Tuesday, June 16, 2020

శిరిడీ సాయి విభూతి లీల బాలాజీ నేవాస్కరు


శిరిడీ సాయి విభూతి లీల

ఊదీతో నయమయ్యే రోగాల గురించే కాదు, ఆపత్కాలంలో ఊదీతో తీరిన కష్టాల గురించి కూడా సచ్చరిత్రలో ప్రస్తావన వస్తుంది. ఉదా॥ బాలాజీ నేవాస్కరు అనే భక్తుడు తన జీవితాంతం బాబాను తలుచుకుంటూ, కొలుచుకుంటూ గడిపేశాడు. అలాంటి బాలాజీ సంవత్సరీకాన్ని అతని కుటుంబం శ్రద్ధగా నిర్వహించాలనుకుంది.కానీ నేవాస్కరు కుటుంబం ఊహించినదానికంటే మూడురెట్లు బంధువురు ఆ సంవత్సరీకానికి వచ్చారు. వారిలో వంటకాలు చూస్తేనేమో వారిలో మూడోవంతుకి మాత్రమే సరిపోయేట్లు ఉన్నాయి. ఆ పరిస్థితి చూసి బాలాజీ భార్య గాభరాపడిపోయింది.కానీ అతని తల్లి మాత్రం ఆ వంటకాలన్నింటి మీదా కాస్త ఊదీని చల్లి, వాటిని గుడ్డతో మూసివేయమని సలహా ఇచ్చింది. ఇది సాయి ఆహారమేననీ! ఆయనే తమను ఆ స్థితి నుంచి కాపాడతాడనీ... అభయమిచ్చింది.బాలాజీ తల్లి నమ్మకం ప్రకారమే వండిన పదార్థాలు అందరికీ సరిపోవడమే కాకుండా... ఇంకా మిగిలిపోయాయి కూడా! సద్గురువును నమ్ముకోవాలి. ఈ భవసాగరాన్ని అవలీలగా కాళ్ళకు తడి అంటకుండా దాటగలం

No comments:

Post a Comment