బాబు ప్రధాన్
శ్రీసాయిబాబా వారి ప్రేమ పరిమాలలను పొందిన భక్తుడినికి ఒక జన్మలో మాత్రమే కాకుండా అనేక జన్మలలో జీవిత కాలకు అనుసరించి వుంటుంది. *దీనికి సరైన ఉదాహరణ బాబు ప్రధాన్ గారికి జరిగిన లీలా.*
బాబు అని పిలువబడే దాదా కెల్కర్ మేనల్లుడికి బాబా అంటే చాలా ఇష్టం. అతను కోపర్గావ్ ,యోవోలా లో రెవెన్యూ సర్వే విభాగంలో మిస్టర్ లిమాయే ఆధ్వర్యంలో కొలతల అధికారిగా పనిచేశారు. బాబు శ్రీసాయిబాబాకు అంకిత భక్తుడు. అతను తరచుగా షిర్డీలో ఉండటానికి సేవ చేయటానికి పని నుండి తప్పించుకుంటు ఉండేవారు. ఈ ప్రవర్తనతో లిమాయే కలత చెంది,అతని ఉన్నతాధికారి సాటేకు తెలియచేసారు. సటే కేల్కర్ కుమారుడు అతను ఈ విషయం గురించి బాబాకు చెప్పమని కోరారు. బాబా కుర్రవాడి భవిష్యత్తును చూడగలిగారు,చేసిన ఫిర్యాదును తేలికగా చూసారు. అప్పుడు బాబా ఇలాబ్ చెప్పారు, "సేవను వదిలి వేసి, అతను నాకు సేవ చేయనివ్వండి". జరిగిన ఈ సంఘటన బాబుకు చాలా సంతోషం కలిగించింది.అతని వైపు బాబా ఉన్నారు
అన్ని సమయాల్లో, సేవా చేయడం ద్వారా బాబా అతన్ని ఎంతో ఇష్టపడ్డారు. ప్రసాదాలుగా వచ్చే చక్కని రుచికరమైన పదార్ధాలను అతనికి ఇచ్చేవారు బాబా.
1910 లో, బాబా తనకు అందించిన చాలా అల్ఫాన్సో మామిడి (అల్ఫాన్సో అనేది ఒక రకమైన మామిడి పండ్ల రకము) పండ్లను తనకి ఇచ్చి అప్పుడు బాబా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కెల్కర్‌తో చెప్పారు. బాబుకు తీవ్ర జ్వరం రావడం ప్రారంభమైంది, అతను చివరి దశకు చేరుకున్న వెంటనే. అతను చనిపోయిన రోజున బాబా కెల్కర్‌ను బాబు సజీవంగా ఉన్నారా అని అడిగారు. పిల్లలు లేని వితంతువును వదిలి బాబు 22 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.
ప్రధాన్‌ను బాబా పాదాల దగ్గరకు తీసుకువచ్చినది చందోర్కర్. అతను శ్రీసాయిబాబా వారిలో దైవత్వం, కరుణ మరియు తన భక్తుల పట్ల ప్రేమ గురించి ప్రకాశవంతమైన వివరణ ఇచ్చారు. అందువలన మే 1910 చివరి వారంలో, ప్రధాన్, అతని భార్య, కోడలు మరియు చందోర్కర్ ఇద్దరు కుమారులు షిర్డీకి వెళ్లారు. వీరంతా ద్వారకమాయి వద్దకు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె గర్భంతో ప్రసవించే దశలో ఉంది. ఆమె ఎప్పుడైనా ప్రసవించగలగడంతో ఆమెను వారితో పాటు తీసుకెళ్లడం మంచిది కాదని ప్రధాన్ భావించారు. కానీ ఆమె తనవారితో పాటు రావాలని పట్టుబట్టింది, ముందు రోజు రాత్రి బాబా గురించి కలలు కన్నారు.
వారు బాబాకు నమస్కారం చేసిన తరువాత వారి సంక్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.అకస్మాత్తుగా అతను శ్రీమతి ప్రధాన్ ను చూపిస్తూ, "ఆమె నా బాబుకు తల్లి అవుతుంది". ఆ సమయంలో అక్కడ ఉన్న షామా
బాబు అంటే ప్రధాన్ యొక్క బావ అని బాబాను అడిగారు. బాబా గట్టిగా, “ఈ స్త్రీ” మళ్ళీ ప్రధాన్ భార్య వైపు చూపిస్తూ అన్నారు. సరిగ్గా 12 నెలల తరువాత ప్రధాన్ భార్య ఒక మగ బిడ్డను ప్రసవించారు.వారు ఆ పుట్టిన మగ బిడ్డకు బాబు అని పేరు పెట్టారు.
ఇక్కడ బాబా మరియు బాబు ఇద్దరూ ఒకరితో ఒకరు ఉండాలని ఆరాటపడ్డారు.
(రిఫరెన్స్: లైఫ్ ఆఫ్ సాయి బాబా, వాల్యూమ్ 3. బి వి. నరసింహ స్వామి చేత).


No comments:
Post a Comment