Monday, April 27, 2020

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 5 వ అధ్యాయం -ప్రశ్నలు, జవాబులు

శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి 
5 వ అధ్యాయం -ప్రశ్నలు, జవాబులు

1.  చాంద్ పాటిల్ ఇంట్లో పెళ్లి ఎవరిది?
జ) భార్య తమ్ముని కొడుకు ది.

2. చాంద్ పాటిల్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాడు?
జ) ఔరంగాబాద్ నుండి థూప్ గ్రామానికి.

3. గురు స్థానం భాద్యత ఎవరికి అప్పగించారు?
జ)  సగుణ మేరు నాయక్.

4. శ్రీ సాయి లీలా మాసపత్రిక లో గురు స్థానము వృత్తాంతం ఎపుడు ప్రచురించారు?
రెండవ సంపుటం మొదటి సంచిక, 25వ పేజి.

5. భాయిజీ కృష్ణ జి షిరిడి లో ఎన్ని మాసములు గడిపెను?
జ) ఆరు మాసములు.

6. దామన్ తాత్య బాబా కు ఎన్ని కుండలు ఇచ్చేవారు?
జ) రెండు.

7. బాబా గారు పూల తోట ఎన్ని సంవత్సరాలు పెంచినారు?
జ)  మూడు సంవత్సరాలు.

8. ఎవరి సలహ అనుసరించి పాదుకలు చేయించారు? ఎక్కడ చేశారు?
జ) ఉపాసని, బొంబాయి.

9.  ఉపాసని ఎక్కడ ఉన్నపుడు పాదుకల నమూనా వ్రాయించిరి?
జ) ఖండోబా ఆలయము.

10.  జి. కె. దత్ పూర్తి పేరు తెలుపగలరు?
జ)  గోవింద కమలాకర్ దీక్షిత్.

11. ఎన్ని చుక్కలు నూనె మిగిలి ఉన్న నూనె డబ్బా లో నీరు పోసే వారు?
జ)  రెండు మూడు నూనె చుక్కలు.

🙏🌷🙏
5వ అద్యాయము

1 . కపట గురువు జవహర్ అలీ ఎవరి చేతిలో ఓడిపోయారు?
జవాబు) దేవిదాసు.
2.  బాబా మసీదు రాక ముందు ఎక్కడ నివశించే వారు?

జవాబు) తకియా (రచ్చ).

No comments:

Post a Comment