యోగులందరూ ఒక్కటే..
అక్కలకోట్ మహరాజ్ మరణించు సమయంలో జరిగిన లీల ఇది. 1878లో
తారేదేవ్ కు చెందిన కేశవనాయక్ అనే భక్తుడు మహరాజ్ తో ఇలా అన్నాడు. "మహరాజ్ నువ్వు వెళ్లిపోతే ఇక నాకు రక్ష ఎవరు?" మహరాజ్ అతనికి తన పాదరక్షలను పూజించమని ఇస్తూ- "నా అవతారం అహమద్ నగర్ జిల్లా షిర్డీలో ఉంటుంది.
ఎప్పుడు అక్కడికి వెళ్లినా భక్తిపూర్వకంగా వెళ్లు. నువ్వలా చేస్తే నన్ను గుర్తుంచుకొన్నట్టే! నువ్వు సంతోషంగా ఉంటావు.
అక్కలకోట మహరాజ్ పరమ పదించాక, కేశవనాయక్ అతని కుమారుడు రామచంద్రనాయక్, మరో ఇద్దరు సంప్రదాయ బ్రహ్మణులతో కలసి షిర్డీ వెళ్లారు. దారిలో ఆ
బ్రాహ్మణులు బాబాను పిచ్చి ముస్లింగా పరిగణించారు. బాబా వద్ద తలవంచ కూడదని అనుకున్నారు. నలుగురూ బాబాను చేరారు.
సాయిబాబా: (కేశవ్ నాయక్ తో) నువ్వు నీ కుమారుడు ఇష్టమైతేనే నా వద్దకు రండి, (మిగిలిన ఇద్దరు బ్రాహ్మణులతో) వీరు కర్మతః బ్రాహ్మణులు.
సాయిబాబా: (రామచంద్రనాయక్ తో) వేపాకులు తీసుకురా! (తీసుకురాగా బాబా వాటిని నలుగురికీ పంచి, వాటిని తిని రుచి చెప్పమన్నారు).
బ్రాహ్మణులు: (ముఖాలు వికారంగా పెట్టి) చాలా చేదుగా ఉన్నాయి.
నాయక్, అతని కుమారుడు: బాబా! ఆకులు తియ్యగా ఉన్నాయి, మేం చాలా ఆకులు తిన్నాం.
ఈ విధంగా బాబా మేకల నుంచి గొర్రెలను వేరుచేసినట్లు తనపై విశ్వాసం లేని వారికి అలా నిదర్శనం చూపించారు. మిగతా ఇద్దరు నిజ భక్తుల కేశవ్ నాయక్, అతని కుమారుడు)కు అక్కలకోటమహరాజ్ చెప్పినట్టుగా తానే మహరాజ్ నని నిరూపించారు. నేను మిర్జ్ గావ్ లో ఉన్నాను 'ఫకీర్ బువా' రూపంలో ఉన్నాను. ఇక్కడి వరకు ఎందుకు రావడం? నేను బంద్రా మౌలానాను. నేను నాందేడ్ మౌలానాను. నువ్వు ఇప్పటికే నాకు రూ. 3-14 అణాలు ఇచ్చి ఉన్నావు. నువ్వెక్కడున్నా నేను నీతోనే ఉన్నాను, ఉంటాను. నన్ను తీసుకువెళ్లడానికి వాహనాలు అక్కరలేదు.
🌷శ్రీ సాయినాథాయ నమః🌷
Source :- నేనుండ భయమేల.
Dr. Kumar Annavarapu.

No comments:
Post a Comment