Sunday, April 26, 2020

శ్రీ సాయి సత్చరిత్ర ప్రశ్నావళి 1 మొదటి అధ్యాయం ప్రశ్నలు- జవాబులు.

శ్రీ సాయి సత్చరిత్ర  ప్రశ్నావళి
1 మొదటి అధ్యాయం ప్రశ్నలు- జవాబులు.
1. హేమాదిపంత్ తాత గారి పేరు ఏమిటీ?
     జ) సదాశివుడు

2. హేమాది పంత్ ముందుగా ఎంతమంది మునులను స్మరిoచేను?
   జ) 16 మందిని

3. హేమాది పంత్ ముందుగా ఎంత మంది (పండరి భక్తులను) ఆర్వా చీనా యోగీశ్వరులను ప్రార్ధించేను?
జ) నివృత్తి, జ్ఞాన దేవు, సోపాను,ముక్తబాయి,జనార్దన,ఏకనాధ్,నామదేవ,తుకారామ్,కాన్వా, నరహరి.

4. హేమాది పంత్ గృహదెవత ఎవరు? ఎక్కడి వారు? 
జ) నారాయణ ఆదిదేవులు, కొంకణ దేశం

5. హేమాది పంత్ ఎవరి ఎవరి భక్తి మార్గములు పొగిడి వర్ణించెను?
జ) ముగ్గురు పరాశర, వ్యాసుడు, శాండిల్యుడు

6. బాబా గొధుమలు విసురటకు ముందు ఏమి చేసెను?
జ) ముఖ ప్రక్షాళన.

7. బాబా గోధుమలు విసురుట లో ఎంత మంది స్త్రీ లు గుమిగూడిరి?
జ) నలుగురు

8. బాబా గోధుమలు విసురుట లో ఎవరికథ జ్ఞప్తి కి వచ్చును?
జ) కబీర్ దాస్

9. బాబా గోధుమల కధ గురించి హేమాది పంత్ ఒక సాధుపుంగవుడు పేరు చెప్పే ను?
జ) నిరంజనుడు

10. బాబా ఎన్ని రోజులు తిరగలి విసరెను?
జ) 60 ఏండ్లు

11. బాబా ఏ స్వరూపులై తన కధ ను గానము చేసెను?
జ) సరస్వతి స్వరూపులు.

No comments:

Post a Comment