సర్వజ్ఞుడు సూర్య దేవుడు గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
9 ఓం శ్రీ సాయిరాం కర్మసాక్షినే నమ:
భౌతిక మరణ భయాన్నితొలగించేందుకు సహాయపడువాడు. శక్తి , వివేకం, సామర్థ్యం, మనసున నియంత్రించి సరైన దిశలో నడిపించి వాడు గురువు
శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను.
10 ఓం శ్రీ సాయిరాం గణక కర్మయోగినే నమ:
కర్మలను గణించి చెడు కర్మలకు పరిష్కారము తెలుపు యోగి గురువు
శ్రీ సాయిరాంకు నమష్కరిస్తున్నాను
11 ఓం శ్రీ సాయిరాం చరాచరమునే నమ:
సకల చరాచర సృష్టికీ కారణం సత్యరూపుడైన బ్రహ్మ . ఆ సృష్టి పరబ్రహ్మ కంటే వేరని అనడం అజ్ఞానం.  ప్రపంచమే పరబ్రహ్మం కాజాలదు. దీని వెనక ఉన్న పరబ్రహ్మమే అద్వితీయుడు, శాశ్వతుడు గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
12 ఓం శ్రీ సాయిరాం జగచ్చక్షువునే నమ:
జగతిని వీక్షించువాడు, ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు గురువు
శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
13 ఓం శ్రీ సాయిరాం జ్ఞానసాగరాయ నమ:
అనేక జన్మల అదృష్టాన్ని ఎలా సంపాదించుకోవచ్చో మరియు సృష్టి చక్రం అంతా సంతోషంగా ఎలా ఉండవచ్చో నేర్పు సముద్రమంత జ్ఞాని గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
14 ఓం శ్రీ సాయిరాం తత్త్వజ్ఞానాయ నమ:
ఆత్మనియంత్రణ  మరియు ఆత్మ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి శాంతిమార్గం ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రేరేపించు తత్త్వ జ్ఞాని గురువు శ్రీ సాయిరాంకు నమస్మరిస్తున్నాను
15 ఓం శ్రీ సాయిరాం ధర్మరక్షకాయ నమ:
అడ్డంకులను తొలగించి భక్తుల ఆధ్యాత్మిక కోరికలను నెరవేర్చు ధర్మరక్షకుడు గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
16 ఓం శ్రీ సాయిరాం నరదేవాయ నమ:
భక్తులనుద్ధరించను భగవంతుడే మానవరూపంలో వచ్చిన గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
17 ఓం శ్రీసాయిరాం పరహితార్థ వ్యాపృతాయ నమ:
స్వలాభము విడిచి ఎల్లపుడు యితరుల మేలు తలుచు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
18 ఓం శ్రీసాయిరాం ఫణితినే నమ:
భక్తులందరి వాక్కు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
19 ఓం శ్రీసాయిరాం బృహతాయ నమ:
పూర్తి విశ్వాసంతో తమ వ్యవహారములో నిజాయితిగా మరియు న్యాయంగా ఉంటూ యితరలకు సహాపడుతూ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొను గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
20 ఓం శ్రీసాయిరాం బ్రహ్మచారినే నమ:
ఒక గురువు నుండి నేర్చుకునే ప్రయోజనాల కోసం, ఆధ్యాత్మిక విముక్తి సాధించే ప్రయోజనాల కోసం జీవిత తరువాతి దశలలో పవిత్రతను సూచిస్తు బ్రహ్మమును ఆచరించువాడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
21 ఓం శ్రీసాయిరాం భసితాయ నమ:
ఈ విభూతి నా గురువని నా సమస్త భారములు వహించమని వేడుతూ నమస్కరిస్తున్నాను.
22 ఓం శ్రీ సాయిరాం ఆరోగ్య ప్రధాతనే నమ: 
ప్రార్థించిన వెంటనే ఆరోగ్యము ప్రసాదించు గురువు శ్రీ సాయిరాంకు నమస్కరిస్తున్నాను
23 ఓం శ్రీసాయిరాం మహాశయాయ నమ:
యోగులలో విలక్షణమైన విశాల మనస్తత్వం,గొప్ప అభిప్రాయం కలిగి ఆశ్రమ జీవితం గడుపు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
24 ఓం శ్రీసాయిరాం ముక్తిచతుష్టయాయ నమ:
సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్య ముక్తులను తాదాత్మ్య ఉపాసన, అభిన్న భావన వలన పొందిన గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
25 ఓం శ్రీ సాయిరాం సర్వగ్రహవినాశినే నమ:
సర్వ గ్రహాల నుంచి జరుగు కీడును నివారించు గురువు శ్రీ సాయి రాంకు నమస్కరిస్తున్నాను
26  ఓం శ్రీసాయిరాం యోగ బ్రహ్మనే నమ:
యోగసాధనతో తప్పు చేస్తున్న మానవాళిని సహ-భావన, భగవంతుని-సాక్షాత్కారం వైపు నడిపించి దాని యొక్క ఆనందాన్ని యిచ్చు బ్రహ్మ గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
27 ఓం శ్రీసాయిరాం యతీంద్రాయ నమ:
సర్వసంగ పరిత్యాగి,ఇంద్రియాలను జయించినవాడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
28 ఓం శ్రీసాయిరాం యోగాయ నమ:
మానావమాన,శీతోష్ణ,సుఖదుఃఖములందు సమానముగా ఉంటూ, మట్టీని,రాతిని,బంగారాన్ని ఒకేలా చూస్తూ శత్రువులయందు, మిత్రులయందు, బంధువులు, సాధువులు, దుర్మార్గుల యందు సమబుద్ధికలిగి కర్మఫలాన్ని కోరకుండా చేయవలసిన కర్మలను చేయు నిజమైన సన్యాసి యోగి శ్రేష్ఠుడు గురువు శ్రీసాయిరాం గురువును నమస్కరిస్తున్నాను.
29 ఓం శ్రీ సాయిరాం ధన్వంతరాయ నమ:
మనస్సు, శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించు వైద్యుడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
30 ఓం శ్రీసాయిరాం వ్యోమకేశవా నమ:
అంతరిక్షాన్ని కేశాలుగా కలిగిన వాడు.అంతం లేనిది అనంతం. ఆద్యంతాలు లేనివాడు పరమాత్మ ఒక్కడే. సృష్టి, స్థితి, లయములను శాసించే పరమశివుడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను.
31 ఓం శ్రీసాయిరాం నిష్కళంకాయ నమ:
నిరహంకారి,ఎటువంటి దోషము లేదా పాపము లేని వాడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
32 ఓం శ్రీసాయిరాం విశ్వరూపాయ నమ:
భగవంతుని రూపమే విశ్వము. ఆయన లేనిదే ఈ విశ్వమే లేదు. కనిపిస్తున్న చరాచర విశ్వమంతా తన రూపంగా కలవాడు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను
33 ఓం శ్రీసాయిరాం హృద్యాయ నమ:
ఓం శ్రీసాయిరాం హృద్యాయ నమ: హృదయమునకు ఆనందము కలిగించు గురువు శ్రీసాయిరాంకు నమస్కరిస్తున్నాను

ఓం శాంతి: శాంతి: శాంతి:

Monday, September 9, 2024

*ఓంకార రూప సాయి* *వేదాలకు మూలమైన ప్రణవ స్వరూపంగా దివ్య దర్శనం ఇస్తున్న అపురూప సాయి తైలవర్ణ చిత్ర పటం.*

*ఓంకార రూప సాయి*


*వేదాలకు మూలమైన ప్రణవ స్వరూపంగా దివ్య దర్శనం ఇస్తున్న అపురూప సాయి తైలవర్ణ చిత్ర పటం.*

*పూర్వం ఈ తైలవర్ణ చిత్ర పటం చావడిలో స్త్రీలు ప్రవేశించే ఉత్తర గోడనానుకొని, ద్వారం ముందు భాగంలో వుండేది.*

*మన సాయి చావడిలో నిద్రించే రోజున శేజ్ ఆరతి, మరురోజు కాకడ ఆరతి ఈ పటం వున్న స్థానంలో కూర్చునేవారు.*

*ఈ ప్రణవ సాయి చిత్రాన్ని  నౌసారి ( నవసరి ) గ్రామానికి చెందిన అంబారామ్ లాల్ భాయ్ కహర్ అనే 18 సంవత్సరాల యువకుడు 1953 చిత్రించాడు.*

*సాయి ప్రసాదించిన అద్భుతమైన స్వప్న సాక్షాత్కార ఫలితంగా అతడు అంత చక్కటి పటం చిత్రీకరణ చేయగలిగాడు.*

*అంబారామ్ ఈ చిత్రపటాన్ని నౌసారిలో వున్న అవతార్ మెహర్ బాబా కేంద్రం కు ఇచ్చారు.*

*ఈ అత్యద్భుతమైన పటాన్ని చూసి, బాబా లీలకు ముగ్ధులైన నౌసారి గ్రామస్తులు,  చెందారు వసూలు చేసి,  6 అడుగుల 4 అంగుళాల పటానికి అందమైన ఫ్రేము కట్టించి, శిరిడిలో వుంటే బాగుంటుంది అని రెండు రోజులు అఖండ సాయి నామ జపం, పూజలు నిర్వహించి, పెద్ద ఉత్సవంగా షిరిడీకి ఫిబ్రవరి 1953లో  తీసుకుని వచ్చి సాయి సంస్థానానికి సమర్పించారు.*

*సంస్థానం వారు ఈ అరుదైన చిత్రపటాన్ని సమాధిపై, సమాధి మందిరంలో వుంచాలి అని అనుకున్నారు.*
*అప్పటికే సాయి మూర్తి ( విగ్రహం ) చెక్కించే పనులు చురుకుగా సాగుతున్న కారణంగా, చిత్రపటాన్ని చావడిలో ఉంచారు.*

*ఈ చిత్రంలో కుడివైపు ఆంగ్లంలో చిత్రకారుడు అంబారామ్ పేరు వుంటుంది.*

*ప్రస్తుతం ఈ చిత్ర పటం సాయి పారాయణ హాలులో వుంది*

Sunday, September 1, 2024

శ్రావణ కృష్ణ అమావాస్య* *మహారాష్ట్రలో, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో " పోలాల అమావాస్య " అంటారు.*

 శ్రావణ కృష్ణ అమావాస్య*

*మహారాష్ట్రలో, ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో " పోలాల అమావాస్య " అంటారు.*

*ఉత్తర భారతదేశంలో* 
*" హరియాలి అమావాస్య " అంటారు*

*కొద్ది రాష్ట్రలలో వారి సాంస్కృతిక, సాంప్రదాయం ప్రకారం ఈ రోజు పండుగగా జరుపుకుంటారు.*

*శిరిడీలో, మహారాష్ట్రలో* 

*" పోలాల అమావాస్య "ఎంతో వైభవంగా జరుపుకునే విషయం మనకు తెలిసిందే.*

*మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకుందాం*

*మహారాష్ట్రీయులు ఈ రోజు తమ  పాడి పంటలు వృద్ధి కోసం శ్రమ పడిన పశు సంపదకు కృతజ్ఞతగా పూర్వకంగా పూజలు నిర్వహిస్తారు.*
*వాటికి అభ్యంగనస్నానం, వివిధ రకాల అలంకరణలు చేసి, పూజలు చేస్తారు.* 

*పిండి వంటలతో షడ్రసోపేతమైన విందు భోజనం ఆరగింపు చేయిస్తారు*  

*సమాధి మందిరంలో, మధ్యాహ్న ఆరతికి ముందు సాయి మూర్తికి ( విగ్రహానికి ) ఇరువైపులా మట్టితో చేసిన రంగు రంగుల 5 ఎద్దులు, 1 ఆవు, దూడల ప్రతిమలను ఉంచుతారు.*
*వాటికి  గంధం, పుష్పాలతో పూజ చేసి నైవేద్యంగా వరి అన్నం, పూర్ణ పోళీలు సమర్పిస్తారు.*

*శిరిడిలో సాయంత్రం అలంకరించిన తమ పశు సంపదను గేట్ నెంబర్ 4 ద్వారా తీసుకుని వచ్చి సమాధి మందిరం కిటికీ దగ్గర నిలబెట్టి సర్వజీవ కారుణ్యమూర్తి సాయిని దర్శింప చేస్తారు.*

*( ప్రస్తుత కారణాల వలన ఈ రోజు పశు సంపదకు దర్శన ఏర్పాటు గురించి సమాచారం లేదు )*

*నిమ్నోకర్ భార్య, బేలాపూర్ ప్రయాణం కథ మనం సాయి సచ్చరిత్రలో పారాయణ చేసినదే.*

*నిమ్నోంకర్ ఆమెను రెండవ రోజే తిరిగి రావాలని ఆదేశించారు. ఆ రోజు అమావాస్య, అమావాస్య ప్రయాణానికి శుభసూచకం కాదని ఆమె సంశయిస్తుంది.*
*అది కాకుండా తన పిల్లలు, బంధువులతో " పోలాల అమావాస్య " రోజు గడపాలి అని మనసులోనే కోరుకుంటుంది.*

*సర్వాంతర్యామి సాయి ఆమె మనస్సు లోని కోరికకు అనుగుణంగా, బేలాపూర్ వెళ్లి నాలుగు రోజుల తరువాత తిరిగి షిర్డి రమ్మంటారు.*

సేకరణ, సమర్పణ

*చిల్లర కృష్ణమూర్తి*
06-09-2021

Thursday, August 22, 2024

పరమహంస పరివ్రాజక, అపర దత్తస్వరూపులైన శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి ( టెంబె ) స్వామి వారి 170 వ జన్మదినం *

*పరమహంస పరివ్రాజక, అపర దత్తస్వరూపులైన శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి ( టెంబె ) స్వామి వారి 170 వ జన్మదినం *
*( 13 -8 -1854 )*


*సాయిసచ్చరిత్ర చివరి అధ్యాయములలో టెంబె స్వామి ప్రస్తావన కనిపిస్తుంది.*
*వాసుదేవానంద సరస్వతి స్వామివారు సాయిబాబాకి సమకాలికుడు.*
*స్వామివారు తమ 18 వ చతుర్మాస దీక్షలో భాగముగా రాజమహేంద్రవర పట్టణాన్ని 1909 సం. ఫిబ్రవరి నెలలో దర్శించడం జరిగింది.*
*అక్కడే పుండలీకరావు గా పేర్కొనబడిన దాసగణు మహరాజ్ స్వామివారిని కలవడం జరిగింది.* 

*పరమనిష్టాగరిష్ఠుడైన స్వాములవారు తమ ఆచారాన్ని ఉల్లఘించి సాయిబాబాకు పాదాభివందనం చేసి ఒక నారికేళమును బాబాకు సమర్పించమని దాసగణు మహరాజ్ కు అదేశించారు.*

*అయన రాజమండ్రి నుండి కొబ్బరి కాయని పంపడమే మహాకార్యం కాదు, అదే సంవత్సరములో పిఠాపురం దర్శించి, అక్కడ ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుఁడు తెలుగువారని, ఆయన జన్మస్ధలం పిఠాపురమని తెలిపి అక్కడ దత్త పాదుకలు ప్రతిష్టించారు.*

*వాసుదేవానంద సరస్వతీ స్వాములవారు తెలుగునాట దత్త సంప్రదాయాన్ని పునరుద్ధించారు* *"వ్యాసోచ్ఛిష్ఠం జగత్సర్వము" అని అంటారు.* *దత్తాత్రేయులవారి సాహిత్యం వాసుదేవానందులవారి ఉచ్ఛిష్ఠం అన్నా తప్పు కాదనీ అనిపిస్తుంది.* 
*కొంకణ్ ప్రాంతములో గల సావంతవాడి సమీపములో మాన్గావ్ గ్రామములో 13 ఆగష్టు 1854 న వాసుదేవానందులు జన్మించారు.*

*దత్తాత్రేయ స్వామి అయనకు స్వప్నములో మంత్రోపదేశం ఇచ్చారు.*
*ఆయన తన వద్దగల దత్త విగ్రహం ( అది సాక్షాత్తూ దత్తాత్రేయ ప్రభువే ) ఆయనతో స్వయంగా, సన్నిహితంగా సంభాషించేవారు.*

*స్వాములవారు ఆ దత్తస్వామిని పూజించేవారు. ఈవిధమైన సన్నిహిత సంబంధం అపూర్వమైన విషయము.*

*సన్యాసులు ఇతరులకు నమస్కరించడం గానీ, విగ్రహాలను పూజించడం కానీ చేయరు.*
*దత్త మూర్తిని ఆరాధించడంలోను, సాయిబాబాకు నమస్కరించడంలోనూ తన అచారాన్ని పాటించలేదు.*

*దత్తుని అరాధనను విశేషంగా మహరాష్ట్రలో తిరిగి ప్రవేశపెట్టారు. ఆయన శ్రీగురుచరిత్రను, గురుసంహిత అనే గ్రంథాలను సంస్కృతంలో వ్రాశారు. ఇంకా దత్తపరమైన స్తోత్రాలు, గ్రంథాలు అనేకమైనవి సంస్కృతంలో రచించారు.*

*స్వాములవారు శృంగేరిని దర్శించినప్పుడు అలనాటి శృంగేరి శంకర పీఠం అధిపతి అయిన శ్రీ సచ్చిదానంద శివాభి నవ నృశింహ భారతీ స్వాములవారిచే (1879 -1912 ) "అయంహీ భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయ స్వయం యతిః " ( ఈ యతి సాక్షాత్తూ దత్తాత్రేయుడే ) అని కీర్తించబడిన వాసుదేవానంద సరస్వతి స్వాముల స్మరణ చేసి  దత్తాత్రేయుని అనుగ్రహ ఆశీస్సులు పొందుదాం.*

*పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, తిథి ప్రకారం శ్రావణ బహుళ పంచమినాడు అనఁగా ఆంగ్ల కాలమానం ప్రకారం 13 -8 -1854 తేదీ నాడు జన్మించారు.*

*నేడు అనగా 23- 08 -2023 శుక్రవారం, శ్రావణ బహుళ పంచమి, వాసుదేవానంద సరస్వతి స్వామి వారి 170 వ జయంతి.*

*దిగంబరా ! దిగంబరా ! శ్రీపాద వల్లభ దిగంబరా !*

*దిగంబరా ! దిగంబరా !*
*దత్తాత్రేయ దిగంబరా*
*దిగంబరా ! దిగంబరా !*
*అవధూత చింతన దిగంబరా!*

Wednesday, August 21, 2024

కామాక్షి అమ్మవారి ఆలయంలో కామాక్షి అమ్మవారు 5 రూపాలలో ఉంటారు..

కామాక్షి అమ్మవారి ఆలయంలో కామాక్షి అమ్మవారు 5 రూపాలలో ఉంటారు..


1. మూల విరాట్టు అయిన కామాక్షి 
2. ⁠అటు పక్కనే ఉన్న తపో కామాక్షి
3. ⁠ప్రధానాలయం వెనక వైపున ఉన్న విమాన కామాక్షి
4. ⁠లక్ష్మి దేవి, సరస్వతి దేవీలను కుడి వైపు, ఎడమ వైపు పెట్టుకొని మధ్యలో ఉంటారు ఉత్సవ కామాక్షి..
5. ⁠స్వర్ణ కామాక్షి..

ప్రస్తుతం ఈ స్వర్ణ కామాక్షి తంజావూరు లో ఉన్నారు... ఎందుకు అక్కడికి వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాము....

ఒకప్పుడు ముస్లింల దండయాత్ర భారీ నుండి కాపాడడానికి... ఈ ఆలయంలో ఉన్న అర్చకులు ఆ స్వర్ణ మయంతో చేసిన కామాక్షి విగ్రహాన్ని కాంచీపురం నుండి తంజావూరు తీసుకెళ్లి దాచారు... కొంత కాలం తర్వాత అమ్మవారు అక్కడే ఉండడానికి కొన్ని సంకేతాలు ఇచ్చారు.. అలా స్వర్ణ కామాక్షి తంజావూరులో కొలువయ్యారు..

అయితే కాంచీపురంలో స్వర్ణ కామాక్షి ఉన్న స్థలం ఖాళీగా ఉంచకూడదు అన్న భావన చేసి.. అక్కడ అమ్మవారీ యొక్క స్వర్ణ పాదుకలు పెట్టారు... 

మనం కేవలం తంజావూరులో మాత్రం స్వర్ణ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము...

తంజావూరులో కొలువైన బృహదీశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకున్నాక.. ఈ స్వర్ణ కామాక్షి ఆలయానికి వెళ్తారు...

సాధారణంగా కామాక్షి అమ్మవారు కూర్చున్న భంగిమలో ఉంటారు.. ఇక్కడ తంజావూరులో నిల్చొని ఉన్న భంగిమలో దర్శనం ఇస్తారు స్వర్ణ కామాక్షి అమ్మవారు...
అరుణాచలశివ 🌹

Monday, August 19, 2024

*షిరిడీలో పాదుకా ప్రతిష్టాపన*

*షిరిడీలో పాదుకా ప్రతిష్టాపన*  


*నేడు మనము షిర్డీ దర్శించునప్పుడు సమాధి మందిరం, ద్వారకా మాయి, గురుస్థాన్ మున్నగు ప్రదేశాలు దర్శించునప్పుడు* *ఆయా ప్రదేశాలలో బాబా వారి పాదుకలు దర్శించుకోవచ్చు.* 

*మొదటిసారిగా 1912 సం. శ్రావణ పూర్ణిమ నాడు అత్యంత భక్తి శ్రద్దలతో, వైభవపేతంగా, షిరిడీలో బాబా అశీసులతో, ఖండోబా మందిరం నందున్న ఉపాసనీ మహరాజ్ ఆదేశాలతో, సూచనలతో గురుస్థాన్ నందు గల వేపచెట్టు క్రింద పాలరాతి పాదుకలు పాదుకలు ప్రతిష్టించబడినవి.* 

*ఆ పాదుకలు వృత్తాంతం - బాంబాయి నగరము నందున్న రామారావు కొఠారీ అను డాక్టరు గారి వద్ద పనిచేసే అయన కాంపౌండర్, అతని స్నేహితుడైన భాయి కృష్ణాజీ అలీబాగ్ కర్ చేసిన ప్రయత్నముతో ఈ పాదుకలు గురుస్థాన్ నందు‌ ప్రతిష్టింపబడినవి.* 
*భాయి కృష్ణాజి అలీబాగ్ కర్ మొదట అక్కల్కోట మహరాజ్ భక్తుడు.*
 *అతను అక్కల్కోట వెళ్ళి అక్కల్కోట మహరాజు పాదుకలు, చిత్రపటమును పూజించవలెనని సంకల్పించెను.* 
*అతను బయలుదేరుటకు మునుపే అక్కల్కోట మహరాజ్ స్వప్న దర్శనమిచ్చి, షిర్డి గ్రామము తన నివాసమని, అక్కడ ఉన్న సాయి మహరాజ్ తాను వేరు కాదనీ, అక్కడకి పోయి పూజ చేసుకోమని ఆదేశించగా, అలీబాగ్ కర్, అతని మిత్రుడైన  డాక్టర్ కొఠారి  కాంపౌండర్ ఇద్దరు కలసి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నారు.*

*వారు షిరిడీలో నున్నపుడు అక్కడగల బాబా భక్తులయిన సగుణ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షిత్ అను వారి పరిచయము చేసుకుని బాబా షిరిడీలో వేపచెట్టు క్రింద తపస్సు చేసినందుకు గురుతుగా బాబా పాదుకలు ప్రతిష్టాపన చేయవలెనని నిశ్చయించుకొనిరి.*

*మొదట వారు రాతితో చేసిన పాదుకలు ప్రతిష్టించవలెనని అనుకొనిరి.* 
*కానీ ఈ విషయము డాక్టరు రామారావు కొఠారి కు తెలుపగా, ఆయన* 
*సంతోషముగా షిరిడీకి వచ్చి నమూనా పాదుకలు* *చిత్రమును ఖండోబా మందిరం నందున్న ఉపాసనీ మహరాజ్ గారికి చూపగా, ఉపాసని మహరాజ్* *పాదుకల యందు పద్మము, శంఖము, చక్రము మున్నగున్నవి చేర్చి, బాబా యోగ శక్తి  మరియు వేపచెట్టు గొప్పదనాన్ని తెలిపే తాను రచించిన " సాయినాథ మహిమా స్తోత్రము " లోని నాలుగు అయిదు శ్లోకాలను పాదుకలు ప్రతిష్ట చేసే పీఠము నందు చెక్కించమని సలహా ఇవ్వగా, ఉపాసనీ బాబా సూచించిన విధంగా డాక్టరు రామరావు కొఠారి కృషితో  బాబా వారి పాలరాతి పాదుకలు తయారు చేయబడి బొంబాయి నుండి షిరిడీకి రాగనే బాబా వాటిని సృజించి " అవి భగవంతుని పాదుకలు." అని సూచించారు. గురుస్థాన్ నందు ప్రతిష్టించవలెనని ఆదేశించగా, పాదుకలను దాదాకేల్కరు,  ఉపాసనీ* *మహరాజ్ మున్నగు భక్తులు వెంటరాగా గోవింద కమలాకర దీక్షిత్ అను భక్తుడు ఆ పాదుకలు శిరస్సున పెట్టుకుని ఖండోబా మందిరం నుండి* *గురుస్థానము వచ్చి ఆ వేపచెట్టు మూలమున పాదుకలు శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం 11 గంటలకు ప్రతిష్టంపబడినవి.( 27 -8 -1912 శ్రావణపౌర్ణమి)*

 *" సదా నింబవృక్షస్య ములాధివాసత్ ....*
*నమామీశ్వరం సద్గురుం సాయినాథం.*

*నేడు అనగా 19 -8 -2024 సోమవారం శ్రావణపౌర్ణమి.* 

*నేటికి షిరిడీలో, గురుస్థానం లో పాదుకా ప్రతిష్ట జరిగి 112 ఏళ్లు సమాప్తి అగును.* 

*సాయి సచ్చరిత్ర (ప్రత్తి నారాయణరావు గారి గ్రంథములో అయిదవ అధ్యాయములో ఈ విషయము ప్రస్తావించబడినది.*

👣👣👣👣👣👣👣👣👣👣

Friday, August 9, 2024

జ్యోతిష్కుడు శ్రీ సాయిబాబా (సాయి బాబా చేత పవిత్రం చేయబడినది.) నుండి వచ్చిన అటువంటి ప్రసాదం అతన్ని చాలా నైపుణ్యం కలిగిన జ్యోతిష్కుడిగా మారుస్తుందని, అందువలన అతనికి అదృష్టం చేకూరుతుందని హృదయపూర్వకంగా నమ్మాడు.


*ఒకసారి, జ్యోతిషశాస్త్రానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని సాయిబాబా చేతిలో పెట్టి మళ్ళీ బాబా వారి దగ్గర  నుండి ప్రసాదం మాదిరిగా స్వీకరించాలి అనే ఉద్దేశ్యంతో శ్రీ సాయి బాబా వారి గురించి చాలా ఉన్నత మైన గొప్ప సాధువుగా విన్న జ్యోతిష్కుడు ఒకరు షిర్డీకి వచ్చారు.  జ్యోతిష్కుడు శ్రీ సాయిబాబా (సాయి బాబా చేత పవిత్రం చేయబడినది.) నుండి వచ్చిన అటువంటి ప్రసాదం అతన్ని చాలా నైపుణ్యం కలిగిన జ్యోతిష్కుడిగా మారుస్తుందని, అందువలన అతనికి అదృష్టం చేకూరుతుందని హృదయపూర్వకంగా నమ్మాడు.  కానీ సాయి బాబా, ఈ పుస్తకాన్ని జ్యోతిష్కుడికి ఇవ్వమని కోరినప్పుడు, దానికి దగ్గరగా కూర్చున్న బాపుసాహెబ్ బుట్టి (షిర్డీలో బుట్టి వాడా నిర్మించిన ఘనత పొందిన ప్రసిద్ధ గొప్ప దనవంతుడు) కు ఇచ్చారు.  ధనవంతుడు ఇంకా ప్రాపంచిక కోరిక లేనటువంటి బాపుసాహెబ్ బుట్టి సాయి బాబా ఇచ్చిన పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు.  జ్యోతిష్కుడు నిరాశ చెందారు.  ఏదైనా చదవడానికి ఎప్పుడూ పట్టించుకోని బాపుసాహెబ్, సాయి బాబా ఈ పుస్తకాన్ని తనకు ఇచ్చినందున, ఆ తరువాత కొద్దిసేపు పుస్తకాన్ని అలా పేజీలు తిప్పుతూ దాటవేసారు.  క్రమంగా అతను పుస్తకం చదవడం ద్వారా జ్యోతిషశాస్త్రం పట్ల ఆసక్తి చూపడం ప్రారంభించారు.  కొన్ని సంవత్సరాల తరువాత, బాపుసాహెబ్ బుట్టి జ్యోతిషశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించారు. అతను సాయి భక్తులకు వారి అవసరాలకు సహాయం చేయడం ప్రారంభించారు. కొన్ని విషయాలను ఖచ్చితత్వంతో ఊహించగలిగాడు!  అతను ఎటువంటి వేతనం ఆశించకుండా ఇవన్నీ చేశారు!*

 *పైన తెలుసుకున్న సంఘటన ద్వారా శ్రీసాయి బాబా దానిని చూపించాలనుకున్నారు. జ్యోతిష్కుడు తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా జ్యోతిషశాస్త్రంలో ప్రావీణ్యం పొందడం విధి కాదని అతనికి తెలుసు;  అటువంటి ప్రసాద గ్రహీత అయిన వ్యక్తి ఏ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడో చూపించాలనుకున్నారు. (ఈ సందర్భంలో శ్రీ బాపుసాహెబ్ బుట్టి)కి మరియు సాయి బాబా తన భక్తులకు బోధించాలనుకున్నారూ, ఏదైనా కళ లేదా విజ్ఞాన శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క ప్రావీణ్యం మానవత్వానికి ఉచితమైన ప్రేమ కంటే ఉత్తమంగా ఉపయోగించినప్పుడు ఉత్తమంగా ఉపయోగించబడుతుంది.*

 *M.W.  ప్రధాన్ తన రచనలో “శ్రీ సాయి బాబా ఆఫ్ షిర్డీ: ఎ గ్లింప్స్ ఆఫ్ ఇండియన్ స్పిరిచ్యువాలిటీ*

Sunday, August 4, 2024

*షిరిడీలో సాయిబాబా సంస్థాన్ వారు, ఈ శ్రావణ మాసములోనే విశేష సంఖ్యలో భక్తులచే సామూహిక శ్రీ సాయిసచ్చరిత్ర సప్తాహ పారాయణము నిర్వహించడం జరుగుతుంది.*


*మహరాష్ట్ర, కర్ణాటక లోని కొన్ని ప్రదేశాలలో ప్రతీ సంవత్సరం శ్రావణమాసములో దైవ సన్నిధానములలో విశేషపూజలు, ప్రత్యేక సామూహిక అధ్యాత్మిక గ్రంథ పారాయణాలు మరియు వివిధ అధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం మనము చూడవచ్చు.* *షిరిడీలో సాయిబాబా సంస్థాన్ వారు, ఈ శ్రావణ మాసములోనే విశేష సంఖ్యలో భక్తులచే సామూహిక శ్రీ సాయిసచ్చరిత్ర సప్తాహ పారాయణము నిర్వహించడం జరుగుతుంది.*
*అంతేగాక ఈ శ్రావణమాసములో ప్రతీ* *సోమవారం సాయిబాబాకు ఇచ్చే ధూప్ ఆరతిలో, మొదటి హారతి పాట అయిన " ఆరతి* *సాయిబాబా, సౌఖ్య దాత రా జీవా '' అన్న గీతం తరువాత,*
*" షిర్డీ మాఝే పండరీపుర,"* *పాటకు ముందు శివ భగవానుని ఆరతి గీతం ఆలపిస్తారు.* 
*ఆ రోజు ఇచ్చే ధూప్ ఆరతికి ఒక ప్రత్యేకత ఉన్నది.*
*బాబా వారికి ఒక వత్తుతో హారతి ఇవ్వకుండా అయిదు వత్తులతో పంచ ఆరతి ఇస్తారు.*
*బాబావారి సమాధి ముందు శివుని ఫొటొ పెట్టి, బాబా వారి విగ్రహానికి, సమాధిపై మారేడు దళముల మాలలు వేస్తారు.* .
*(పూలమాలతోపాటు).*
*శ్రావణ మాసం, ప్రతి సోమవారం అన్ని ఆరతులకు సాయినాథుని వారిని శ్వేత  వస్త్రాలతో ( తెల్లని ) అలంకరిస్తారు.*

*శ్రావణమాసంలో* *సోమవారము ధూప్ ఆరతిలో ఆలపించే శివ భగవానుని ఆరతి గీతం క్రింద ఇవ్వబడినది.*


*మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా ధూప్ ఆరతిలో శివుని ఆరతి పాట పాడుతారు.*

*ఇది హారతి సాయిబాబా లో  "ఇచ్ఛిత దీనచాతక " తరువాత " శిరిడి మాఝే పండరీపుర " ముందర పాడుతారు.*


లవధవతీ విక్రాళా బ్రహ్మండీ మాళా ; విషే కంఠ కాళా త్రినేత్రి జ్వాళా 
లావణ్య సుందర మస్తకీ భాళా 
                                     తేధునియా జళ నిర్మళ వాహే ఝళ ఝాళా 
జయదేవ జయదేవ జయ శివశంకరా ,
                             స్వామిశంకరా   ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ  కర్పూరగౌరా
కర్పూరగౌరా భోళా నయనీ విశాళా, అర్దాంగీ పార్వతీ సుమనాంఛ్హా మాళా 
విభూతీచే ఉధళణ శివకంఠ నీళా ఐసా శంకర శోబే ఉమా వేల్హళా 
 జయదేవ జయదేవ జయ శివశంకరా,  
                            స్వామిశంకరా  ఆరతీ  ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా 
దేవీ ధైత్యీ సాగరమంధన పైం కేరే, త్యమాజీ అవచిత్ హోళా హళ ఉఠీలే 
తే త్యా అసురఫణే ప్రాశన్ కేలే నీలకంఠ నామ ప్రసిద్ధ  ఝాలే 
  జయదేవ జయదేవ జయశివశంకరా,
                           స్వామిశంకరా  ఆరతీ ఓవాళు భవతీ ఓవాళు తుజ కర్పూరగౌరా  
వ్యాఘ్రబర ఫణివరధర సుందర మదనారీ 
                పంచానన మనమోహన మునిజన సుఖకారీ 
శతకోటిచే బీజ వాచే ఉచ్హారీ, రఘుకులతిలక రామదాసి అంతరీ 
జయదేవ జయదేవ జయశివశంకర,
                       స్వామిశంకర ఆరతీ ఓవాళు భవతీ ఓవాళూ తుజ కర్పూరగౌరా 
                              
జయదేవ జయదేవ 
 
*మరాఠి భాషలో శివుని కిచ్చే హరతికి తెలుగులో అర్ధాన్ని, భావాన్ని సాయి* *గురుబంధువులందరికీ* 
*అందచేసే కొంత ప్రయత్నమే ఇది* 
*ఇందులో దోషాలు కనిపిస్తే మన్నించండి.*

మొదటి చరణం -లవదవతి విక్రాల ...
భావం .
*రుద్రరూపము కలిగి, తాండవ నృత్యముచేయుచు అతి భయంకర స్వరూపముతో భక్తులకు దర్శనమిచ్చుచున్నాడు.*
*హాలాహలమనే భయంకర విషాన్ని మింగుటచే*
*నీలిరంగు కంఠం కలిగినవాడైనాడు.* 
*శిరస్సు ఫాలభాగమున* *మూడవ నేత్రము కలగుటచే త్రినేత్రుడైనాడు.*  *శిరస్సున జటాజూటములచే, పావన గంగను ఆ జడలనందు కలవాడు.*
*అతి సుందరవదనము కలవాడు ఆ శివుఁడు ఆ పరమాత్మ ఉగ్రరూపము ధరించిననూ లోక కళ్యాణం కొరకు భూమండలం నాశనం కాలేదు.*
*జయము జయము శ్రీ శంకరా! కర్పూర గౌరా !*
*(కర్పూరమువలె తెల్లని ముఖచాయ కలవాఁడు )*
*నీకు హారతి సమర్పిస్తున్నాము.*

*కర్పూర గౌరా భోళా నయన విశాలా ...భావం.*

లవదవతి విక్రాల ...శివహారతి. రెండవ చరణం 
భావము.

*ధవళ వర్ణము కలిగి, మవిశాలనేత్రాలు కలిగిన* *సుందరరూపుడు, పార్వతిమాతకు తన శరీరములో అర్ధభాగమిచ్చి* *అర్ధనారీశ్వరుడైనాడు* 
*భక్తులచే సుగంధ పరిమళ* *పుష్పహారములచే ఆరాధింపబడు చున్నవాడైనడు.*  *శరీరమంతా పవిత్ర విభూతి ధారణ చేయువాడు. లీలా విలాస స్వరూపుఁడు.* *నీలి రంగు కంఠము కలిగినవాడు* 
*ఉమాదేవికి ప్రియసఖుడు* *అయిన శంకరునికి* 
*జయదేవ జయదేవ* *జయశ్రీశంకరా !* 
*ఓ కర్పూరగౌరా ! ఇవే మీకు మా హారతులు.*

మూడవ చరణం ...

*దేవతలు రాక్షసులు సాగర మధనం గావించు* *సమయమున, ఈ సృష్టి యావత్తు నాశనం చేయగల భయంకర విషపూరితమైన హాలాహలం సృష్టిలోగల సకల ప్రాణులయందు కల ప్రేమతో, సంతోషముతో తాను స్వీకరించి కాపాడెను.*
*వేరెవరూ  నీలి వర్ణం గల  ఆ హాలాహలమును మింగుటకు సాధ్యం కాలేదు. ఆ విధముగా శంకరుడు నీలికంఠుడైనాడు.*
*జయదేవ జయదేవ* 
*జయ శ్రీశంకరా ! ఓ* *కర్పూరగౌరా ! ఇవే నీకు* 
*మా హారతులు.*


నాల్గవ చరణం ...భావం.

*పులి చర్మమును ధరించినవాడు. అనేక విశేషములు కలిగిన, వాసుకి అనే సర్పమును తన* *కంఠమున  ధరించినవాడు, మన్మధ సంహారం* 
*గావించినవాడు, అయిదు* *ముఖములు కలిగి సుందరరూపముతో తనను ధ్యానించే, ముని జనులకు* *శాంతి ప్రసాదించువాడు,* *అసంఖ్యాక* 
*బీజాక్షరములతో నిండిన,* *రఘువంశంలో జన్మించిన రామా -రామదాసా అను నామమును స్మరించువాడైన శంకరుణ్ణి ఇంతకన్నా ఎంతని, ఏమని, వర్ణించగలను, ఎంతని స్తోత్రం చేయగలను ?* 
*జయదేవ జయదేవ* 
*జయ శ్రీశంకరా ! ఓ కర్పూర గౌరా ! నీకు ఇవే మా హారతులు.*

*శ్రీ సాయి సంపూర్ణ హారతుల గ్రంథం నుండి*

*చిల్లర కృష్ణమూర్తి*
*పెండ్యాల శ్రీనివాస్*
*పాశిల అప్పారావు*

Sunday, July 28, 2024

బాబా అంకిత భక్తుడైన వామనరావు పటేల్ ( సాయి శరణానంద ) ఒక అంధుడు ద్వారకామాయిలో కూర్చుని " రామకృష్ణ హరి, జై జై పాండురంగ హరి " భజనలు చేయడం చూశాడు.*

*షిరిడీలో ఘమారు సన్నిధిలో షుమారు 1913 -1915 మధ్యకాలంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది.*

*బాబా అంకిత భక్తుడైన వామనరావు పటేల్ ( సాయి శరణానంద ) ఒక అంధుడు ద్వారకామాయిలో కూర్చుని " రామకృష్ణ హరి, జై జై పాండురంగ హరి " భజనలు చేయడం చూశాడు.* 


*తిరిగి అతడిని వామనరావు పటేల్ 1942 - 1943 సం. మధ్యలో అదే ద్వారకామాయి సభా మంటపంలో భగవద్గీత, అమృతానుభవం చదువుతూ కనిపించేసరికి శరణానంద ఆశ్చర్యపోయాడు.*

*అతడికి కంటి  చూపు ఎప్పుడు వచ్చిందని అడిగాడు.* 
*సాయిబాబా కరుణవలనే తనకు కంటిచూపు వచ్చిందని చెప్పాడు.*
*బాబా సజీవంగా ఉన్నప్పుడు చూపు కొంచం మసకగా వచ్చింది.* *సాయిబాబా మహాసమాధి అనంతరం చూపు స్పష్టంగా వచ్చిందని సమాధానం ఇచ్చాడు.*
*సాయిబాబా కటాక్షించిన చూపును ధన్యం చేసుకున్న వ్యక్తి.*

*బాబా సమాధి అనంతరం కూడా తమ అవతార కార్యాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.*

*2. బాబా భక్తురాలైన మాతాజీ కృష్ణ ప్రియ గారు బాబా పూజచేసిన తరువాత, బాబాకు నివేదించిన పదార్ధాలు తగ్గివుండేవి.ఆ తగ్గిన భాగాన్ని బాబా స్వీకరించారని భక్తులు నమ్మేడివారు.*
*ఒకసారి శ్రీ బి. వి. నరసింహస్వామి గారు కొంత హల్వాను కొని, అది ఒక డబ్బా నిండా ఉంచి, స్వయముగా ఆ డబ్బాకు సీలువేసి, సాయిబాబాకు నైవేద్యము నిమిత్తం ఆవిడకు అప్పగించారు.*

*పూజ అయిపోయిన తరువాత ఆమె తిరిగి ఆ డబ్బాను నరసింహస్వామి గారికి ఇచ్చినప్పుడు "నేను ఇచ్చిన డబ్బా సీలు, సీలుగానే వుంది కదా ? అని కృష్ణప్రియగారిని అడిగాడు.*
*అందుకు సరిగాన్నే వుంది స్వామీ ! " అని జవాబిచ్చింది. డబ్బా సీలు తీసి చుడగా హల్వాపై చేతి వేలి గుర్తులు కనిపించాయి.*
*బాబా చేసిన ఈ లీల చూసి అందరూ అశ్చర్యపోయారు.*

*సాయి లీలలు అమోఘం, అనంతం.*

Sunday, July 7, 2024

శ్రీ సాయిబాబా

*సాయి అంకిత భక్తులు - శ్రీమతి చంద్రాబాయి బోర్కర్.*

*సాయిబాబా పేరు ప్రఖ్యాతులు మహరాష్ట్ర రాష్ట్రంలో అంతగా తెలియక ముందే బొంబాయి నగరంలో శివారు ప్రాంతంలో నివశించే శ్రీమతి చంద్రాబాయి బోల్కర్ సాయి భక్తురాలైంది. ఆమె ఏడాదిలో ఆరు నెలలు షిర్డీలోనే నివసించి బాబాను సేవించేది.*

*సాయిబాబా నీటితో దీపాలు వెలిగించడం చూసిన ఈ భక్తురాలు ధన్యజీవి.*

*సాయిబాబాయే స్వయంగా చంద్రాబాయి గూర్చి చెపుతూ "ఈమె నాకు ఏడు జన్మలనుండి నాకు సోదరి " అని మట్లాడేవారు.*

*అందరికి అన్ని వరాలిచ్చే, కామధేనువు, కల్పవృక్షం మించిన శ్రీ సాయినాధుని సన్నిధిలో ఉన్నా ఆమెకు సంతానం కలగలేదు.* 

*సాయిబాబా వరప్రసాది అని, తనకు సంతానం ప్రసాదించగలిగే మహితాత్ముడని అమెకు తెలుసు.*

*కానీ నిరంతరం సాయి దర్శన, సేవ భాగ్యము, తన అదృష్టంగా భావించే, చంద్రాబాయి, బాబాను తనకు సంతానం ప్రసాదించమని కోరలేదు.*

*అంతే కాదు బాబాను మనసావాచా అంకితభావంతో సేవిస్తున్న తాత్యాకోతే పాటిల్ కు కూడా సంతానము లేదు.*
*చంద్రాబాయి బాబాతో, తాత్యాకు సంతానము ప్రసాదించమని కోరేది.*

*బాబా సమాధి చెందక పూర్వము చివర రోజులలో, బాబా చంద్రాబాయిని ఇలా అడిగారు " అమ్మా ! నీ కోరిక ఏమిటి ? అని అడగగా అందుకు ఆమె "బాబా ! నీవు సర్వజ్ఞుడవు, ఎవరికి ఏది అవసరమో, ఎవరి మనసులో ఏమి కోరుతున్నారో నీకు తెలియనిది ఏమీ లేదు " అని జవాబిచ్చినది.*

*ఆమె బాబా దేహం విడిచే అవసాన సమయాన సాయినాధుని నోట్లో నీరు పోసి, పాదాలు కడిగిన భాగ్యశాలి.*

*ఆమె వయసు ఏభయి దాటిపోయి, అమెకు సంతానం కలిగే అవకాశమే లేదన్న సమయములో బాబా అనుగ్రహముచే సంతానము కలిగింది.*
*కొన్నాళ్లకు ఆమె గృహమే సాయి మందిరమైంది.*

Thursday, June 27, 2024

షిర్డీసాయిబాబా మాటలు ప్రతీకలతో నిండి ఉంటాయి.*

*షిర్డీసాయిబాబా మాటలు ప్రతీకలతో నిండి ఉంటాయి.*


*ఉదాహరణకి సాయిబాబా పాముని "లంబా బాబా " అని అంటారు.*
*ఒక చోట భక్తులను ఉద్దేశించి " పైసా " అంటే  బాబా దృష్టిలొ భక్తులు గానీ వ్యక్తియే గానీ డబ్బు కాదు.*

*బాబా అలాంటి మాటలు మహాసమాధికి పూర్వము మట్లాడేవారు.*

*కానీ మహాసమాధి అనంతరం తన మాటలను ప్రతీకలతో జోడించి పలుకుతుంటారు కూడా.*

*బాబా మహాసమాధీ అనంతరం దాసగణు మహరాజ్ కు ఒక స్వప్నం వచ్చింది  ఆ స్వప్నములో బాబా దాసగణుకు సాక్షాత్కరించి " మశీదు కూలిపోయింది.*
*వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి.*
*కనుక ఆ స్థలము విడిచిపెట్టినాను " అని పలికారు.*

*సాయిబాబాను వర్తకులు చికాకుపెట్టడం అనేది జరగని పని.*

*మహామహిమాన్వితుడైన సాయిబాబా ఎక్కడ ?* *వర్తకము చేయు వ్యక్తులు ఎక్కడ ?* 
*సాయిబాబాను సాయి అష్టోత్తర శత నామావళిలో* 
*" అక్షోభ్యయాయ " అని కీర్తిస్తారు.*

*అయితే బాబా పలికిన పలుకులలో అర్థం ఉండదా ?వర్తకులు అను సాయి సాహిత్యంలో అనేక చోట్ల వచ్చునట్టి పదమే.*

*బాబా పలికిన " వర్తకులు " అను పదానికి అర్ధం వేరుగా ఉంటుంది.*

*వర్తకుడు అనగా లాభముకొరకు బేరసారములు చేసి వస్తువులను క్రయవిక్రయము చేసెడివారు.*
*అంటే ఒక వస్తువును తక్కువ ధరకు కొని, ఆ వస్తువును వేరొకచోట లాభమునకు అమ్ముట అనేది వ్యాపారం. అట్టి పనిచేయు ప్రతి వ్యక్తియు వ్యాపారే.*
*అయితే బాబా కూడా వ్యాపారాన్ని తగిన మోతాదులో నడిపిస్తే అంగీకరిస్తాడు. పేరాశకు పొవద్దంటాడు వ్యాపారంలో.*
 *ఒక కొబ్బరికాయ కొట్టి పరీక్షల్లో పాసు చేయమనే కోరికని గర్హిస్తాడు.*

*కనీస అర్హతను కొంచమైనా సంపాదించుకొని కోరికను కోరవచ్చు.*

*గాలిలో దీపంపెట్టి దేవుడా, నీ మహిమను చూపమని బాబాను కోరరాదు.*

*ఒక రూపాయి ఖర్చుపెట్టి లాటరీ టికెట్టు కొని, ఆ లాటరీలో లక్షరూపాయలు కోరుకోవడాన్ని సాయిబాబా అంగీకరించరు.*

*గోరంత భక్తితో కొండంత కోరికను తీర్చుకొనకూడదని సాయిబాబా భావము.*

*బాబా తనను వ్యాపార దృష్టితో చూడవద్దంటారు.*

*అదీ బాబా తత్వం.*

Wednesday, June 26, 2024

సాయిబాబా షిరిడీలో సజీవముగ ఉన్నప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, గోవా మున్నగు ప్రదేశాలలో అనేక మంది భక్తులుండేవారు.

*సాయిబాబా షిరిడీలో సజీవముగ ఉన్నప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, గోవా మున్నగు ప్రదేశాలలో అనేక మంది భక్తులుండేవారు.*


*అందులో బొంబాయి నగరంలో రామకృష్ణ కొఠారీ అని పేరుగల వ్యక్తి మాతృమూర్తి ఒకరు.* *ఒకసారి రామకృష్ణ కొఠారి తండ్రికి న్యుమోనియా జ్వరం వచ్చి పరిస్ధితి విషమించింది.*
*డాక్టర్లు కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాడని చెప్పారు.*
*కొఠారి తల్లికి షిర్డి సాయినాధుడు తప్ప వేరే దైవం లేడు. బాబాను ఆర్తితో ప్రార్ధించింది. షిరిడీకి పాదయాత్ర చేస్తానని మొక్కుకుంది.*

*సాయిబాబా కరుణించినందున కొఠారీ తండ్రి ప్రాణాలు దక్కాయి.*
*మొక్కుకున్నందున కొఠారి తండ్రి, తల్లి,మరి కొందరితో బొంబాయి నుండి పాదయాత్ర చేస్తూ, షిరిడీకి దగ్గరలోగల కోపరగాన్ పట్టణానికి చేరుకున్నారు.*

*అక్కడనుంచి మొక్కుకున్న కొఠారి తల్లి తప్ప మిగతావారందరూ ఎద్దులబండ్లలో షిరిడీకి వెళ్లిపోయారు.*
*కోపెరగాన్ నుండి ఆమె షిరిడీకి నడక మొదలెట్టింది.* *అక్కడనుంచి అమెకు కాళ్ళు వాచిపోయి నెప్పుపెట్టినందున, దారిలో గల ఒక చెట్టుక్రింద విశ్రమించినపుడు,బాగా గెడ్డం పెంచుకొని ఉన్న, పశువుల కాపరిగా కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి " అమ్మా !సాయిబాబా నీ మొక్కును స్వీకరించారు. ఇక నీవు బండిలో షిరిడీకి వెళ్ళు " అని చెప్పాడు.*
*అయినా ఆమె అందుకు అంగీకరించకుండా,నడక సాగించింది.*
*షిరిడీలో అది మధ్యాన్న సమయము ఆరతి సమయము.*
*బాబా ద్వారకామాయిలో ఆసీనుడైయున్నాడు. బాబాకు నిత్యమూ ఆరతి యిచ్చే బాపూసాబ్ జోగ్ బాబాకు హారతి ఇవ్వడానికి సిద్ధపడుతుండగా బాబా, జోగ్ ను కొంచంసేపు ఆగమన్నారు.*
*కొంతసేపటికి రామకృష్ణ కొఠారి తల్లి కాలినడకను ద్వారకామాయిని చేరుకొంది.*

*సాయిబాబాను మనసారా దర్శించుకొన్నది. బాబా ఆక్కడివారితో " ఈ తల్లిని దారిలో కలిసాను. నడక చాలునని చెప్పినా వినిపించుకోకుండా పాదయాత్ర చేసింది "అన్నారు.*

Monday, June 17, 2024

షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అంటున్నది ఏకాదశ సూత్రములో మొదటిది.

*సాయి సచ్చరిత్ర పారాయణ ఫలితం.* 


*"షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అంటున్నది ఏకాదశ సూత్రములో మొదటిది.*

*అమర్నాధ్ బరేలియా అనే సాయి భక్తుడు ఉండేవాడు.*
*సాయి భక్తుడు అని చెప్పుకోవడానికి, సాయి కటాక్షం ఉండాలి.* 
*అలా అనుభూతి చెందిన మనసే సాయి దివ్యత్వాన్ని గ్రహించేది.*

*అమర్నాద్ బరేలియా అనేక సార్లు షిరిడీ యాత్ర చేశాడు. అవన్నీ యాంత్రికంగానే అయినట్టు లెక్క.*
*ఆయన 13 -6 -1985 నుండి అనేక కష్ట నష్టములు అనుభవించాడు.*
*తన దుఃఖ నివారణ కొరకు షిరిడీ చేరాడు. సాయి దర్శనం అయినది.*
*అక్కడికి ఇంకా చాలా సమయమున్నది, అక్కడ గల లైబ్రరీ కి వెళ్ళాడు. అక్కడ గల ఒక ఇంగిలీషు  సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని చదివాడు.*
*కష్ట సాగరాన్ని నుండి బయటపడవేసేది శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ అని తెలుసుకున్నాడు.*
*ఆ గ్రంథంలో సప్తాహ పారాయణ చేయాలని ఉన్నది.*
*గ్రంథం కొందామని బజారుకు వెళ్లాడు.*
*అన్నిటికంటే హిందీ భాషలో గల సచ్చరిత్ర గ్రంథం తక్కువ ధరలో ఉంది.*
*ఆ గ్రంథాన్ని ఏడురోజుల పాటు షిరిడీలో ఉండి పారాయణ చేయడానికి తన వద్ద అంత ధనము లేదు.*
*ఆర్తితో, బాబా కృపతో మూడే మూడు రోజులలో సచ్చరిత్ర ( త్రిదివస ) పారాయణ చేసాడు.*
*తనవద్ద గల కొద్దీ డబ్బుతో ధుని మాతకు నారికేళం సమర్పించి, పటిక బెల్లాన్ని సాయికి నివేదించి తన ఊరికి బయలుదేరాడు.*

*ఆశ్చర్యంగా తన మనసు ఎంతో తేలిక పడిందని గ్రహించాడు.తనకు గల సమస్యలు తీరకుండానే అంత ప్రశాంతత ఎలా కలిగిందని ఆశ్చర్యపోయాడు.*

*ఇంకా 18 -6 -1985 నాడు తన ఇంటికి రాగానే, అమెరికా నుండి తన మిత్రుడు, తన ఇంటికి వచ్చి, తాను లేడని తెలిసి, అదే ఊరిలో గల ఫలానా హోటల్లో ఉంటానని, వచ్చి కలవమని చెప్పి వెళ్లిపోయాడు.*

*వెంటనే అమర్నాద్ ఆ మిత్రుడు ఉండే హొటల్ కి వెళ్లి, తన కష్టాలను అతనికి తెలిపాడు.*
*ఆ మిత్రుడు విని బాధపడి అమర్నాద్ కు ఒక ఉద్యోగం చూపాడు.*
*అప్పటివరకు ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న అమర్నాద్ వెంటనే ఉద్యోగంలో చేరాడు.*
*తన కష్టాలు తొలిగి పోయాయి. కుటుంబం అంతా సుఖముగా జీవించసాగారు.*

 *ఇది అంతా సాయి సచ్చరిత్ర పారాయణ ఫలితమే అని గుర్తించి ఆనందించాడు.*