శ్రీ సాయి సచ్చరిత్ర ప్రశ్నావళి
37వ అధ్యాయం ప్రశ్నలు మరియు
జవాబులు
ఓం శ్రీ సాయిరాం
1. చావడి లో బాబా నిద్రించు స్థలమును ఎవరు అమర్చెవారు?
జవాబు) బాబా స్వయంగా తన పరుపు అమర్చుకునేవారు.
2. చిలుము విషయం లో ఎంత మంది ముఖ్య మైనవారు వున్నారు?
జవాబు) శ్యామ, తాత్య, బాబా, మహల్సా.
3. చావడి ఉత్సవము లో పాల్గొన్న భక్తులు ఎవరు? ఎంత మంది?
జవాబు) 6 గురు, మహల్సా, తాత్య, జోగ్, శ్యామా, దీక్షిత్, నిమొనుకర్.
4. శోభయాత్రలో పాల్గొన్నవారు ఎక్కడ ఆనంద పడేవారు?
జవాబు) మసీదు మూల చేరేసరికి.
5. బాయిజా బాయి కుమారుడు ఏమి సమర్పించేవాడు ఉత్సవము నందు?
జవాబు) చిలుము, అత్తరు, పన్నీరు.
6. చావడి ఉత్సవము ప్రారంభము, పూర్తి అవటానికి ఉన్న వ్యక్తి ఎవరు?
జవాబు) తాత్య.
7. భజన ఎక్కడ ఎలా జరుగును?
జవాబు) వెనుక రధము, కుడివైపు తులసీ, ముందు బాబా.
8. జోగ్ చావడి ఉత్సవము లో ఎన్ని సేవలు చేసేవారు?
జవాబు) 6 సేవలు, ఛత్రము, వెండి పళ్ళెములో బాబా పాదములు, హరతి ఇచ్చేవారు, అర్ఘపాద్యములు, తాంబూలము, గంధము.
9. ఎన్ని వాయిద్యములు పట్టుకుని భజన చేసేవారు?
జవాబు) 5 వాయిద్యములు.
10. రెండు గదులలో హరతులు ఎప్పుడు ప్రారంభించారు?
జవాబు) 1910 డిసెంబర్ 10 వ తేదీన.
11. సాయి గురించి అందరూ ఎరిగిన విషయం ఏమిటి?
జవాబు) శాశ్వత అస్ఖలిత బ్రహ్మాచర్యము.

No comments:
Post a Comment