Saturday, June 13, 2020

షిరిడి కే సాయి బాబా Shiridi ke Sai Baba शिरडी के साईं बाबा శ్రీ హేమాది పంత్ గారు రచించిన శ్రీ షిరిడి సాయి సత్చరిత్ర ను ఆధారంగా చేసుకుని 28/02/1977 "షిరిడి కే సాయి బాబా" అను చిత్రము

షిరిడి కే సాయి బాబా
Shiridi ke Sai Baba
शिरडी के साईं बाबा

శ్రీ హేమాది పంత్ గారు రచించిన శ్రీ షిరిడి సాయి సత్చరిత్ర ను ఆధారంగా చేసుకుని 28/02/1977 పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో తేదీన"షిరిడి కే సాయి బాబా" అను చిత్రము శ్రీ శ్యామ్ మూవీస్ సంస్థ ద్వారా విడుదలయ్యింది.
*ఈ చిత్రం విడుదల అయ్యి సరిగ్గా (43)నలబై మూడు సంవత్సరాలు గడిచింది. ఈ నాటికి ఈ చిత్రానికి ఉన్న జనాదరణ చెప్ప నలవి కానిది.
*ఇంతటి అద్భుత చిత్రాన్ని నిర్మించి మనకు అందించిన" శ్రీ సరళ చారటీస్ ట్రస్ట్" వారికి శ్రీ షిరిడి సాయి భక్తులు అందరి తరపున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
*ఈ చిత్రానికి గాను దర్శకత్వం అశోక్ వి. భూషణ్
మాటలు,స్క్రీన్ ప్లే- మనోజ్ కుమార్
కథా, సంకలన కర్త - దేవ్ కిషన్
సంగీత దర్శకుడు - పాండు రంగ దీక్షిత్
నృత్యం - ఎం.నాయుడు,దీపక్ మజ్ముదార్
ఎడిటర్ - వి.వి. కామత్
ఫోటో గ్రఫీ - ఎం. డబ్ల్యు .ముకుందం
స్పెషల్ ఎఫెక్ట్స్ - కను దేశాయ్
అలంకరణ - ఎన్.కే. జుకర్
దుస్తులు - కిషన్ దమనియా, కృష్ణా బాయి
రికార్డింగ్ - ఫేమస్ సిని లాబొరేటరీస్
స్టూడియో - రాజ్ కమల్ కళా మందిర్‌, మోహన్ స్టూడియోస్, బొంబాయి
పాటలు పాడిన వారు - మొహమద్ రఫీ, ఆశా భోంస్లే, ఉషా మంగెష్కర్, జాని బాబు, అనురాధ పౌంద్వల్, అనుప్ జాలోత,దిల్ రాజ్ కౌర్.
* ఈ చిత్రంలో సాయిబాబా గా నటించిన సుధీర్దాల్వి ని చూస్తే సాయిబాబా నిజంగా అదే రూపంలో ఉంటారేమో అనిపించింది. చిత్ర ఆద్యంతం మనం బాబా గారి తో కలిసి ఉన్న అనుభూతిని కలిగించే అంత గొప్ప గా నటించారు ఆయన. బాబా వారి పాత్ర లో లీనమై ఆ పాత్ర కు ప్రాణం పోశారు.
* తల్లి పాత్రలో హేమమాలిని,సాయి భక్తుని పాత్ర లో మనోజ్ కుమార్, గుడ్డి వాడు అయిన హీరా గా శతృఘ్న సిన్హా, ఆయన బిడ్డ గా నమ్రత శిరోద్కర్, బాయిజా మా గా రత్న మాల, కులకర్ణి గా బీర్బల్, దాసగణు గా మన్మోహన్ కృష్ణ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు అని చెప్ప వచ్చును.
*చిత్రం మొదటి సన్నివేశం తరువాత వచ్చే 
" साईं बाबा बोलो, साई बाबा बोलो"
" సాయిబాబా బోలో సాయిబాబా బోలో" అను పాట బాబా వారి భక్తి గీతాలలో తలమానికం  గా నిలిచి ఉండే లా పాడారు మొహమ్మద్ రఫీ తదితరులు.
*బాబా గారిని ఎప్పుడు తలచుకున్నా కూడా ఆ పాట తప్పక స్ఫురణకు వచ్చే అంత చక్కగా సంగీతాన్ని సమకూర్చారు.
* బాబా గారు తిరిగి షిరిడి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసే మహల్సాపతి, బాయిజా మా దృశ్యం.
*సాయి అని మహల్సాపతి బాబా వారి ని పిలిచే సన్నివేశం అద్బుతం చూసి తీరవలసినదే.
*సాయిబాబా  గురుస్థానం అయిన వేప చెట్టు కింద సత్యం,ధర్మం,ప్రేమ,శాంతి అను నాలుగు దివ్య జ్యోతులు వెలిగే దృశ్యం.
* ఆ జ్యోతుల వెలుగులతో అఖండ ధుని  ప్రజ్వలన దృశ్యం సాంకేతిక అభివృద్ధి చెందని రోజులలో చాలా అద్భుతము గా చిత్రించారు.  ....షిరిడి కే సాయి బాబా- 2భాగం
Shiridi ke Sai Baba- 2nd part 
 ఈ చలన చిత్రములో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను వివరించడానికి ప్రయత్నం.....
* దీపావళి పండుగ రోజున చిన్న పాప కోసం ద్వారకామాయిలో అశ్రువులతో కూడిన నీటితో దీపాలను వెలిగించిన బాబా దృశ్యం అద్భుతం.
*ఆనందం తో పాప "దీపావళి మనాయి సుహని మెరే సాయి హాతో మే జ్యాదు కా పాని "పాటను ఆశా భోంస్లే చాలా బాగా పాడారు.
*శ్రీ సాయిబాబా  'అక్కా' అని పిలిచే భాయిజామాయి దేహ త్యాగ  సమయంలో "పుట్టిన వాడు గిట్టక తప్పదు"అను విషయాన్ని శ్రీ సాయిబాబా ని "మామా "అని పిలిచే తాత్యా కు వివరించే క్రమంలో అందరికీ ఆ విషయం స్పష్టంగా అర్ధం అయ్యే విధంగా గా చూపటం లో దర్శకుని ప్రతిభకు తార్కాణం .
*శ్రీ సాయిబాబా గారు చిన్న పిల్లలతో గోళీలు ఆడుతూ పాడుతూ ఉండటం. శ్రీ సాయిబాబా గారికి చిన్నపిల్లల పట్ల ప్రేమను చూపుతుంది.
*లోకమాన్య బాలగంగాధర తిలక్ పంపిన భగవద్గీత గురించి వివరించే క్రమం లో బాబా గారు గీతా ఖురాన్, బైబిలు అన్ని కూడా ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయి అని చెప్పే సన్నివేశం అద్బుతం.
*శ్రీ సాయిబాబా తన శరీరాన్ని 3 రోజులు విడిచి వెళ్ళిన క్రమంలో భక్తులు అందరు కలిసి బాబా కోసం
"సాయి బాబా బోలో సాయి బాబా బోలో"
ఆలపించిన పాట లో నటి నటులు అందరూ కూడా చాలా బాగా చేశారు అని చెప్పాలి.
*శ్రీ సాయి బాబా తన చేతినే  గరిటేగా ఉపయోగించి బాగా వేడి ఉన్నవంటను చేసి భక్తులకు సహపంక్తి భోజనం ఏర్పాటు  అన్నదానం  చేసే విధానం చూడవలసిందే.
*వర కట్నం కారణంగా అగిన వివాహం తిరిగి జరిపించిన విధానం గాని తప్పక చూడాలి.
*కులకర్ణి ఇంటికి భోజనానికి వెళ్ళిన సన్నివేశం, బ్రహ్మ జ్ఞానం పొందాలంటే  పంచేంద్రియాలు మీద నిగ్రహాన్ని పెంచు కోవాలని వివరించిన దృశ్యం గాని చాలా బాగున్నవి.
*హేమాదిపంత్ కు శ్రీసాయిసత్చరిత్ర రచించడానికి అనుమతిని ఇవ్వడం, బూటీ వాడా నిర్మాణానికి  శ్రీమాన్ బూటికి అనుమతిని ఇచ్చే విధానం గాని చూడదగినవి.
*బూటి వాడా నిర్మాణం సమయంలో బాబా గారు కొన్ని మార్పుల సూచనలు ఇవ్వడం
* "తుహి ఫకీర్,తుహి రాజ
సాయినాథ్ తేరే హజారో హాత్"
మొహమ్మద్ రఫీ , ఉషా మాంగేశ్కర్ గానం అద్బుతం.
*హీరా అనే అతనికి  దృష్టిని ప్రసాదించే సన్నివేశం చాలా బాగా చిత్రీకరించారు.
*తాత్యా కు వ్యాధి మరియు శ్రీసాయి బాబా మహా సమాధి సన్నివేశలను  చాలా హృదయానికి హత్తుకొని విధంగా చిత్రించారు.
*షిరిడి కే సాయి బాబా చిత్ర నిర్మాణం గాని, దర్శకుడు అయిన అశోక్ వి. భూషణ్ గారి దర్శకత్వ తీరు అద్భుతం అని చెప్ప వచ్చును.
*ఎడిటర్ గా చేసిన ప్రముఖ రచయిత  శ్రీ వి.వి.కామత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పి తీరాలి కథా కథనం లో ఎక్కడా కూడా భావం దెబ్బ తినకుండా అందరికీ కూడా బాబా గారి లీలలు చిరకాలం గుర్తు ఉండే విధంగా బాబా గారి ప్రతి లీలను అద్బుతం గా చూపే ప్రయత్నం లో సఫలీకృతం అయ్యారు.
*శ్రీసాయి బాబా గా నటించిన సుధీర్ దాల్వి ఆ పాత్ర లో ఇమిడి పోయారు.
*ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ తమ పాత్రలకు జీవం పోశారు.
*శ్రీసాయి బాబా గారి భక్తులు అయిన ప్రతి ఒక్కరు కూడా జీవితం ఖచ్చితంగా చూడ వలసిన సినిమా ఇది.
*ఇందులో ప్రతి సన్నివేశం ద్వారా బాబా గారు మానవాళికి నేర్పిన జీవిత సత్యాలను గురించి తెలసుకోవాల్సిందే.
*అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చూడవలసినది మనవి చేస్తున్నాను.
*ఆ షిరిడి సాయి బాబా వారి ఆశీస్సులు సదా అందరి పై వర్షించాలని అభిలషిస్తున్నాను.

No comments:

Post a Comment