Monday, April 27, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 6 వ అధ్యాయం -ప్రశ్నలు మరియు జవాబులు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 
6 వ అధ్యాయం -ప్రశ్నలు మరియు జవాబులు 

1. గోపాలరావు గుండు మిత్రుడు పేరు? ఎచటి వాడు?
జ)  దాము అణా కసార్, అహ్మద్ నగర్.

2. జెండాలను ఎన్ని మూలల నిలబెట్టి నారు?
జ) రెండు మూలల నందు.

3. కాకా మహజని దేనిని సంకీర్తన చేయుటకు నిశ్చయించు కొనెను?
జ) రామ ఖ్యానము.

4. ఏది అయినా పని ప్రారంభించ గానే బాబా గారికి ఒక అలవాటు, ఏమిటది?
జ)  బాబా కోపించుట.

5. దాస గణు ముందు సంకీర్తనలను ఎవరు చేసారు? ఎచటి నుండి వచ్చెను?
జ) బాల బువ సతర్కర్, సతరా జిల్లా.

6. షిరిడి లో ఆ రోజులలో అంతపెద్ద సంఖ్య లో జనాలు వచ్చినను ఏమి సంభవించ లేదు?
జ) అంటు వ్యాధులు, అల్లర్లు.

7. బాబా తన జేబు లో నుండి ఒకటి తీసి విసిరేను?
జ) ఒక రూపాయి.

8. ఎవరి కృషి వలన షిర్డీ ఒక సంస్థానంగా రూపొందెను?
జ) రాధాకృష్ణ మాయి.

9. బాలబువా మాలీ కి ఇంకొక పేరు ఏమిటి?
జ) ఆథునిక తుకారామ్.

10. రాధాకృష్ణ మాయి చైత్ర పాడ్యమి నుండి ఏమి ప్రారంభించారు?
జ) నామ సప్తాహం.

11. కాలాహుండీనీ ఏమి పూర్తి అయిన తరువాత పగలు కొట్టేవారు?
జ) హరికథ.
🙏🌷🙏

6వ అద్యాయము

1 .శ్రీ రామ నవమి రోజు ప్రారంభమైన ఉత్సవం ఏది? 
జవాబు) ఉరుసు ఉత్సవం.
2. ఉరుసు ఉత్సవానికి నగిషి జెండా తెచ్చింది ఎవరు?
జవాబు) నానా సాహేబ్ నిమోనకర్.
3 .చందనోత్సవం నిర్వహించిది ఎవరు?
జవాబు) అమీర్ శక్కర్ దలాల్.
4. భీష్మరామ సంకీర్తన ఏ పుస్తకం ద్వారా చేసెను?
జవాబు) రామాఖ్యానం.
5. మసీదు మరమ్మతులు సందర్బంగా ఎవరి పై బాబా ఇటుకరాయి విసిరెను?

జవాబు) మాధవ్ రావు దేశ్ పాండే.(శ్యామా)

No comments:

Post a Comment